▼

Wednesday, June 17, 2020

13. ఓ మనిషి.... జీవితం…… ఏది శాశ్వతం

ఓ మనిషి.... జీవితం…… ఏది శాశ్వతం


• రాసిన రాతలు రాయయ్యేనా
• చేసిన చేతలు చేదయ్యేనా
• మాటాడిన మాటలు మౌనమా యేనా
• నడచిన నడతే నలుసయ్యేనా
• గెలిచిన గెలుపే గేళి య్యేనా
• కలసిన కలయిక కాటేసే నా
• ఈసడించిన ఈర్ష్య ఈల యేసేనా
• దేహించిన దేహం దేభ్యమయ్యేనా
• అందించిన అండే అణగతోక్కే నా
• అలవిగాని అసూయ ఆరాధన య్యేనా
• హేళన తో హోళీ చేస్తే హంకారమే (అహంకారం)
• ద్వేషంతో దండిస్తే దారిద్ర్యమే
• కాంతిని కాయలనే కన్ను కనుమరుగే
• పైన చేయ్యేస్తే పైవాడై అయిపోలేం
• ప్రతీకారానికి ప్రతి రూపమా నీ ప్రతిభ
• ఏం వజ్రం చీకట్లో మెరవదనుకున్నావా
• వజ్ర కాంతి కి చీకటి వెలుతురు సమానమే
• చేసిన చేతలు మనసు చెపుతున్నా ... అర్థం కానట్టు నటించాలా......లేకపోతే జీవితానికి మనుగడ కష్టమా. ఎందుకు  ఈ దుస్థితి.

• ఏ ఎండకు ఆ గొడుగేనా జీవితం.

• పతనానికి ప్రయాణమైన  జీవితానికి జాలి తప్ప ... ఏమి చేయగలము.

• మనం చేసే ప్రతి కర్మని పంచభూతాల తో సహా వందల కళ్లు గమనిస్తూ నే ఉన్నాయి. ఎందుకంటే ఆ కళ్లన్నీ  గుడ్డివి కావు……కొన్ని కళ్ల లాగ….

• మాయ మంచిదే… భాధకు మగతనిస్తుంది.  ఎక్కువైతే  నిజం కాన రాక జీవశ్చవం అయిపోతాం.


యడ్ల శ్రీనివాసరావు  June 2022

No comments:

Post a Comment