▼

Sunday, October 18, 2026

790. బొమ్మల కొలువు

 

బొమ్మల కొలువు

ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీ మాత్రే నమః 



• లక్ష్మి గాంచిన  కళలతో  నిండిన 

  లక్షణమైన   కొలువు 

  ఈ బొమ్మల  కొలువు .

• పల్లె  నుంచి  పరలోక  వాసాల  

  దేవతల   కొలువు 

  ఈ బొమ్మల కొలువు .


• లక్ష్మి గాంచిన  కళలతో నిండిన 

  లక్షణమైన   కొలువు 

  ఈ బొమ్మల  కొలువు.


• ప్రతిమలు  కావవి.  పవిత్రత ను  చాటే

   ఆది సనాతన   దేవి  దేవత 

   సంస్కృతి    సాంప్రదాయాలు.

• చూసిన    కళ్ళలో   మెరిసెను 

   తార  సితారల  వెలుగులు .

• కొలువు   చేసిన   ఇళ్ళలో  వెలిసెను 

   సిరి   సంపదల  నెలవు .


• ఈ  బొమ్మల  కొలువు 

  "అనంత" మై   లక్ష్మి  

  ఇంట   ఆనందానికి   నెలవు.


• లక్ష్మి గాంచిన కళలతో నిండిన 

   లక్షణమైన   కొలువు 

   ఈ  బొమ్మల  కొలువు.


• ఈ బొమ్మల కొలువు.

   ఆనందపు   నెలవు.

  ఈ బొమ్మల  కొలువు.

   ఆనందపు   నెలవు.



హైదరాబాద్ లో ఉన్న  సోదరి అనంతలక్ష్మి , గృహం లో విజయ దశమి సంధర్బంగా జరిగిన బొమ్మల కొలువు వీడియో  చూసినపుడు ,  మనసు లో  అనిపించిన సందర్భం ఈ రచన. 

వీడియో కోసం లింక్  పై click చేయండి 👇👇👇

https://youtube.com/shorts/H4M1RaSXqVs?si=Ds5bnkbJaHCFEfLs




విశ్వ వ్యాప్తం గా ఉన్న తెలుగు వారందరికీ,   బ్లాగు 2 Lakhs  views  reach  అయినందుకు  కృతజ్ఞతలు 🙏 


విజయ దశమి శుభాకాంక్షలు 🙏 


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 17 Oct 2026 12:30 PM.


No comments:

Post a Comment