మౌనంగా అందరినీ వదిలేయండి
(మూడవ భాగం)
దయచేసి ఒకటి ,రెండవ భాగాలు (803 ,804) చదివిన తరువాత మాత్రమే ఈ రచన చదువగలగరు 🙏
ఇంతవరకు మీరు ఇతరుల వెనక పరిగెడుతున్నారు. కానీ ఎప్పుడైనా మీ లోపలి గొంతును విన్నారా ? మీరు అందరికీ సమయం ఇచ్చారు కానీ మీ సొంత కలలకు ఎప్పుడైనా సమయం ఇచ్చారా ? అందరి సమస్యలను మోసారు కానీ మీ ఆత్మ మీద ఉన్న బరువును ఎప్పుడూ చూడనేలేదు. ఇప్పుడు ఈ దిశను మార్చే సమయం వచ్చింది. విరిగిపోయిన ఇల్లును ఎలాగైతే తిరిగి కట్టవచ్చో అలాగే విరిగిపోయిన మనసును కూడా కొత్తగా కట్టవచ్చు. ప్రతిరోజు ఒక ఇటుకను అమర్చాలి. ఒక కొత్త అలవాటు , ఒక కొత్త ఆలోచన , ఒక కొత్త నిర్ణయం మరియు ఒక కొత్త క్రమశిక్షణ కానీ గుర్తుంచుకోండి ఏ పెద్ద మార్పు ఒక్క రోజులో జరగదు అది చిన్న చిన్న అడుగుల ద్వారా పుడుతుంది కాబట్టి తొందర పడకండి అలాగే ఆగిపోకండి.
ఉదయం లేచి మీతో మీరు ఇలా చెప్పుకోండి. ఈరోజు నేను నా శక్తిని వ్యర్థం చేయను. నా విలువ తెలియని వ్యక్తి గురించి ఈరోజు నేను ఆలోచించను. నన్ను చులకనగా చూసిన ప్రదేశం గురించి నేను చింతించను. ఈరోజు నన్ను నేను నిర్మించుకుంటాను. ఇతరుల గురించి ఆలోచించడం లో వ్యర్థమవుతున్న శక్తిని ఇప్పుడు మీ భవిష్యత్తు నిర్మాణంలో పెట్టుబడి పెట్టండి. దుఃఖంలో చుట్టుకుపోతున్న శక్తిని మీ లక్ష్యం వైపు మళ్లించండి.
కానీ , మనుషుల యొక్క అత్యంత ప్రమాదకరమైన అలవాటు ఏమిటో మీకు తెలుసా . . . మీకోసం ఎప్పుడూ లభ్యం కాని (అందుబాటులో లేని) జనుల కోసం మీరు ఎప్పుడూ లభ్యంగా (అందుబాటు లో) ఉండటం . మనుషులు పదే పదే ఇదే తప్పు చేస్తారు. ఎక్కడ గౌరవం దొరకదో అక్కడికే తిరిగి వెళ్తారు. ఎక్కడ మనసు కి బాధలు నొప్పులు దొరికాయో అక్కడే ఆశలు పెట్టుకుంటారు . ఎక్కడ విరిగి పడ్డారో అక్కడే ప్రేమను వెతుకుతారు .
దయచేసి అర్థం చేసుకోండి ఇది ప్రేమ కాదు. ఇది కేవలం ఒక పాత అలవాటు .
మెలుకువ తెచ్చుకోండి మిమ్మల్ని పదే పదే విడగొట్టే ఆ వ్యక్తిని లేదా ఆ ప్రదేశం , ఆ సాంగత్యం . . . మీ ఇల్లు గా కావడం , సదా కాలం సాధ్యం కాదు . అందుకే, మౌనంగా అందరినీ వెనక్కి వదిలేయండి , అంటే కేవలం పాత జనాలనే కాదు మీ పాత ఆలోచనలను కూడా వదిలేయడం .
నేను ఒంటరిగా బ్రతకలేను . నా విలువను ఇతరులు నిర్ణయిస్తారు. వారు లేకుండా నేను సంతోషంగా ఉండలేను , అనే భ్రమలన్నింటిని ముందు వదిలేయండి . మనుషులు మొదట మనసుకే బంధి అవుతారు. ఆ తర్వాతే బంధాలకు . ఒకసారి మీ మనసు స్వతంత్రమైతే ప్రపంచంలోని ఏ గొలుసు కూడా మిమ్మల్ని బంధించలేదు .
ఇప్పుడు మీ మనసు లో కొత్త స్థలాన్ని సృష్టించండి. మొదట ఎక్కడెక్కడ ఫిర్యాదులు ఉన్నాయో అక్కడ కృతజ్ఞతను తీసుకోండి. ఎక్కడ కోపం ఉందో అక్కడ అవగాహనను తీసుకోండి. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ అభ్యాసాన్ని తీసుకోండి. ఎక్కడ పోలిక ఉందో అక్కడ ఆత్మవిశ్వాసాన్ని తీసుకోండి. ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ ఖాళీ స్థలంలోనే కొత్తదాన్ని నింపుతుంది . . .మీలో పాత చెత్తే , నిండి ఉంటే కొత్త వెలుతురు ఎలా ప్రవేశిస్తుంది?
కానీ కొద్దిగా ఆగండి. మీరు పాత వారిని వదిలేసినప్పుడు ఒక విచిత్రమైన ఆట మొదలవుతుంది.
మీరు వదిలి వేసిన వారు ఏం చేస్తారో తెలుసా మీరు దూరం అవుతుండగానే కొందరు వ్యక్తులు మిమ్మల్ని గుర్తు చేసుకోవడం ప్రారంభిస్తారు. ఎందుకో తెలుసా . . . ఎందుకంటే , వారికి మీరు కావాల్సి కాదు. మీ నుండి వచ్చే సౌలభ్యాలు కావాలి. వారికి మీపై ఉన్నది ప్రేమ కాదు , మీరు వారికి ఒక అవసరం. మీ లభ్యత మాత్రమే వారికి కావాలి.
మిమ్మల్ని కోల్పోయి , కేవలం మీ సౌలభ్యాన్ని మాత్రమే ఆశించే వారు , మిమ్మల్ని ఎప్పటికీ పొందినట్లే కాదు . కాబట్టి తిరిగి వెళ్లి వారి వలలో పడకండి . కరుణ చూపడం వేరు , మళ్ళీ ఆ వలలో పడిపోవడం వేరు.
ప్రపంచంలోని అతి పెద్ద శక్తి ఏమిటో మీకు తెలుసా? . . . మీరు ఒంటరితనంలో ఒదిగి ఉండడం . ఇప్పుడు మీరు మీ ఒంటరితనాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకోవాలి. అక్కడ మిమ్మల్ని మీరు చదవగలరు , మీరు ఎన్నో నేర్చుకోగలరు . మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి . అపరిమితమైన సమయం లభిస్తుంది , ధ్యానం చేయండి . ప్రణాళికలు వేసుకోండి . కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి . మరియు ధర్మం గా డబ్బు సంపాదించే మార్గాలను కనుగొనండి.
చాలామంది జనాలు ఒంటరితనంలో కూర్చొని ఏడుస్తారు. కానీ కొందరు అదే ఒంటరితనంలో మిమ్మల్ని మీరు గట్టిగా నిర్మించుకుంటారు. ఇప్పుడు నిర్ణయం మీదే మీ మనసు నొప్పిని ఒక సాకుగా మార్చుకుంటారా లేదా ఇంధనంగా వాడుకుంటారా?
గుర్తుంచుకోండి . . . తనతో తాను సంతోషంగా ఉండటం నేర్చుకున్న వ్యక్తిని , ఈ ప్రపంచం ఎప్పటికీ నియంత్రించలేదు. మేము నిన్ను వదిలి వెళ్ళిపోతాము అని ఎవరిని బెదిరించడానికి ఎవరికీ సాధ్యం కాదు.
ఎవరు ఒంటరిగా ఉండటం నేర్చుకుంటాడో అతను సగం ముక్తుడు అవుతాడు. ఎవరు ఒంటరితనాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటాడో అతను పూర్తిగా స్వతంత్రుడు అవుతాడు.
మిగిలినది నాల్గవ భాగం లో . . .

No comments:
Post a Comment