Friday, May 15, 2020

6. కళాశాల

కళాశాల
(మూలం:  ఇంటర్మీడియట్ కళాశాలలో తన వద్దకు వచ్చిన ఎంతో మంది యువతీ యువకులను  చూసి కళాశాల తనలో తను అనుకుంటుంది )



• ఎన్నో చూసా
  నేను ఎన్నో చూసా
  రంగురంగుల చొక్కాలు
  రంగురంగుల పైజామాలు
  రంగురంగుల పరికిణీీలు.


• సిగ్గు తెరల మాటున 
  చిలిపి జంటల హొయలు ఎన్నో చూశా.


• నూనూగు మీసాల పలకరింపులు
  చిలక నవ్వుల తొలకరి సిగ్గులు.


• ఓరచూపు నీలి కళ్లు
  అదిమిపట్టే పెదవులు.


• ఎదురే  లేదన్న  దైర్యం తో  
  గోడలెక్కిన   ఎన్నో  క్రాఫులు (అబ్బాయిలు).
  భయం  మాటున  దాగి  దాగి 
  నడుస్తున్న  ఎన్నో  కొప్పులు (అమ్మాయిలు).


• కండ కలిగిన బాహువులు
  కోయిల లాంటి కంఠస్వరాలు  
  ఎన్నో చూసా ... నేను ఎన్నో చూసా.


• నాలో (కళాశాల) అడుగు పెట్టగానే
  ఆవిరైన  బాధలు,  
  చిగురు తొడిగిన చిరునవ్వులు.


• చెట్టు  చాటు  మాటలు
  గడ్డిపైన   బాటలు
  చేయి  చేయి  స్పర్శలు.


• గాలికి   ఊగే  ఝంకాలు
  అలజడి  చేసే  అధరాలు.


• బొద్దుగా  ఉండే  చెక్కిళ్ళు
  గోదావరి  పాయ లాంటి  పాపిళ్లు.


• వాలు  జడల  వలపు హోయలు
  జడ గంటల గలగలు.


• కాలి మువ్వల సవ్వడులు
  నిటారు  నడకలు. 
  రివ్వున  ఎగిరే  పరికిణీలు
  వేయికళ్లకు  ఆనందాలు.


• ఊగిసలాడే  మనసులు
  ఊహలో  తేలే  వయసులు
  ఆనందం....ఆనందం 
  ఎటు చూసిన  హద్దే లేని ఆనందం.


• ఒకటేమిటి
  ఎన్నో చూసాను
  నేను ఎన్నో చూసాను.


• ఆకలి లేని రోజులు
  నిద్రలేని  రాత్రులు 
  తొలి పొద్దు   కోసం  ఎదురుచూపులు.


• ఉనికి  చాటుకునేందుకు  ఉపాయాలు
  ఉరకలు  వేసే  ఉత్సాహాలు
  లక్ష్యాల  కోసం   విశ్రాంతి లేని పోరాటాలు


• ఒకరి కష్టానికి పదిమంది చేయూత
  పదిమంది సంతోషానికి వందమంది ప్రేరణ


• కాలచక్రం తిరిగిపోయింది
  రెండు సంవత్సరాలు

• దగ్గరలోనే దూరం 
  దూరం లోనే దగ్గర

• భారమైన మనసులు
  మూగబోయిన ఆశలు

• ఏకాకిలా వచ్చారు
  జంటలుగా వెళుతున్నారు

• కొందరిది  స్నేహం 
  కొందరిది ప్రేమ
  మరి కొందరిది ఏకాంతం

• అర్థం కాని అనుభవాల తో  
  వయసు పడే ఆరాటం
  మనసు చేసే పోరాటం.


• జీవితం  ఎవరిని   గెలిపిస్తుందో 
  ఎవరిని  ఓడిస్తుందో
  కానీ   ఉండాలి    అందరూ ఆనందంగా .


ఎందుకంటే 
నా (కళాశాల) సాక్ష్యం తోనే 
కలిశారు కదా మీరంతా!


 యడ్ల శ్రీనివాసరావు 16 May 2020








No comments:

Post a Comment

806. మౌనంగా అందరినీ వదిలేయండి-4

  మౌనంగా అందరినీ వదిలేయండి (నాల్గవ భాగం) దయచేసి . . .  మొదటి మూడు భాగాలు     (803 ,804 ,805 ) చదివిన తరువాత మాత్రమే ఈ రచన చదువగలగరు 🙏   ఇ...