Monday, May 31, 2021

61. ఏమయ్యావు…. మిత్రమా

 

ఏమయ్యావు…. మిత్రమా

·        ఏమయ్యావు మిత్రమా….ఏడున్నావు స్నేహమా…

·        కాలినడక తో కాలేజీ కి  చెట్టాపట్టాల్…..కాలక్షేపం తో  కాలం తెలియని కబుర్లు.

·        ఆంగ్లం అర్థం కాని ఈ మట్టి బొమ్మకి…..నీ అనువాదం తో ఆనందం గా బుట్ట బొమ్మ ని చేశావు.

·        తెలుగు మాష్టారి(శర్మగారు) పాఠం తదుపరి మిత్రురాలు  ఐ. వెంకటలక్ష్మి తో వెటకారాలు, లక్ష్మీ జడ మన బల్ల పై పడితే పెన్ను తో పక్కకు తోసే ఆటలు…. అంతకు మించి జడకు అంటించిన చూయింగ్ గమ్….ఏల మరువను నీ స్మృతులు.

·        సాయం సమయాన గోదావరి గట్టు పై,  చెట్టు చెంత పిట్ట గోడ పై, అల్లరి చేష్టలు….నీ నసీమా(ముస్లిం అమ్మాయి, మా క్లాస్) కోసం నీ ఎదురు చూపులు,  మీ ఇద్దరి మౌన వేదనలు…నాకు తొలి ఆనందాలు.

·        అల్లరి కి అర్థం నీవు…ఆ అర్థానికి ధైర్యం నేను…కలబోతయే మన మిత్రబృందం.

·        మన మాటల్లో సంతోషం…మనకు నిత్య యవ్వనం…ఎంతటి కష్టాలైనా కరిగిపోయేవి.

·        కరోనా కలకలంతో , కడలిలా కల్లోలం అయ్యెను మన చెలిమి.

·        చెరగని, చెదరని నీ రూపానికి, నీ ఆలోచనలే జీవం.

·        అలుపెరుగని జీవన ప్రయాణం లో మన దారులు వేరైనా….గమ్యాన్ని చేరడానికి మరీ ఇంత తొందర ఎందుకు రా నీకు!....

 

 

అశృతాంజలి

YSR 31 May 21, 10:00 am

 

 

 

 

 

 

No comments:

Post a Comment

806. మౌనంగా అందరినీ వదిలేయండి-4

  మౌనంగా అందరినీ వదిలేయండి (నాల్గవ భాగం) దయచేసి . . .  మొదటి మూడు భాగాలు     (803 ,804 ,805 ) చదివిన తరువాత మాత్రమే ఈ రచన చదువగలగరు 🙏   ఇ...