Friday, May 27, 2022

188. ఊహలు ఊసులు

 

ఊహలు ఊసులు


• ఊహలు ఊహలు ఊరేగెనే ఊహలు.

• ఊసులు ఊసులు ఊయలలో ఊసులు.


• జపించిన జపము తో నిజమాయెను కలలు.

• కరుణించిన కాలము లో కలిసిపోయెను కవళికలు.


• స్పర్శ కి స్పర్శ తోడైన  నీడంతా ఆయెను వెన్నెల వాడ.

• సిరి రాగము ల తోడ శృంగారము జాడై నిజమాయెను ఊహలు.




• ఊహలు ఊహలు ఊరేగెనే ఊహలు.

• ఊసులు ఊసులు ఊయలలో ఊసులు.


• ఆరేసిన అందంతో మెరిసెను మెరుపుల కాంతులు.

• ఆశల జల్లులతో తడిచెను తలంబ్రాల సొగసులు.


• శ్వాస  కి  శ్వాస  జతైన  వేళన   ఊపిరులే  ఆయెను చిరు చెమటలు.

• కురులు తెరలుగా ఎగిరి ముఖమును తాకుతుంటే నిజమాయెను ఊసులు.




• ఊహలు ఊహలు ఊరేగెనే ఊహలు.

• ఊసులు ఊసులు ఊయలలో ఊసులు.


• ఇసుక తిన్నె చందముగా విరిసెను కాంతన కటి కనకము.

• ఒలికిన ఒయ్యారము ఒరిగెను నెలవంక లా


• ధ్యాస తో ధ్యాస లీనమైన ఊహలే  ఆయెను హేలలు.

• తారలు తమ ఉనికి కై వెతికినపుడు నిజమాయెను ఈ ఊహలు ఊసులు.


• ఊహలు ఊహలు ఊరేగెనే ఊహలు.

• ఊసులు ఊసులు ఊయలలో ఊసులు.



కవళికలు = మార్పులు

వాడ = ప్రదేశం.

హేలలు = విలాసాలు , శృంగార చేష్టలు


యడ్ల శ్రీనివాసరావు 27 May 2022 11:00 PM.





No comments:

Post a Comment

806. మౌనంగా అందరినీ వదిలేయండి-4

  మౌనంగా అందరినీ వదిలేయండి (నాల్గవ భాగం) దయచేసి . . .  మొదటి మూడు భాగాలు     (803 ,804 ,805 ) చదివిన తరువాత మాత్రమే ఈ రచన చదువగలగరు 🙏   ఇ...