Saturday, September 28, 2024

539 కళ్యాణం


కళ్యాణం


• ఈ   రేయి      పలికిన    రాగం     నిరీక్షణం.

  ఈ   వెన్నెల    వేసిన     తానం     సంగమం.

  ఈ   కాలం     రాసిన     పల్లవి     కళ్యాణం.


• రాగం   తానం   పల్లవి

  మధురం   …  సుమధురం.

• ఈ  రేయి   వెన్నెల   కాలం 

  యోగం    …    సంయోగం.


• అలికిడి   లేని   అందెల లో

  సరిగమలు     సన్నగిల్లాయి.

• ఊగిసలు  లేని    జుంకాల లో

  పదనిసలు    బోసి  పోయాయి.


• ఈ  రేయి    పలికిన    రాగం     నిరీక్షణం

  ఈ  వెన్నెల   వేసిన     తానం     సంగమం

  ఈ  కాలం    రాసిన     పల్లవి     కళ్యాణం.


• నిరీక్షణ    సంగమ   కళ్యాణం

  రంజనం   …  రస  రంజనం.

• రాసి   వేసిన    పలుకుల

  గారం    …   శృంగారం.


• అలజడి   లేని    ముక్కెర కి

  ఊపిరి   తాపం   కరువయ్యింది.

• జీవం     లేని    మోము కి

  నెలవంక     లోటయ్యింది.


• ఈ    రేయి      పలికిన    రాగం    నిరీక్షణం

  ఈ    వెన్నెల    వేసిన     తానం    సంగమం

  ఈ    కాలం     రాసిన     పల్లవి    కళ్యాణం.


• ఈ  గళం     శుభ     మంగళం

  ఈ  భోగం   భూత   సంభోగం.



భూత =  గతం.

యడ్ల శ్రీనివాసరావు  10 Sep 2024 7:00 PM.


No comments:

Post a Comment

806. మౌనంగా అందరినీ వదిలేయండి-4

  మౌనంగా అందరినీ వదిలేయండి (నాల్గవ భాగం) దయచేసి . . .  మొదటి మూడు భాగాలు     (803 ,804 ,805 ) చదివిన తరువాత మాత్రమే ఈ రచన చదువగలగరు 🙏   ఇ...