Sunday, December 21, 2025

711. మనసు వీ క్షణం

 

మనసు వీ క్షణం



• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది

  చూస్తుంది . . . నా మనసు చూస్తుంది


• కనులు మూసుకున్న నాడే

  నా మనసు చూస్తుంది .

• కనులకు తెలియని లోకమే దో

  నాకు పరిచయం చేస్తుంది .


• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది

 చూస్తుంది . . . నా మనసు చూస్తుంది


• మనసు   లోని    నిశ్శబ్దం

  పరవళ్ళు   తొక్కుతోంది  ప్రకృతి లో .

• మనసు   లోని   *వీక్షణలు

  దాటి   పోతున్నాయి   విశ్వాన్ని .


• ఇదే   నా  తరంగం

  ఇదే   నా  అంతరంగం .


• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది

  చూస్తుంది . . . నా మనసు చూస్తుంది


• కనులు  మూసుకున్న  నాడే

  నా మనసు చూస్తుంది .

• కనులకు  తెలియని  లోకమే దో

  నాకు పరిచయం చేస్తుంది .


• తేలుతున్న  మనసు కి  తనువు

  భారమే     లేదు .

• సాగుతున్న  మనసు కి  సంతోషం 

  హద్ధు లే   లేవు .


• ఇదే  నా  ధ్యానం

  ఇదే  నా  *పరధ్యానం .


• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది

  చూస్తుంది . . . నా మనసు చూస్తుంది .


• కనులు  మూసుకున్న  నాడే

  నా మనసు  చూస్తుంది .

• కనులకు  తెలియని  లోకమే దో

  నాకు పరిచయం చేస్తుంది .

 

వీక్షణలు = చూపులు

పరధ్యానం = శివ పరమాత్ముని స్మృతి యానం.


యడ్ల శ్రీనివాసరావు 21 Dec 2025 7:00 PM .


No comments:

Post a Comment

738. శివ పదము శివ పాదము

  శివ పదము   శివ పాదము ”శివ పదము  శివ పాదము”  ఏదో ఒకటి పట్టుకొని వ్రేలాడు,  నీ జీవితం చరితార్థం అవుతుంది.  నాకు తెలిసినది  నీకు తెలిసినది  ఒ...