నరుడే నారాయణుడు
• నరు నే నారాయణుని గా
చేయును శివుడు .
• నీవే ఆత్మవు
ఆ శివుడే పరమాత్ముడు .
• పరమేశుని పఠియించిన
తొలగును పాప కర్మలు.
• ఆ పరమ పదమే
పవిత్రము గాంచును.
• మతి స్తుతి లేనిచో
మైకం కలిగి మలినం చేరును.
మనసు లో . . . మలినం చేరును .
• నరు నే నారాయణుని గా
చేయును శివుడు .
• నీవే ఆత్మవు
ఆ శివుడే పరమాత్ముడు .
• పర చింతనలు . . . పర దర్శనలు
పెంచును పాప భారము
తలపై . . . పాప భారము.
• కళ్లెం లేని కోరికలు
కాటి వరకు తోడైతే
మనసు కి శాంతి ఎక్కడ
విశ్రాంతి ఎక్కడ .
• వికారాలు . . . వైషమ్యాలు
విగతజీవిగా చేసేటి సాధకాలు
అవే జన్మ జన్మలకు బాధకాలు .
• దేహం లో శివ నాదం
లేని నాడు
నాడులే నరకానికి బాసట .
అదే జీవునికి అలసట .
• నరు నే నారాయణుని గా
చేయును శివుడు .
• నీవే ఆత్మవు
ఆ శివుడే పరమాత్ముడు .
• పరమేశుని పఠియించిన
తొలగును పాప కర్మలు.
• ఆ పరమ పదమే
పవిత్రము గాంచును.
ఓం శాంతి
శివ బాబా 🇲🇰 (శివుడే తండ్రి).
Prajapita Brahma Kumaris Spiritual University.
యడ్ల శ్రీనివాసరావు 4 Nov 2026 12:30PM.

No comments:
Post a Comment