Tuesday, March 3, 2026

728. होली

 

  होली



• హోలీ అంటే హిందీలో జరిగిందేదో జరిగింది అని అర్దం. హోలీ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో ఒక విశిష్టత కలిగిన పండుగ. మనుష్యులు అందరూ రంగులు పూసుకుని ఆనందడోలికల్లో తేలియాడడం ప్రధానం గా అందరం బయటకు చూస్తుంటాం.

• కానీ ఈ పండుగ మూల సారాంశం లో నేటి మనిషి యొక్క సామాజిక జీవనంలో శ్రేయస్సు కోసం , మానసిక ఆనందం, పరిపక్వత తో కూడిన రహస్యం ఇమిడి ఉంది.

• మనిషి పుట్టుక నుంచి మరణం వరకు బంధాలు అనుబంధాలు బంధుత్వాల తో జరిగే ప్రయాణం లో తోటి వ్యక్తుల తో  కొన్ని సార్లు సానుకూలంగా, కొన్ని సార్లు సమస్యాత్మకంగా ,  కొన్ని సార్లు ఆనందం భరితంగా ఉంటుంది.

• ఏ మనిషి అయినా తోటి వ్యక్తుల తో ఎప్పుడూ ఆనందమయంగా ఉండాలని ఆశిస్తాడు. స్వభావ సంస్కారాలు , పరిస్ధితుల రీత్యా కొన్ని సార్లు కొంత కాలం  మరియు కొన్ని సార్లు   పూర్తి జీవితకాలం వ్యక్తుల  మధ్య సమస్యలు ,  వైరాలు సృష్టించబడతాయి. వీటికి కారణం కూడా మనుషులే . దీని వలన ఒక మనిషి లో లేదా మనుషుల మధ్య అశాంతి ని నెలకొని మానవ సంబంధాలు పూర్తిగా దుర్భరంగా తయారవుతాయి . కాలక్రమేణా ఇది హింసకు ప్రేరణ అవుతుంది.

 నేడు సమాజంలో పూర్తిగా వంద శాతం జరుగుతున్నది ఇదే .

• అయితే , నేటి పరిస్థితులు ఎలా ఉన్నా నాటి పరిస్థితుల వలన జరిగిందేదో జరిగింది అని , మనిషి అన్నీ విడిచి పెట్టి  మరచి పోయి  జీవితానికి ఆనందం , శాంతి, సుఖం, ప్రేమ, సత్యత, సఖ్యత , శక్తి అనే కొత్త రంగులు మనం పూసుకుని , అవి ఇతరుల పై జల్లుతూ సంతోషం అనే మిఠాయి తింటూ తినిపించు కోవడమే హోలీ పండుగ రహస్యం , సూక్ష్మం .

• ఆ రోజు తెల్ల వస్త్రాలు ధరించడం లో అర్దం , సమస్యలకు కారణం అయిన నా పాత ఆలోచనలను విడిచి పెట్టాను . నేడు నా మనసు తెల్లగా స్వచ్చం గా ఉంది అని అర్దం. ఒకవేళ ఇంకా ఏమైనా మనసు లో చిన్న చిన్న లోపాలు మరకలు వలే నాలో ఉన్నా సరే , వాటి పై నేడు పూస్తున్న రంగులతో ఆవి కనుమరుగయి …. నేను సంతోషంగా ఉంటూ, అందరినీ సంతోషంగా ఉంచుతాను అని అర్దం.

• ఇదే మనం హోలీ పండుగ మనకు తెలియ చేసే ముఖ్యమైన సందేశం .

• ఇంగ్లీష్ లో Holy అంటే పవిత్రం. మన మనసు ను పవిత్రం గా తయారు చేసుకుంటూ , అందరి మనసులను పవిత్రంగా తయారు చేయడమే హోలీ.

• హోలీ పండుగ పౌర్ణమి రోజున వస్తుంది. చంద్రుడు యొక్క విశ్వ శక్తి ఎల్లప్పుడూ మనిషి యొక్క మనసు , మెదడు ఆలోచనలపై పూర్తి ప్రభావం చూపుతుంది. పౌర్ణమి రోజున చంద్రుడి నిండు వెలుగు వలే మన మనసు నిత్యం వెలుగుతూ ఉండాలి అని హోలీ ని ఆ రోజు జరుపుకుంటారు.

• నా భారత దేశం చాలా గొప్పది. అడుగడుగునా మనిషి ఎలా బ్రతకాలో సంస్కృతి లో పండుగలు సాంప్రదాయాల రూపం లో మనందరికీ నేర్పుతూ నే ఉంది. కానీ దరిద్రం, దురదృష్టకరం ఏంటంటే మాయా బలహీనతలకు వశం అయి , వీటి సూక్ష్మం గ్రహించలేక పాశ్చాత్య పోకడలకు దాసోహం అవుతూ మనకు మనమే స్వయంగా బలిహరం అవుతున్నాం.


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 4 March 2026 . 7:00 AM.


728. होली

     होली • హోలీ అంటే హిందీలో జరిగిందేదో జరిగింది అని అర్దం. హోలీ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో ఒక విశిష్టత కలిగిన పండుగ. మనుష్యులు అంద...