Friday, March 31, 2023

333. మౌనం మాటాడుతుంది ☘️ చీకటి చూస్తుంది

 

మౌనం మాటాడుతుంది ☘️ చీకటి చూస్తుంది



• అవును… మౌనం మాటాడుతుంది…. వినిపించడం లేదా … ఒక గంట సేపు ప్రశాంతంగా ఎవరు లేకుండా, నిర్మలమైన ప్రదేశం లో కూర్చుని ఏకాంతంగా ఉన్నప్పుడు, గమనించండి మౌనం ఎంత చక్కగా మాటాడుతుందో. ఆ మాటలలో స్పష్టత ఎంత బావుంటుందంటే మళ్లీ మళ్లీ వినాలనిపించేంతగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువ శాతం మనుషులు. మౌనంగా ఉండరు, ఉండలేరు గాని, ఒకసారి ప్రయత్నించి చూస్తే మౌనం యొక్క శక్తి ఏమిటో తెలుస్తుంది.

• మనసు లో ఏ అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మౌనం మాట్లాడడం మొదలెడుతుంది. అలాంటి సమయంలో మౌనం ఎప్పుడూ కూడా మనకు ఇష్టమైన వారి గురించి చెపుతుంది.

• అందులో అమ్మ, నాన్న, రక్త సంబంధీకులు, భార్య భర్తలు, స్నేహితులు, ప్రియులు, పిల్లలు వీళ్లందరి గురించి చెపుతుంది. ఒక విషయం గమనించారో లేదో…. మౌనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా సార్లు తెలియకుండా మనలో మనం నవ్వుకుంటాము. చిరునవ్వుతో ఉంటాము. చుట్టూ చూస్తే ఎవరు ఉండరు. అదే మౌనం యొక్క మహత్తరం.

• మౌనం కొందరికి జ్ఞాపకాలను తెరుస్తుంది … కొందరికి జ్ఞాపకాలను ఆహ్వానిస్తుంది … మరి కొందరికి జ్ఞాపకాలను మరచిపోయేలా చేస్తుంది.

• మౌనం లోనే ప్రతి మనిషి తనకు తాను ఏంటో నిజాయితీగా తెలుసుకుంటాడు. కరెక్ట్ గా చెప్పాలంటే తనలో దాగి ఉన్న మనిషి తో మాట్లాడి తన గురించి తాను సత్యం తెలుసుకోగలుగుతాడు. బహుశా అందుకే నేమో మహ యోగులు ఎప్పుడూ మౌనంగా ఉండేవారు.

• మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించండి … మనిషి మౌనంగా ఉన్న సందర్భం లో , సమయం గడిచే కొద్దీ ప్రకృతి , ప్రకృతి లో ఉన్న పక్షులు, పువ్వు లు, చెట్లు, ఆకులు, నదులు అద్బుతం గా మాట్లాడడం మొదలు పెడతాయి. ఏవో చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి మరియ ఇంకా వీటన్నిటికీ కూడా తెలుసు, మనిషి ప్రకృతి లో భాగమే అని. కానీ మనిషే నిత్యం ఏదో గందరగోళం సృష్టించుకుంటూ తన దృష్టి ని పూర్తిగా వ్యాపకాలు, కార్య కలాపాలు మీద పెడుతూ తనను తాను మరచి పోయి, ప్రకృతి ని గమనించడు.

• మనిషి ఎంత మౌనంగా ఉంటే అంత గా ప్రకృతి మనసు విప్పి మాట్లాడుతుంది. ఈ మాటలకు శబ్దం ఉండదు అంతకు మించి అనుభవాలు, కనుపాప లో దృశ్య రూపం ఉంటుంది. ఇది కల అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీరు వంద శాతం నిశ్చలమైన మౌనం తో ఉన్నప్పుడు మీతో మీరు గాని, లేదా ప్రకృతి మీతో గాని ఏదైనా మాట్లాడితే అది వంద శాతం అతి తక్కువ సమయంలో అనుభవం తో సహ నిజం అవుతుంది. అదే మనిషి మౌనానికి ఉన్న అతీంద్రియ శక్తి.


  ☘️☘️☘️☘️☘️☘️


• చీకటి చూడడం ఏమిటి … చాలా విచిత్రం గా ఉంది కదా…. అవునండీ వంద శాతం నిజం. ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది. మనిషి కనులు తెరిస్తే వెలుగు. కనులు మూస్తే చీకటి. కానీ మనిషి లో ఉన్న కనులు తెరిచినా, మూసినా చూస్తూనే ఉంటాయి. ఇది నిజం. కనులు తెరిచి నపుడు వెలుగు లో ఎంత చక్కగా ప్రపంచం కనిపిస్తుందో,. కనులు మూసినపుడు చీకటి లో అంత కన్నా అద్బుతం గా , సూక్ష్మ మైనవి ఎన్నో కనిపిస్తుంటాయి.

• ఒక మనిషి ప్రశాంతంగా, ఏకాంతంగా నిద్రపోకుండా కనులు మూసుకుంటే అంతా చీకటి మయం అయిపోతుంది. అలా కొంత సమయం గడిచే సరికి, ఆ చీకటి లో స్పష్టం గా ఎన్నో ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. భవనాలు, మనుషులు, ఉద్యానవనాలు, పని చేసే ప్రదేశాలు, నదులు, ఎడారులు,  రంగులు, జలపాతాలు, లోయలు, ఆకాశం, భూమి, గ్రహాలు, పాలపుంతలు, పరిచయం లేని ఎందరో మనుషులు స్పష్టం గా కనిపిస్తారు. కొన్ని సార్లు భగవంతుడు కూడా.

• ఇదంతా ధ్యానం అనుకుంటారేమో… పొరపాటున కూడా కాదు. ఎందుకంటే ధ్యానం అంటే కనులు మూసి దృష్టి ని భృకుటి స్థానం పై ఉంచడం. కానీ ఇక్కడ అలా కాదు, మెలకువ స్థితిలో ఉండి కేవలం కళ్లు మూసుకుని అలా రిలాక్స్ డ్ గా ఉండడం.

• అంటే చీకటి కూడా మనిషి కి చక్కగా అన్నీ చూపిస్తోంది. కానీ చీకటి లో, చీకటి తో లేదా చీకటి గా ఉన్న సమయంలో మనిషి లోని కనులు బయటకు కాకుండా, అంతర్గతం గా చూడడం మొదలు పెడతాయి. చాలా మంది అనుకుంటారు అంధులు ఏమీ చూడలేరు అని. కానీ అంధులు మనం వెలుగు అని దేనినైతే అంటామో దానిని చూడలేరు. కానీ వారికి చీకటి చాలా చాలా స్పష్టంగా అన్నీ చూపిస్తుంది. ఎలా అంటే మనిషి కి పంచ కర్మేంద్రియాల మీద ఆధారపడి జీవిస్తాడు. ఈ కర్మేంద్రియాలు అన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. ఒక కర్మేంద్రియం లో ఒక లోపం ఉన్నా మిగిలిన కర్శేంద్రియాలు ఆ లోటు ను అంతర్గతం గా పూరిస్తాయి. ఉదాహరణకు కళ్లు లేని వారికి చెవులే కళ్లులా పనిచేస్తాయి. గమనించారో లేదో అంధులు కూడా చిత్రాలు గీసిన సందర్బాలు చరిత్ర లో ఉన్నాయి.

• అందుకే …. చివరి గా చెప్పేది ఏమిటంటే మౌనం చక్కగా మాట్లాడుతుంది. అలాగే చీకటి చక్కగా చూపిస్తుంది, చూస్తుంది. 

ఇదంతా ఎప్పుడూ ఒక మనిషి లో జరుగుతుంది అంటే, మనిషి తనకు తాను ఒక శక్తి అని అర్దం అయినపుడు. ఇంకా చెప్పాలంటే ఒక సరియైన జాగురుకత తో (perfect continuous ness) తో ఉన్నప్పుడు.

బహుశా దీనిని  6th sense లో ఒక భాగం అని కూడా అనుకోవచ్చేమో.


యడ్ల శ్రీనివాసరావు 1 April 2023 , 1:00 am









Thursday, March 30, 2023

332. తీరం చేరని నావ

 

తీరం చేరని నావ



• తీరానికి  తీరం    ఆమడ   దూరం

  నావకు   తెలియదు    నది  లోతు  వయనం.

• భాష ల   ఘోషణ తో    అలల   మౌనం

  వీచే గాలి లో    వినిపించెను   రాగ   భాషం.

• తెరచాప ను    తాకిన    తరంగం

  దిశ    చూపే     ప్రకృతి   భావం .



• తీరానికి   తీరం    ఆమడ  దూరం

  నావకు  తెలియదు   నది  లోతు   వయనం.

• నావ కు    పెరిగెను   వేగం

  పరవళ్లు    తొక్కెను   నదీ  నాదం.

• మీనాల   జలకాల తో   సాగెను

  నావ తో    సుందర   సహగమనం.



• తీరానికి  తీరం    ఆమడ  దూరం

  నావ కు  తెలియదు    నది  లోతు  వయనం.

• కారు మబ్బుల   కమనీయం

  చిరు   జల్లుల   సోపానం.

• ఉరుముల  మెరుపుల   గంభీరం

  అలలు  చేసెను   రాకాసి  నృత్యం.



• తీరానికి  తీరం   ఆమడ  దూరం

  నావ కు   తెలియదు   నది లోతు  వయనం.

• ఈదురు  గాలులు   ఉధృతం

  నావ కు   తుళ్లి  పడుతుంది   భయం.

• సుడిగాలి   లేచేను    అమాంతం

  నావ కు    తెలిసెను    నది  లోతు  గర్భం.



• తీరానికి   తీరం     ఆమడ  దూరం

  నావ   చేరలేదు   తీరం

  కానీ    చేరింది   గమ్యం.

• తీరానికి   తీరం     ఆమడ   దూరం

  ప్రకృతి   చూపులు    నిశ్చలం.


• కాలానికి   కాలం    ఎంతో  దూరం

  మనసు కి   తెలియదు   జన్మ  మారిన  వయనం.

• కర్మల  ప్రాప్తం    జీవన వేదం

  సుఖదుఃఖాలు   జీవిత గమనం.


యడ్ల శ్రీనివాసరావు 30 March 2023 9:00 pm.






Thursday, March 23, 2023

331. నీలాకాశం లో నాన్న


నీలాకాశం లో  నాన్న




• నాన్న  …  ఓ నాన్న

  గుర్తు   కొస్తున్నావు      గుర్తు   చేస్తున్నావు

  గుర్తు    కొస్తున్నావు      గుర్తు   చేస్తున్నావు

  నాన్న   …  ఓ నాన్న.


• నా  చేయి    పట్టిన      నాన్న 

  నను వీడి     పోయిన   నాన్న

• పంచడం    తెలియక

  నీ  ప్రేమ ను    పదిలం గా    దాచి    ఉంచావు.

• పెంచడం     తెలిసినా

  నీ  ప్రేమ ను     పొందలేక     వేచి    ఉన్నాను.


• నాన్న   …  ఓ నాన్న

  ఎక్కడ  ఉన్నావో   …   ఏమి   చేస్తున్నావో

  ఎలా    ఉన్నావో    …   ఏమి   తింటున్నావో.


• ఎదగని   ఈ మనసు కి

  ఎద లోతులో

  మిగిలిన   బంధం

  మన   రక్త  సంబంధం.


• తలుపు   చాటున  భయంతో

  గడిచాయి   ఎన్నో   రోజులు .

• ముద్దులు    మురిపాల కై

  నిరీక్షించాయి   మరెన్నో  రాత్రులు.


• నాడు   తాప   మిచ్చిన

  సూర్యుడి వే     అనుకున్నా

• నేడు    ప్రకాశం    నిండిన

  వెలుగు   లా    చూస్తున్నా.


• నాన్న   …  ఓ నాన్న

  మూగ పోయిన  మనిషి  మనసు 

  మాటాడుతుంది   నీతో   తొలిసారి.


• కన్నీళ్లకు   నువ్వంటే    

  ప్రాణం   అనుకుంటా

  తట్టి   నను   లేపి 

  నిను  పిలుస్తున్నాయి.


• నీ  పిలుపు  కోసం

  నేనెక్కడికి   రావాలి

  నీ    పిలుపు ను

  నే   నెలా   వినాలి.


• నాన్న  ...  ఓ నాన్న

  గుర్తు    కొస్తున్నావు        గుర్తు చేస్తున్నావు

  గుర్తు    కొస్తున్నావు         గుర్తు చేస్తున్నావు

  నాన్న ... ఓ నాన్న


• ఎక్కడ  ఉన్నావో    …   ఏమి    చేస్తున్నావో

  ఎలా     ఉన్నావో    ...   ఏమి  తింటున్నావో


• ఈ   గోదావరి   తీరాన   

  చుక్కల నే  చూస్తున్నా

  నా కోసం   తారవై     మెరుస్తావని.


• ఆశతో   జారే

  ఈ కన్నీరు    ఆనంద   బాష్పాలో

  అశ్రునయనాలో    తెలియడం  లేదు.

  కానీ

  గుండె    భార    మవుతుంది    నాన్న

  చిన్ని పిల్లాడినే   తలపిస్తుంది   ఓ నాన్న.


• నాన్న    …   ఓ నాన్న 

  గుర్తు   కొస్తున్నావు        గుర్తు  చేస్తున్నావు

  గుర్తు    కొస్తున్నావు       గుర్తు   చేస్తున్నావు

  నాన్న    …    ఓ నాన్న.



నాన్న  జ్ఞాపకాల తో  జీవించే వారందరి కోసం.

ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 23 March 2023 , 6:30 PM .


















Wednesday, March 22, 2023

330. నేను కరెక్ట్ - నేనే కరెక్ట్

 

నేను కరెక్ట్ - నేనే కరెక్ట్ .



• నేను కరెక్ట్. అవును నిజమే , నేనే కరెక్ట్.  మీ అందరి లోపల కాస్త అటు ఇటుగా నేను ఉన్నాను, కాబట్టి నేను కరెక్ట్.   నేను ఎప్పుడు ఎలా ఉన్నా,   ఏం చేసినా నేను కరెక్ట్.   నేను రెండు రకాలు గాా   మీ అందరిలో ఉంటాను.   పేర్లు అయితే వాటికి ఉన్నాయి.  నా రూపాలు మీకు కనిపించవు కానీ ,  నాకు ఉన్న శక్తి అమోఘం.  ఎందుకంటే నేను కరెక్ట్.  నేను నేనే కాబట్టి. నేను ఎవరో, నా రెండు పేర్లు ఏంటో చివరి లో చెపుతాను.


• గొప్ప విషయం ఏంటో తెలుసా …. నేను మీకు తెలుసు …. చాలా బాగా తెలుసు.  కానీ మీరే … మరేమో నన్ను అందరి ముందు దాచెస్తూ అమాయకంగా ఉంటారు. అయినా పరవాలేదు లే , ఎందుకంటే నేను మీ లో నే ఉన్నాను. అందుకే అనేది నేను కరెక్ట్ అని.


• నేను ఎప్పుడూ చక్కగా మంచి ఆహారం తింటాను. ఒక వేళ తినకపోయినా తిన్నట్లే ప్రవర్తిస్తాను.  ఇకపోతే నేను అద్బుతం గా అలంకరణ చేసుకుంటాను, రంగు రంగుల దుస్తులు తొడుగుతాను, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు. వాహ్… అసలు ఒకటేంటి ఖరీదైనవి ఏదైనా క్షణం లో నా ముందు ఉండాల్సిందే. ఒకవేళ పైన నేను చెప్పినవన్నీ నాకు లభించిక పోయినా సరే అంతకన్నా దర్జా గా నేను ఉంటాను. ఎందుకంటే నేను కరెక్ట్ …. కాదు ఎలా ఉన్నా నేనే కరెక్ట్.


• నేను ఎప్పుడూ విలాసవంతమైన భవనాలు, రాజ మహల్ లో నివసిస్తాను. ఎందుకంటే నాకు ఆశ్రయం అక్కడ మాత్రమే దొరుకుతుంది. ఒకవేళ అలాంటి వైభవోపేతమైన నివాసయోగ్యాలు , నాకు దొరకక పోయినా పరవాలేదు చిటికెలో నేను సృష్టించు కోగలను. ఎందుకంటే , నాకు కావలసినది , దొరకనిది అంటూ ఏమీ లేదు. అందుకే అంటున్నా నేను కరెక్ట్ అని.


• ఏంటి… మీరు మరీ అంత అమాయకంగా చూడకండి. నాకు సిగ్గుగా అనిపిస్తుంది. ఇంకా నవ్వు వస్తుంది. ఎందుకంటే నేను మీ లో నే ఉన్నాను.


• ఇంకా నేను ఏం చేస్తూ ఉంటానో తెలుసా…. అందరి అవసరాలు తీరుస్తాను.  ఎందుకంటే  నా మీదే ఆధారపడి ఎందరో ఉన్నారు కాబట్టి.  ఇంకా ఈ ప్రపంచం లో కార్యకలాపాలు నడిపిస్తాను.  అహర్నిశలు కష్టపడతాను.  కష్ట పడినట్లు ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను లేకపోతే ఏదీ జరగదు.   నేను లేకుంటే నా చుట్టూ ఉన్న సమాజం, కుటుంబం , పిల్లలు, స్నేహితులు, తోటి సాటి మనుషులు అసలు ఎవరూ కూడా సంతోషంగా జీవించ లేరు .… ఒక్క మాటలో చెప్పాలంటే నా గురించి వీళ్లంతా కొట్టుకు పడి సచ్చిపోతారు తెలుసా.


• నేను చాలా తెలివైన వాడిని. ఎంత తెలివైన వాడిని అంటే పెద్ద పెద్ద నిర్మాణాలకు కట్టించగలను, కూల్చగలను. ఎలాంటి వ్యాపారం అయినా చెయ్యగలను . ధనం పోగు చెయ్యగలను. అధిక వడ్డీ వ్యాపారం చెయ్యగలను. నాకు ధనం అంటే ప్రీతి. నేను అప్పులు భారీ గా చెయ్యగలను, ఆస్తులను ఆవిరి చెయ్య గలను. నిజాన్ని అబద్ధం గా , అబద్ధాన్ని నిజం గా కనికట్టు చేసి చూపించగలను.  నాకు అవసరం అనిపిస్తే ఎంతకైనా దిగజారి, కాళ్లు పట్టుకునే లా బ్రతిమాలాడుతాను   అంతలోనే  ఉన్నతంగా కనిపించే ప్రయత్నం చేస్తుంటాను.  నేను చటుక్కున మాటలు మార్చగలను.   నేను ఎవరికీ చిక్కను  దొరుకను,  కానీ నా అవసరాలు ఎలా తీర్చు కోవాలో నాకు తెలుసు. అందుకోసం ఒకోసారి  ఏడుస్తాను , ప్రాధేయపడతాను, మిమ్మల్ని పొగుడుతాను, బెదిరిస్తాను కూడా . నేనొక ఊసరవెల్లి ని  రంగులు మాార్చడం నా నైజం . ఒకవేళ  నేను  దొరికినా,  నా అమాయకత్వానికి  ఎవరైనా దాసోహం  కావలసిందే‌.  నేను లేకపోతే ఈ ప్రపంచం లేదు. నేను ఎలా ఉన్నా, నాకు నచ్చిన విధంగా దినదిన అభివృద్ధి చెందుతున్నా నని అనుకుంటూ ఉంటాను .  అందుకే నేను కరెక్ట్.


• నేను మాత్రం కరెక్ట్. నేను ఈ రోజు ఈ భూమి మీద ఉన్నవన్నీ అనుభవించడానికి , ఈ శరీరానికి తృప్తి నిచ్ఛే, రమించే సుఖాలను ఆస్వాదించడానికి ఉన్నాను. అందుకు కావలసిన ప్రయత్నాలు అహర్నిశలు చేస్తూనే ఉంటాను. నేను సృష్టి భోగం  అనుభవిస్తాను. అందులో నాకు  తన మన పర భేదం ఉండదు.  ఎందుకంటే నా దృష్టిలో వ్యతిరేక లింగం ఎప్పుడూ కూడా ఒక భోగ విలాస వస్తువు.  అన్నట్లు చెప్పడం మరిచాను, నా టాలెంట్ ఏమిటో తెలుసా, నేను మాటలతో రమించగలను. నటించగలను. సగం అర్దం అయి అవనట్లు మాటను మింగుతూ మాట్లాడ గలను..…… నేను మీ లో నే ఉంటాను, నన్ను మీరు గుర్తించలేరు, గుర్తించినా ఏం చెయ్యలేరు. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిలోనూ మీరు ఉంటారు కాబట్టి. అందుకే నాలో చాలా తెలివి ఉంది అనేది. ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే, నేను కరెక్ట్.



• కానీ మీ లో  కొందరు నాకు స్థానం   ఇవ్వక  మెడ పెట్టి గెంటుతారు… పాపం పిచ్ఛివాళ్లు, ఎందుకు పుడతారో ఇలాంటి వాళ్లు. ఇటువంటి వాళ్లని చూసి జాలేస్తుంది,  కోపం వస్తుంది.  సరేలే   ఏదో రోజు నేను ఏంటో తెలుసు కుంటారు.

• ఎందుకంటే ఇలాంటి  పిచ్చి వారికి  దిక్కు లేక, బ్రతకడం చాత కాక , ఒక లక్ష్యం లేక , గమ్యం తెలియక, నిరాశ నిస్పృహలతో, శక్తి హీనులై , జీవితం లో అన్నీ వదులుకుంటూ, దేవుడు దేవుడు అనే పేరుతో ఏదో ఒక కారణం చూపిస్తూ , పూజ, జపం, ధ్యానం అని కాలక్షేపం చేస్తూ కాలయాపన చేస్తూ మానసిక రోగి లా ఏదో లోకం లో ఉంటారు. పైగా ఏదో అందరికీ హితవులు చెపుతున్నట్లు నటిస్తూ, పబ్బం గడుపుతుంటారు. వీరికి భాధ్యత ఉండదు. ఇటువంటి అసమర్థులకు అసలు నేను ఏంటో, నా లో ఉన్న గొప్ప తనం ఏంటో ఎప్పటికీ తెలుసుకోలేరు. కాని , ఇటువంటి వారిని నేను అంత తేలికగా వదిలి పెట్టను. ఎందుకంటే నా అడ్డా లో ఉంటూ భోగాలు, విలాసాలు అనుభవించకుండా కనిపించని దేవుడి జపం చేస్తే, నేనెందుకు కోరుకుంటాను.


మీకో విషయం చెప్పనా ... నేను కూడా అప్పుడప్పుడు దైవం  ముసుగు వేస్తాను.  మిమ్మల్ని  ఆకర్షించాలంటే నాకు ఇది కూడా అవసరమే. 


• ఏంటి అమాయకంగా చూస్తున్నారు. ఇంతకు నేను ఎవరో తెలుసా …

  ది    గ్రేట్  మాయ ( Delusion).

  ది    గ్రేట్  అహంకారం (Pride).

• ఇప్పుడు చెప్పండి , నేను మీకు తెలియదా… ఎవరి లోను నేను లేనా.  నన్ను ఎవరి లోను చూడలేదా.


• నేను అనేది అహం, మాయ అనే  అవతారాలు గా మనిషి లోపల  ఎంతో కొంత  శాాతం దాగి ఉన్నాయి. ఇది తెలుసుకో లేనంత వరకు ఈ “నేను” ఎలా ఉన్నా, ఏం చేసినా కరెక్ట్. ఎందుకంటే మనిషి లోని అహంకారం ఈ కలి కాలం లో మాయ లో చిక్కుకు పోయి ఉంది కాబట్టి.

( మూలం ప్రేరణ )

సాధారణంగా ప్రతీ మనిషి లోను అహం, మాయ అనేవి ఉంటాయి. ఇవి కొంత అజ్ఞానం, అమాయకత్వం, తెలియని తనం తో ప్రాధమిక స్థాయిలో ఉంటాయి. ఇటువంటి వారి వలన, వారికి మాత్రమే కొంత నష్టం జరుగుతుంది.  కొంత కాలం తర్వాత వారు ఏదో సందర్భంలో  తెలుసు కొని కనువిప్పు కలిగి మాయ, అహం నుండి  బయట పడతారు……

కానీ ఇంకొందరిలో ఈ మాయ, అహంకారం పరాకాష్ట లో ఉంటాయి. ఇది ధనం, స్థాయి, స్థితి , శారీరక మానసిక బలహీనతల వలన వస్తుంది. ఇటువంటి వారికి ఉన్న విపరీతమైన మాయ వలన వారే దానికి వశం అయిపోయి , వారిలో ఉన్న అహం కూడా గుర్తించలేక ఒక అజ్ఞానం తో ఇంటా, బయట సమాజం లో ఉన్న ప్రతీ ఒక్కరినీ చులకన భావం తో చూస్తూ, ఒక విధమైన దిగజారుడు తనంతో మనుషులను మాయ చేస్తూ, మాటలతో హింస పెడుతూ లోపల మానసిక రోగి గా బ్రతుకుతూ బయటకు మాములుగా జీవిస్తారు. ఇటువంటి వారు మనకు  పని  చేసే చోట,  బంధువులలో, స్నేహితుల లో,  సమాజం లో  అప్పపుడప్పుడు కనిపిస్తారు. వీరికి విచక్షణ అసలు ఉండదు.

ఈ అవ లక్షణాలు, గుణగణాల తో ఉన్న వారిలో కొంత మార్పు రావాలని ఆశిస్తూ మరియు ఇది చదివిన వారు, త్వరగా అటువంటి మనుషుల ను గుర్తించి జాగ్రత్త పడాలి అని అవగాహన కోసం అంతర్ దృష్టి తో రాసింది ఈ రచన.


ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 22 March 2023 10 :00 PM.














329. యుగాన బుతువుల ఉత్సవం ఉగాది

 

యుగాన  బుతువుల  ఉత్సవం  ఉగాది



వసంత బుతువు – చైత్రం, వైశాఖం

• చైతన్యపు  చిగురులు తో    చైత్రం చెపుతోంది

  స్వాగతం   …  ఉగాది కి స్వాగతం.

• ప్రకృతి   పూవుల  సోయగం తో  శుభకరం ...

  శ్రీరాముని   వసంత   శోభయ   కళ్యాణం.


• మాధవ భరితం వైశాఖం  ...

  విశేష  దానాల  ముక్తి  ఫలప్రదం.

• తెల్లని మల్లెల చల్లదనం తో 

   మురిసే శ్రీవారి చందనోత్సవం.

• పచ్చని మామిడి తోరణాల తో 

   మెరిసే సత్యదేవుని కళ్యాణం.


గ్రీష్మ బుతువు – జ్యేష్టం , ఆషాఢం

• మండే ఎండల గ్రీష్మం తో 

  తాపన మయింది జ్యేష్టం.

• జ్యేష్ఠ శుద్ధ దశమి  దశపాపహర  దశమి 

   విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలము.


• భగభగలాడే  జ్యేష్ఠం 

  దారులు వేసింది  ఆషాఢ  మేఘానికి.

• పులకరించి న ప్రకృతి 

  తొలకరి  జల్లులతో   ధాత్రిని  హరితం చేసింది.

గురు దీవెన కోసం చేసే గురుపౌర్ణమి పూజ

   ఆషాఢం లో వ్యాసుని జన్మ దినము న.


వర్ష ఋతువు – శ్రావణం, భాద్రపదం

• శ్రావణ మాసపు చినుకులు 

  శ్రవణానందపు గజ్జెలు.

• పట్టు చీరల రెప రెప లలో  

   చామంతుల సొగసు లతో

  పసుపు పారాణి యై వచ్చింది 

  వరలక్ష్మి  పూజ  సౌభాగ్యం.


• భాద్రపదపు   చిత్తడి  వర్షం 

  పంటల  పాలిట  బంగారు హర్షం.

• శుద్ధ చవితి న   గణపతి పూజ 

   సకల  విఘ్నాల   మోక్షము.

• శుక్ల పక్షం లోన  దేవత నోములు

   కృష్ణ పక్షం లోన  మహాలయ పితృ పూజలు.


శరత్ బుతువు - ఆశ్వయుజ, కార్తీకం

• సమశీతోష్ణపు   తేమతో  

  ఆహ్వానం  పలికే  ఆశ్వయుజం.

• శరత్  నవరాత్రుల తో  శోభిల్లింది

   విజయ దుందుభి    శక్తి  ఆవాహం.

• నిర్మల నీలాకాశం   

  ఈ వెన్నెల  కాచే  కార్తీకం.

• భువి ని దీపాలతో నింపి 

  శివుని కీర్తించే    కైవల్యం  ఈ కార్తీకం.


హేమంత బుతువు – మార్గశిర , పుష్యం

• మంచు తెరలుగా  

  తరలి  వచ్చేదే  హేమంతం.

• చక్కిలిగిలి చల్లదనం తో 

  తనువును మురిపించే మార్గశిరం.

• శాంతి సౌందర్యాలతో 

   ప్రకృతి  సంచరించేటి  కాలం.


• పుష్యమి నాటికి ఫలమై 

   చేతికి   వచ్చే  పైరు పంటలు.

• జన జీవన స్రవంతి  సంక్రాంతి న 

   వెల్లి విరిసే  కొంగొత్త  ఆనందాలతో.

• పూర్వీకుల  స్మరణ తో 

   శాంతి చేకూరే పితృదేవతలకు.


శిశిర బుతువు  - మాఘం, ఫాల్గుణం.

• చెట్లు  ఆకులు  రాల్చే  శిశిరం 

  ఆహ్లాదం  నింపే  ఈ వయనం.

• చలి గాలుల   గలగల లై 

  చిలిపి గా  పలకరించేను   మాఘం లో.

• జ్ఞాన  ధారణ కై   పూజించే 

  తల్లి సరస్వతిని  మాఘ పంచమి న.


• శివుడు ఆరుద్రుడై  లింగాకారంలో 

  ఆవిర్భం  చెందే  శివరాత్రి  పర్వదినాన.

• ధ్యాన యోగాల సంయోగం 

  మాఘ ఫాల్గుణాల సంగమం.

• ఫాల్గుణ అమావాస్య తో   

  నిండెను ఒక యుగము ...

   చైత్ర శుద్ధ  పాడ్యమి తో 

  జనియించెను  కొత్త  ఉగాది .



5:50 pm  . 22 March 2023.











Tuesday, March 21, 2023

328. ఉగాది శోభ


ఉగాది శోభ


• సాగే   ఈ గాలులు     ఊగే    అలలుగా

  చేరే     దరి చేరే    …   తాకే    నను తాకే

  శోభ తో  …  శుభములు   నిండిన శోభ తో ..

  శోభ తో  …  శుభములు   నిండిన శోభ తో..


• మల్లెలు  పూచే     మనసున  విరిసే

  ఈ కాలం   …   హరివిల్లు గ  మారే.

  కోయిల   కూసే        ప్రకృతి  లేచే

  ఈ చైత్రం   …    చిత్రాలకు   ప్రాణం  పోసే.


• అరవిరిసిన   ఈ అందాలు 

  ఆహ్వానం  చెపుతుంటే 

  తడబడి నా  సొగసు  

  సావధాన  మవుతుంది.


• పైరులు   వీచే      పువ్వులు   చూసే

  ఈ ప్రకృతి   …  మనసు ను   దోచే

  పరికిణీ   ఎగిరే       పల్లకి కదిలే

  ఈ ఉగాది    …   ఊరంతా  సందడి  చేసే.


• తొలి  పొడుపున  ఈ  కిల  కిలలు

  నడి  పొద్ధుకి     రుస  రుస లై

  మలి సంధ్య తో  గుస గుస గా

  నిశి నాటికి చేరాయి  నిశ్శబ్దం గా.


• సాగే   ఈ  గాలులు      ఊగే  అలలుగా

  చేరే    దరి చేరే    …     తాకే  నను తాకే

  శోభ తో   …   శుభములు  నిండిన  శోభ తో…

  శోభ తో    …   శుభములు  నిండిన శోభ తో…


తాకిన    గాలులు

  ఈ  బుతువు న    లాలన  చేస్తుంటే.

  నిండిన   శుభములు

  ఈ  వసంతా న      పాలన చేసాయి.


• ఎగసిపడే    అలలు తో 

  ఈ మనసు    తేలి పోతుంటే.

  రంగరించిన శోభతో

  ఈ తనువు    పులకరించి పోతుంది.


• ఈ గాలులు       ఎందాకో …

  ఈ పయనం       ఎటువైపో.

  ఈ శుభములు    ఎన్నాళ్ళో  …

  ఈ సౌఖ్యం          ఎన్నేళ్ళో.


• శోభకృతి    ఉగాది    

  శుభ కృతులు   చేసే.

  అరమరికలు    సరిచేసి

  అగాధాలను    పూరించే.


• సాగే  ఈ గాలులు      ఊగే అలలుగా

  చేరే    దరి చేరే    …   తాకే    నను తాకే

  శోభ తో   …   శుభములు నిండిన శోభ తో…

  శోభ తో   …   శుభములు నిండిన శోభ తో…


•  మనసున  కలిగే    భావాలకు    

   సరిగమలు

   ఈ  పచ్చడి   రుచులు.

   మనిషి లో   మెదిలే  ఉద్వేగాలకు   

   పదనిసలు

   ఈ శుద్ధ    పాడ్యమి    అందాలు.


• సాగే   ఈ గాలులు      ఊగే అలలుగా

  సాగే   ఈ గాలులు      ఊగే అలలుగా


యడ్ల శ్రీనివాసరావు 20 March 11:00 PM.










Monday, March 20, 2023

327. విద్యార్థి ఆశయాలు

 

విద్యార్థి ఆశయాలు 



• ఓ విద్యార్థి    ఏది     నీ జీవిత రహదారి

 ఆశయాల  సాధనలో   అపజయాలు పాదరక్షలు.

• గడిచే   కాలం   తోడుంటే

  నీ  పయనం   అనంతం.

  దిక్కుల  సాయం   లేకుంటే

  ఈ విశ్వం   నీ  గమ్యం .


• ఓ విద్యార్థి    ఏది     నీ  జీవిత రహదారి

  ఆశయాల సాధనలో    అవమానాలు   అక్షింతలు.

• బాధ   ఊపిరి   అయినంత నే

  సాగదా  ప్రయాణం   కొనసాగదా.

  ఓటమి   ఎరిగిన   బాట లో

  ఉండదా   తడబాటు   ఉండదా.


• ఓ విద్యార్థి    ఏది    నీ  జీవిత రహదారి

  ఆశయాల  సాధనలో    దుఃఖాలు  దీవెనలు.

• కన్నీరు తో    నిండిన   గుండెకు

  దాహంతో    పని    ఏముంది.

  తపన తో    వేసే    అడుగుల కి

  ప్రతాపం తో    అవసర  మేముంది.


• ఓ విద్యార్థి    ఏది     నీ  జీవిత  రహదారి

  ఆశయాల  సాధనలో    అందరిలో  ఒంటరివి.

• అస్పష్టం    ఆవిరి   అవుతూ 

  నిష్పక్షం     నీడై     ఉంటుంది.

  దురదృష్టం   దగ్గర    కొచ్చి న 

  అదృష్టం   నీ లో నే    పుడుతుంది.


• ఓ విద్యార్థి    ఏది    నీ జీవిత రహదారి

  ఆశయాల  సాధనలో   జీవితం   ఓ మజిలీ

• ఆశయాలు   ఆశలు         అయితే

  సంకల్పాలు    శుభ  శక్తి    మయం.

  ఆశయాలు     అత్యాశలు  అయితే

  సంకల్పాలు    దుఃఖ  మయం.


యడ్ల శ్రీనివాసరావు 20 March 2023 9:00 PM






Sunday, March 19, 2023

326. ఏది సబబు శివ

 

ఏది సబబు శివ


• తండ్రి    ఏది సబబు           ఏది ఒరవు

  తండ్రి    ఏది సముచితం    ఏది అనుచితం.


• నీకు   తెలియని   బిడ్డ లెవరు

  నీవు   ఎరుగని     లోకమేది

  నేను   ఎరుగిన     తండ్రి నీవు

  నిన్ను   ఎరిగిన      బిడ్డ నేను.


• కోరికల   కోసం    కోటి దండాలు   పెట్ట లే

  ఆశ తో    ఆర్తి గా   ఏమి     అడగ లే.


• సత్యమెరగని     కాలము  కంటే

  సత్యమెరిగిన      కాలమే   శిక్ష.


• తండ్రి   ఏది   సబబు         ఏది ఒరవు

  తండ్రి   ఏది  సముచితం    ఏది అనుచితం.


• జ్ఞాన    మెరుగుట       అంటే

  నిప్పు    “వెలుగు”ట    అన్నావు.

  నిప్పు కి   నీరు    తోడైన   లోకం లో

  ఏమి    చేయాలి   శివా.


• మాయ  మోహం   కుడి ఎడమ   భారాలై తే

  నిజమ నే    నిన్ను    ఎలా చేరాలి    శివ.


• శేష   కర్మలు   కోసం   ఏమి  చేయాలి

  బుణ  విముక్తి కై    ఇంకేమి   చేయాలి.


• తండ్రి   ఏది   సబబు         ఏది   ఒరవు

  తండ్రి   ఏది సముచితం     ఏది   అనుచితం.


• మాయ   నను చూసి   నవ్వుతూ    అంటోంది

  నను విడిచి   నువ్వు   ఎక్కడికి   పోతావని

  ఈ  మాయ  లోకం లో   గతి లేక    ఉన్నందుకా ?


• మోహము   నా పైన  జాలి   చూపిస్తూ  అంటోంది

  బ్రతక  లేని   బంధాలలో   బ్రతికే    బానిస  నని.

  ఈ కర్మ  గమ్యం లో    స్థితి లేక    ఉన్నందుకా ?


• తండ్రి    ఏది    సబబు          ఏది    ఒరవు

  తండ్రి    ఏది    సముచితం    ఏది అనుచితం.


• నీకు    తెలియని    బిడ్డ  లెవరు

  నీవు     ఎరుగని     లోకమేది

  నేను     ఎరుగిన     తండ్రి నీవు

  నిన్ను    ఎరిగిన      బిడ్డ నేను.


యడ్ల శ్రీనివాసరావు 19 March 2023 8:00 PM.













Saturday, March 18, 2023

325. కంచికి చేరని కధ

 

కంచికి చేరని కధ



• అనగనగా   ఒక కధ   ఉంది

  కధ లోన   ఒక వ్యధ   ఉంది.

  కధ   కంచికి    చేరదు     కానీ 

  కదనం  తొక్కుతూ   ఉంటుంది.


• కాలం   రాసిన   ఈ కధకు

  కలం    సాక్షి    కానంటుంది.

  కలకలం  సృష్టించ   లేనంటుంది.


• జీవము   నిండిన   పాత్రలు 

  ఎన్నో 

  సజీవం  గా నే    ఉన్నాయి.

• చలనం    లేని    జీవాలై

  నిర్జీవంగా   నిలిచి    ఉన్నాయి.


• నట నే    ఎరుగని   తారలు 

  అభినయం  కోసం   వేచి  ఉన్నాయి.

• మాటలు   తెలియని   పక్షుల్లా

  మౌనంగా   చూస్తూ    ఉన్నాయి.


• అనగనగా    ఒక కధ     ఉంది

   కధ  లోన     ఒక వ్యధ   ఉంది.

   కధ   కంచికి    చేరదు   కానీ 

   కదనం  తొక్కుతూ  ఉంటుంది.


• జగము న    ఏలేటి    జగడాలు

  ఈ కధలో    నడిచే     విడ్డూరాలు.

• ఊహకు    అందని   ఎన్నో    సిత్రాలు

  కన్నుల      ఎదుట   నిలిచే   విచిత్రా లై.


• పరిణితి   చెందిన   ఈ కధ  పాత్రలు 

  ప్రేక్షకపాత్ర  లో    ఒదిగాయి.

• కాలం   కదలక   చూస్తుంది    

   కధ   లిపి    కోసం.


• అనగనగా   ఒక   కధ    ఉంది 

  కధ లోన     ఒక   వ్యధ  ఉంది.

  కధ  కంచికి    చేరదు    కానీ 

  కదనం   తొక్కుతూ    ఉంటుంది.


• కాలం    రాసిన   ఈ కధకు

  కలం   సాక్షి     కానంటుంది.

  కలకలం   సృష్టించ   లేనంటుంది.


యడ్ల శ్రీనివాసరావు 18 March 2023 10:00 PM.








Friday, March 17, 2023

324. నాయకుల సభలు సమావేశాలు మనుషులు

 

నాయకుల సభలు  సమావేశాలు మనుషులు



• మనుషుల ను పోగుచేసు కోవడం  కంటే మనసులను పోగుచేసి  సేవ , సహాయం చేయ గలగడం ఎంతో ఉన్నతమైన పురుషార్థం.


• మనుషుల ను  పోగుచేసి  సహాయం చేయడం అనేది  తాత్కాలిక  భౌతిక చర్య.  ఇది  మనుషుల అవసరాలను కొంచెం  తీర్చడం  అవుతుంది .  కొన్ని రోజుల తరువాత ఆ మనిషి కి  సహాయం మరలా మరలా అవసరం అవ్వచ్చు.  ఈ విధం లో చేసే  సహాయం శాశ్వత  పరిష్కారం గా ఉండదు. ఇది ఒక తాత్కాలికం.  ఇందులో  మనిషి లో  ని  శరీరానికి  ప్రాముఖ్యత ఇచ్చి  సహాయం చేయడం జరుగుతుంది.


• సహాయం చేస్తాం అనే పేరు తో,  మనుషులను  ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోగుచేసు  కోవడం అనేది  ఒక ఉల్లాసం,  ఒక స్వప్రయోజనం మరియు తాత్కాలిక కాలక్షేపం తో కూడిన ఆనందం మాత్రమే.   దీని కోసం సహాయం చేస్తాను అని చెప్పే  మనిషి ,  ఇతరులకు ఎన్నో రకాలుగా మాటలు,  కబుర్లు,   ప్రయాస, ధనం ఖర్చు పెట్టడం, ఎదుటి వారికి తగినట్లు నటించడం వంటివి ఎన్నో జరుగుతాయి.

ఉదాహరణకు రాజకీయ నాయకులను చూస్తే మీటింగ్ లకు జనాన్ని పోగేయడం, వారికి కావలసిన ఆహారం, మత్తు పానీయాలు, రాను పోను రవాణా సదుపాయాలు కల్పించడం, ప్రజలను దేవుళ్లు గా భావించడం …. కానీ, సభ పూర్తి అయ్యాక నాయకుడు తమ విశిష్టత ను ఫౌటోలు, వీడియో ల ద్వారా మీడియా లో ప్రచారం చేసుకుంటూ, తానే చాటుకోవడం పరిపాటి. దీని వలన నాయకుడి కి తన లక్ష్యం, అవసరం తీరుతాయి. లోపాయికారీ తో ఉన్న కోరికలు , వాటికి పునాదులు వేసుకోవడం జరుగుతాయి. కానీ హాజరైన మనుషుల,  అవసరాలు,  కష్టాలు   ఏ మాత్రం తీరవు.  సరికదా    నాయకుడు పంచిన ఆహారం, ధనం, మద్యం తో ఆ పూట కాలక్షేపం అవుతుంది.

• నిజానికి ఇదే నాయకుడు లేదా నాయకుడి లా ఫీల్ అవుతున్న వ్యక్తి వద్దకు వెళ్లి, ఏ మనిషి అయినా తమ కష్టం చెప్పుకొని సహాయం అర్దిస్తే ఫలితం శూన్యం. ఒకవేళ నాయకుడు నిజంగా సహాయం చేసినా, ఒక వెయ్యి మంది లో ఒకరికి మాత్రమే చేసి అందరికీ చేసినట్లు మాట్లాడుతారు. ఈ నాయకులు మనుషుల ను చాలా చాలా అమాయకులు అనుకుంటారు.

• అదే విధంగా ఈ సభలు, సమావేశాలకు ఆనందం గా హాజరైన మనుషులు కూడా నిదానం గా తమ అమాయకత్వానికి కాస్త ఆలస్యంగా చింతిస్తారు. ఎందుకంటే అదంతా ఒక మాయ అని, ఆ మాయలో తెలియక భాగస్వామ్యలం అయ్యాం అని, చెప్పాలంటే నాయకుడు యొక్క అవసరానికి తమను గొర్రెలు గా ఉపయోగించుకున్నాడు అని. 

ఔనన్నా కాదన్నా ఇది నిత్యం సమాజం లో మన చుట్టూ జరుగుతున్నదే. ఇది నాయకులు, రాజకీయ పార్టీల లోనే కాదు …. చిన్న పెద్ద సభా సమావేశాలు నిర్వహించే చోట తరచూ జరిగుతూ ఉండేదే.


☘️☘️☘️☘️☘️☘️☘️


• మనసు ఉండేది మనిషి ఆత్మలో. ఆత్మలో ని మనసు శాశ్వతం, నాశనం లేనిది . జన్మాంతరాలకు కూడా సహయోగం ఇచ్చేది. 

మనసు కూడా చాలా మంది కి బలహీనం అవుతుంది. ఆత్మ తన శక్తి కోల్పోయినప్పుడు ఇలా జరుగుతుంది. అదే మనసు కి దుఃఖం గా మారుతుంది. 

మరి ఇటువంటి మనసులకు పోగుచేసి  సేవ చేయడం అంటే , ఆ మనసు లో శక్తి వంతమైన ఆలోచనలు నింపడం తద్వారా మనిషి తనకు తాను నిలబడే లా చేయగలగడం. ఇది చాలా చాలా అత్యున్నతమైన పురుషార్ధం. ఈ సేవ ప్రేమతో, నిజాయితీ నమ్మకం తో కూడి ఉంటుంది మరియు సేవ చేసిన వారికి శాశ్వతమైన ఆత్మానందం లభిస్తుంది.

ఒక  మనసు కి  సేవ , సహాయం చేయడం అంటే మనిషి ని శాశ్వతం గా  నిలబెట్టడం.


• దీని కోసం సేవ చేసే మనిషి తన మనసులో మంచి ధ్యాన సంకల్పం చేస్తే చాలు. సంకల్పం లోని మంచి ఆలోచన, ప్రకృతి తో మమేకం అయి శక్తి గా మారి సేవ జరుగుతుంది, తద్వారా సాటి బలహీనమైన మనసు బలోపేతం అయి, శక్తి పొంది తన అవసరం తానే తీర్చుకుంటుంది.

• ఈ సేవ చెయ్యడం కోసం మనుషులను పోగు చేయనవసరం లేదు, వెతక వలసిన అవసరం అంత కన్నా లేదు.

• ఎందుకంటే ఆ సేవ పొందడానికి అర్హత ఉన్న బలహీనమైన  మనుషులు (ఆత్మలు),   సహజం గానే , ప్రకృతి లో ఉన్న పంచభూతాల సంకేతాల ద్వారా, వారికి కాలం సహకరించినపుడు, బలశాలి ఆత్మ కలిగిన వారి నుంచి సేవ సహాయం పొందుతారు. తద్వారా వారు కూడా శక్తి వంతులై మరికొందరికి తమ శక్తి తో సేవ చేస్తారు. దీని వలన పుణ్యం పురుషార్థాలు జమ అవుతాయి.

• ఉదాహరణకు ఆశ్రమాలు, ఛారిటీ సంస్థలు , మనోధైర్యం కలిగించే  కౌన్సిలింగ్ సెంటర్లు  నిర్వహించే వారు మనతో, మన ఇంటి పక్కనే ఉన్నా, సమయం వచ్చే వరకు, వారు ఎవరికి అంతగా తెలియరు. ఎందుకంటే వారికి ప్రచారం చేసుకోరు సరికదా, ఎంతసేపు సేవ ఏ విధంగా చెయ్యాలి అనే కార్యాచరణ లో నే ఉంటారు. నిజమైన సేవ చేసే వారు ఏనాడూ స్వప్రయోజనాలు, ప్రచారాలు ఆశించరు. మనిషి తనకు అవసరమైన సందర్భాల్లో  స్వయంగా తానే వెళతాడు వీరి దగ్గర కు.  

• నేటి సమాజంలో గమనిస్తే నాయకులు గా చలామణి అయి చరిత్రలో నిలిచిన వారి కంటే కూడా, ఫలితం ఆశించకుండా సేవ చేసిన సేవాదారులు, మరియు నాయకుడిగా ఉంటూ నిస్వార్థంగా సేవ చేసిన వారు మాత్రమే చరిత్రలో చిరస్థాయిగా నేటికీ నిలిచిపోయారు. అటువంటి గొప్ప వారు నేడు జీవించిలేకపోయినా వారి ఆదర్శాలు, భావాలు నేటికీ జీవిస్తూ దార్శనికత ఎందరికో ఇస్తుంటాయి. ఉదాహరణకు మదర్ థెరిస్సా, అబ్రహం లింకన్ (నాయకుడు) వంటి వారు ఎందరో.

• దేహం ఎన్నో లోభాలు, ప్రలోభాలకు వశం అవుతుంది. ఆత్మలో ఉన్న మనసు కేవలం స్వచ్ఛత, శక్తి, పరిపూర్ణత కోరుకుంటుంది.

• మనిషి లో దేహం, ఆత్మ రెండు ఉంటాయి.

• ఏనాడైతే ఆత్మను గ్రహించి మనసు ను ఆధీనంలో ఉంచుకో గలిగిన మనిషి కి విజ్ఞత కలుగుతుంది. తద్వారా ప్రలోభాలు, కాలక్షేపాలు, వృధా తత్వం కంటే తన జీవిత పరమార్థం తెలిసుకోగలిగి సేవాభావం తో తనను తాను సంస్కరించుకొని, ఇతరులకు సేవ చేయగలుగుతాడు.

• మనుషులు నిజంగా అమాయకులే …. కానీ వారు జీవిత కాలం అలా ఉండరు. ఏదొక రోజు మనుషుల కి జ్ఞానోదయం అవుతుంది.

• అప్పుడు నాయకులు మనుషుల ను గమనించి తమ తీరు మార్చుకొని సేవాధారులు గా అయి మనసులకు సేవ చేస్తారు ….. చిరస్థాయిగా నిలిచిపోతారు.

• నాయకుడు అంటే దేశానికో, రాష్ట్రానికో, ప్రాంతానికో కానవసరం లేదు. మన సమాజంలో, మన కుటుంబాలలో, మన స్నేహితులలో, మన ఆఫీస్ కార్యాలయాల్లో, నిత్యం మన చుట్టూ ఉంటూ నాయకత్వ లక్షణాలను చూపిస్తూ మనలో మనతో ఉండే వారు, ఎంతో మంది ఉంటారు.

• అదే విధంగా బలమైన ఆత్మశక్తి శాలులు అంటే మన తల్లి తండ్రులు, రక్త సంబంధీకులు, మంచి స్నేహితులు, ఉపాధ్యాయులు, గురువుల లో ఎంతో మంది సేవాతత్పరత కలిగి ఉన్న వారు  ఉంటారు.



యడ్ల శ్రీనివాసరావు 17 March 2023 10:00 AM.







Thursday, March 16, 2023

323. పని పిల్ల


పని పిల్ల



• పని పిల్ల      పని పిల్ల

  విధి లేక   పని చేసే    చిన్న పిల్ల

• బాల్యం లో   బరువులకు   బందీ గ   అయి

  భాధ్యత గా   బానిస లా    బ్రతుకుతున్నావు.


• పని పిల్ల      పని పిల్ల

  గతి లేక   పని చేసే   చిన్న పిల్ల

• కరువు నిండిన   కుటుంబంలో   కుందేలు అయి

  కడుపు  నిండ నీ  స్థితి తో   బ్రతుకుతున్నావు.


• ఈడు పిల్లల ను    చూసి   నీ కళ్లు మెరవగా

  తోడు గా    నీకు లేరని   భోరున  ఏడ్చావు.


• జడకు వేలాడు   రిబ్బన్లు తో   మురిసి పోతూ

  కాలి నరిగిన  చెప్పులతో    చలించి పోయావు.


• పని పిల్ల       పని పిల్ల

  స్థితి లేక    పని చేసే    చిన్ని పిల్ల

• చిరుగు    బట్టలతో    సింగారి   బొమ్మలా

  నేల  ఊడుస్తూ   అందం గా   చేస్తావు.


• చదువు సంధ్యలు   లేని        చిన్నారి వి

  పాపపుణ్యములు  ఎరుగని   పాపాయి వి


• తలకు   తైల మెరుగని     నీ పేదరికం

  పనికి   అడ్డంకి కాలే   ఉన్నోళ్ల  శుభ్రానికి‌.


• పని పిల్ల     పని పిల్ల

  గతి లేక .. విధి లేక .. స్థితి లేక

  పని చేసే    పని పిల్ల

• ఆటపాట  లెరుగని   అమాయకపు  పిల్ల

  అమ్మ నాన్న లకు     నీవొక  చేతి  కర్ర


• కలతలు  ఎరుగని   కుందనాల పిల్ల

  ఎంత కష్టమైనా   నీ ముందు  తల దించే.


• బ్రతుకు కే   బాట   నేర్పించు  నీ అనుభవాలు 

  బంగారు భవిష్యత్తు   బలము గా   నీ సొంతం.


• పని పిల్ల    పని పిల్ల

  బంగారు     పసి పిల్ల

  మానవత్వం తో    చేర దీస్తే

  మనసున్న   వారందరికీ   మన పిల్ల.

 


ఇళ్లలో , కార్యాలయాల్లో, వ్యాపార సంస్థల్లో పని చేసే చిన్న పిల్లలను మంచి మనసు తో చూడండి. ఆదరించండి.

పాపం … చిన్న పిల్లలు, పసి పిల్లలు. మన పిల్లలు లా పెరిగే అవకాశం వారికి ఈ జన్మలో దొరకలేదు.


ఓం నమఃశివాయ 🙏.


యడ్ల శ్రీనివాసరావు 16 March 2023. 11:00 PM.







322. “ మా నిసి “


“ మా నిసి “


• “మనిషి” ప్రతీ ఒక్కరూ పలికే పదం, తమ రూపానికి దేవుడు సృష్టించిన అర్థవంతమైన పదం . కానీ ఈ పదానికి అసలు మూలం “ మానిసి “ . కాలక్రమేణా శతాబ్దల అనంతరం రూపాంతరం చెంది నేడు “మనిషి” అయ్యింది.

• “ మానిసి “ లో

  “ మా “  అంటే మిక్కిలి , కలిగి ఉండుట.

  “ నిసి ”  అంటే రాత్రి,  చీకటి, దుఃఖం.


• “మానిసి”  లేదా    “మనిషి” కి   పూర్తి భావం తో కూడిన అర్దం   మిక్కిలి చీకటి , మిక్కిలి దుఃఖము లేదాా   చీకటి కలిగి ఉండడం, దుఃఖం కలిగి ఉండడం.

• ఈ పదానికి సూక్ష్మం  గ్రహిస్తే మనిషి గా పిలువబడుతున్న మానవునికి తన మూల అర్దం , మిక్కిలి చీకటి లేదా మిక్కిలి దుఃఖము అనే విషయం తెలుస్తుంది. ఇది సత్యమా అసత్యమా అనేది మనిషి అంతరంగానికే తెలియాలి.


• మనిషి స్వతహాగా అమాయకుడు, అజ్జాని.  తన జీవిత లక్ష్యం   సంతోషం గా జీవించడం.  నిత్యం ఈ సంతోషం కోసం, ఆనందం కోసం వెతుకుతూ ఉంటాడు.   అంటే సంతోషం  కోసం వెతుకుతున్నాడు,    అంటే  తనలో అప్పటికే దుఃఖం నిండి ఉందనే కదా అర్దం. ఈ దుఃఖం అనేది అందరిలో ను బయటకు కనపడక పోవచ్చు లేదా ప్రదర్శన కాకపోవచ్చు. కానీ ఈ సృష్టిలో జన్మించిన ఏ మనిషి దీనికి అతీతం కాదు.  అదే  మనిషి ,  మానిసి అని పిలువబడే పదం యొక్క అర్థం. ద్వారా స్పష్టం అవుతుంది.


• అమాయకమైన మనిషికి తనలో ని దుఃఖం పోగొట్టే వి, భౌతిక సాధనాలు, విలాసాలు, ఆడంబరాలు అనుకొని   కోరికల సాధనకు , ధనం, వ్యామోహలలో జీవిస్తూ కంటికి కనిపించని మాయతో చెలిమి చేస్తూ ఉంటాడు. అప్పటికప్పుడు కొన్ని క్షణాల వరకు తాత్కాలిక సుఖం పొందుతూ ఉంటాడు. అదే నిజమైన దుఃఖ విమోచనం గా భావిస్తూ ,  ఆ భోగ సుఖాలకు బానిసై రోగి లా మారి తిరిగి దుఃఖం పొందుతూ ఉంటాడు.  ఈ భౌతిక సుఖాలు కాకి రెట్ట తో సమానం అని గ్రహించలేక, జన్మ జన్మల గా ఆత్మలో అజ్ఞానం నింపుకుని దుఃఖం అనుభవిస్తూనే ఉంటాడు.


• ఈ రోజు, ఈ క్షణం ఇది చదివిన వారు ఒకటి ఆలోచించండి. నాలో దుఃఖం ఉందా లేదా. నాకు కావలసిన ధనం, ఆస్తి, సదుపాయాలు , ఆరోగ్యం అన్నీ ఉన్నాయా లేవా.   మరి నేను  పూర్తిగా అను నిత్యం, ప్రతి నిమిషం సంతోషంగా ఉంటున్నానా లేక ఆ సంతోషం కోసం ఇంకా వేరే మనుషుల మీద గాని, వస్తువుల మీద గాని ఆధారపడి జీవిస్తున్నానా, లేదా నేను ఇంకా సుఖం, సంతోషం కోసం ఎక్కడైనా వెతుకుతూ ఉన్నానా…… ఇటువంటి ప్రశ్నలు వేసుకుంటే ,  ఎన్నో  తెలియని సమాధానాలు మనిషి కి ఇస్తుంటాయి. మనిషి లో దాచబడిన సత్యాన్ని వెలికి తీస్తుంటాయి.

• మనిషి తనలో ని దుఃఖాన్ని పారద్రోలు కోవడం కోసం అజ్జానంతో కొన్ని వ్యాపాకాలకు బలి అవుతూ ఇంకా దుఃఖసాగరం లో మునుగుతున్నాడు.   సినిమా లు, మద్యం, పార్టీలు, జూదం, వ్యభిచారం, సమయం వృధా చేస్తూ కాలక్షేపం,  వ్యర్థ కబుర్లు,  వ్యర్థ విషయాల ఆలోచనలు,   ఇతరుల జీవితాలలో తొంగి చూడడం, దొంగతనం, అబద్ధాలు చెప్పడం, హింసించడం, మితి మీరి తినడం, అత్యాశ, ఇలా ఎన్నో రకాలుగా అలవాటు పడిపోయి అదే జీవితం, అదే నిజం, ఇలాగే బ్రతకాలి అని తెలియని దుఃఖాన్ని పెంచుకుంటూ, చెప్పాలంటే తరువాత జన్మలకు కూడా దుఃఖాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటున్నాడు కాబట్టి “మానిసి” అనే పదానికి అర్థం సార్థకం అయింది.


• మనిషి కి తన జీవన గమనంలో జీవించాలి అంటే ధైర్యంగా పోరాడాలి లేదా మరణించాలి. ఈ రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి. మరి దుఃఖం తో పోరాడడం అంటే తాత్కాలికంగా అడ్డదారుల్లో సుఖం అనబడే వ్యసనాలను వెతుక్కోవడమే నాా  లేదా  ఆ దుఃఖానికి బాధకు బలి అయిపోయి తనువును చాలించడమేనా ….. ఆలోచించండి.

• మన పూర్వీకులు అందరూ ఇలాగే జీవించారా? అనాదిగా ఉన్న నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలు మనిషి కి ఇవే తెలియచెప్పాయా ... ఆలోచించండి.

• మనిషి తన జీవనానికి దుఃఖం తో పోరాడాలి అంటే విచార సాగర మధనం చేయాలి. అంటే ఆ విచార దుఃఖం లోకి సముద్రమంత లోతుగా వెళ్లి అధ్యయనం పరిశీలన చేస్తే ఆ దుఃఖానికి కారణం తెలుస్తుంది. ఈ దుఃఖం నాకు ఎందుకు కలుగుతుంది, నేను ఏం చేసాను అని నిజాయితీగా ఆత్మ విమర్శతో ఆలోచించడం. ఇలా ఆలోచించేటప్పుడు మనలో కలిగిన దుఃఖానికి మనమే భాద్యులం, మరెవ్వరూ కాదు అనే నిజం తెలుసుకో గలుగుతాం.

• ఎందుకంటే పంచభూతాల తో తయారైన మనిషి , ప్రకృతి స్వరూపం.  మనిషి మాయకు వశమై ప్రకృతి ని పంచభూతాల ను మరచిపోయినా , ప్రకృతి మాత్రం మనిషి ని మరువక   మనిషి లో మంచి మార్పు కోసం సహాయకారి గా ఉంటుంది. ప్రకృతి తన ధర్మాన్ని విడిచిపెట్టదు.   ఎందుకంటే ప్రకృతి భగవంతుని లో భాగం.

• మనిషి కి తద్వారా ప్రకృతి నుంచి లభించే సమాధానం ఆలోచనల తో తెలుసుకొని దుఃఖ విమోచనం పొందుతాడు. అప్పుడే నరుడు నారాయణుడు గా అవుతాడు.

• అంతేగానీ దుఃఖం తో పోరాడడం అంటే, మరికొన్ని దుఃఖాలకు వశం అవడం కాదు. స్వాగతించడం అంతకన్నా కాదు.


• మనిషి కి తనలో ఒక హృదయం ఉందని గుర్తించిన నాడు ప్రేమించడం ప్రారంభమవుతుంది. ఈ ప్రేమ ప్రకృతి పరిసరాలను సంతోషంగా ఉంచుతుంది. (క్షమించాలి ప్రేమ అంటే కోరికలు, సెక్స్ కాదు.) హృదయం లో జాలి, దయ, కరుణ, అనురాగం, ఆప్యాయత, ఆరాధన , సంతోషం ఉంటాయి.

• మనిషి కి తనలో ఒక మెదడు ఉందని గ్రహించిన నాడు తర్కం గా (లాజికల్ గా) ఆలోచించడం మొదలు పెడతాడు. అందులో తన లాభం నష్టం, అహం, జయం అపజయం, మిత్రత్వం శత్రుత్వం, మోహం దుఃఖం ఇలా ఎన్నో లెక్కలతో నిండిన గుణాలు ఉంటాయి.

• మనిషి తన మెదడు లోని కి , తన హృదయాన్ని పిలిచి చోటు ఇచ్చి కలిపి ఆలోచించడం మెదలు పెట్టినపుడు మొదట జరిగేది తన నిజాయితీ, విచక్షణ కోల్పోవడం. రెండవది దుఃఖానికి ద్వారాలు తెరుస్తూ అజ్ఞానం నింపుకోవడం. ఎందుకంటే మెదడు తర్కం (లాజిక్) లో, హృదయం (ప్రేమ) ఇమడలేదు. ఎందుకంటే లాజిక్ లో ప్రేమ ఇమడలేదు.

• మనిషి తన హృదయం లోపల కి, తన మెదడు ని పిలిచి చోటు ఇచ్చి కలిపి ఆలోచించడం మొదలు పెడతాడో అప్పుడు మొదట జరిగేది సత్యం తెలుసుకోవడం, జ్ఞానం గ్రహించడం. రెండవది దుఃఖం పోయి నిత్యం ఆనందం గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే హృదయం (ప్రేమ) లో ఇమిడిన మెదడు తర్కం (లాజిక్) చేసేది లోక కల్యాణం. శుభకరం. ఎందుకంటే ప్రేమ త్యాగం, మంచి మాత్రమే చేస్తుంది. అదే శాశ్వత దుఃఖ విమోచనం.

• ఇది అంతా మంచి హృదయం ఉంటేనే సాధ్యం అవుతుంది.


Logic  Never  holds   Love

Love   Ever     holds   Logic


చివరి గా  ఒకమాట   

పరివర్తన  అనేది  మనిషి లో నే జరగాలి ,  తప్పా  మనిషి  చుట్టూ  ఎప్పుడూ  జరగదు.  నీ లో  మార్పు సంభవించినపుడు  నీ పరిసరాలలో కూడా మార్పు ను  నువ్వు  గమనించ గలవు.  పరివర్తన  ప్రవర్తన తోనే  సాధ్యం.


• నేను మనిషి ని అనుకునే ప్రతీ ఒక్కరికీ ఈ మూలార్దం తెలియడం కోసం ఈ రచన.

ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 16 March 2023 2:00 PM.




















Wednesday, March 15, 2023

321. పల్లె వాసుల కృతజ్ఞతలు


పల్లె వాసుల కృతజ్ఞతలు

మూలం : 1980 ల కాలం. అది బాగా వెనుకబడి కరువు కాటకాలు తో ఉన్న గ్రామం. ఒక యువతి ఆ గ్రామంలో ఉపాధ్యాయురాలు గా వచ్చి , పల్లెకు, ప్రజలకు, పిల్లలకు సేవ చేసి, చైతన్యం నింపి వెళ్ళింది. కృతజ్ఞతలతో , నేడు పల్లె వాసులు, పల్లె యాసతో…..


• నీ   ఊరు   పేరు      ఏదమ్మీ

  నీ    జాగ  లోగిలి     ఏడమ్మీ

  నీ    ఊరు   పేరు      ఏదమ్మీ

  నీ    జాగ   లోగిలి     ఏడమ్మీ.


• నాడు ...

  ఒంటరిగా       వచ్ఛినావు

  ఒంటె   లాగ  నిలిచి నావు.

  ఒంటరిగా       వచ్ఛినావు

  ఒంటె   లాగ    నిలిచి నావు.

• ఈ పల్లె    బూజు   దులిపి

  పసుపు     అద్ధినావు

  పట్టం        కట్టినావు.


• ఏ     తల్లి బిడ్డ  వో    చెల్లెమ్మ

  నీకు  బుణమై   ఉంటిమి   కదమ్మా.

  ఏ     తల్లి బిడ్డ  వో     చెల్లెమ్మ

  నీకు  బుణమై   ఉంటిమి   కదమ్మా.


• గొడ్ల   సావిడ్లోన     గడిపినాం .

  గంజి కోసం   గొంతు    ఎండ బెట్టినాం .

• గుక్కెడు    నీళ్ళ కు

  గుక్కెడు     నీళ్ళ కు

  సుక్కలు     సూసినాం .


• మా  బతుకు   పండక       ఎండినాం

  కరువు   తీరక  అప్పులు    సేసినాం

• బానిస లై      దొరల

  బానిస లై      దొరల

  కాళ్లను   కుక్క లల్లే     నాకినాం.


• ఏ   తల్లి బిడ్డ   వో    చెల్లెమ్మ

  నీకు  బుణమై   ఉంటిమి   కదమ్మా

  ఏ   తల్లి బిడ్డ   వో     చెల్లెమ్మ

  నీకు  బుణమై    ఉంటిమి   కదమ్మా.


• నాడు ...

  ఒంటరిగా      వచ్ఛినావు

  ఒంటె  లాగ   నిలిచి నావు.

• ఈ   పల్లె   బూజు    దులిపి

   పసుపు   అద్ధినావు

   పట్టం      కట్టినావు.


• మన్ను లో    దొర్లేటి    కూనల కి

  మన్ను లో    దొర్లేటి    కూనల కి

  మందలు     కాసేటి    మందికి

  మందలు     కాసేటి    మందికి

  అచ్చులు     సెప్పావు       చెల్లెమ్మా

  అచ్ఛరాలు   దిద్ధించావు   కదమ్మా.

 

• నువ్వు     నాటిన     విత్తులు

  రుక్సాలు    అయినాయి.

  పూలు   పలముల    సేత

  సంసారాలకు   నేడు    నీడ   నిత్తన్నాయి.


• నాడు    కల్లు   తాగిన

  పిల్లల   సేత   కలం    పట్టించావు

  నేడు   సర్కారు    కొలువు లో

  జీతగాళ్లు  గా    సేసినావు.


• నీ   సేతి   సలవతో

  నీ    సేతి  సలవతో

  ఆడోలి   ఆపద   లెన్నో   తీసేసినావు

  మూఢనమ్మకాలను

  మూఢనమ్మకాలను

  ముక్కు పిండి     విదిలించి నావు.


• నేడు 

  నిను సేరి    నీ బుణం  తీర్సాలంటే

  నీ   ఊరు    తెలియకుండే

  నీ   జాడ      తెలియకుండే


• ఏ    తల్లి బిడ్డ   వో   చెల్లెమ్మ

  నువ్వు   ఏడ    ఉన్న

  సల్లంగ   ఉండాలి     మాయమ్మా …

  మా ఊరి    మైసమ్మ.

  సల్లంగ    ఉండాలి    మాయమ్మా …

  మా ఊరి    మైసమ్మ.



యడ్ల శ్రీనివాసరావు 15 March 2023 8:00 PM.




















Sunday, March 12, 2023

320. ఎవరికి ఎవరో చివరికి ఎవరో

 

ఎవరికి ఎవరో    చివరికి ఎవరో



• ఎవరికి ఎవరో    చివరికి ఎవరో

  మమతలు   నిండిన  మనసు లతో

  మంచి గా   మసిలేది   ఎందరో.

• మాయలు   నిండిన   మనుషుల గా

  మసక    బారేది     ఇంకెందరో

  ఎవరికి   ఎవరో    చివరికి ఎవరో.


• అవసరాల   ఆరాటం

  కొందరి   జీవన   వేదం.

• జిత్తులమారి   పోరాటం

  ఇంకొందరి   జీవిత గమనం.


• నాటకాల   ఆట లో

  రాటు దేలిన   మనుషులు …

• రంగులద్దుకొని  మాయ లో 

  మునుగుతారు   తెలిసి.

• తుదకు    ఆ రంగులే 

  పూస్తారు   అందరితో  కలసి.


• ఎవరికి ఎవరో    చివరికి  ఎవరో

  ఎవరికి ఎవరో    చివరికి  ఎవరో

 

• మనుషుల తో    మసలాలంటే

  తికమక లు     ఎందుకో.

• మంచి వారిగ    మెలగాలంటే

  నిజాయితీ  చాలని    తెలియదు     ఎందుకో.



• మనిషి జీవనం   రణరంగం

  జీవితమే   ఒక    రంగస్థలం.

• అస్థిరమైన   మనసు  చేసేది

  ఆటు పోటుల   పడవ  ప్రయాణం.

• ఆరితేరిన   అసత్యాలన్నీ 

  ఏనాటికైనా  అగాధపు   దుఃఖాలు.

• మోహనికి   దాసోహం

  విలువ  కోల్పోయే   వికారం.


• ఎవరికి ఎవరో    చివరికి ఎవరో

  ఎవరికి ఎవరో    చివరికి ఎవరో


• కాలక్షేప   కలయికలు

  ఏనాటికైనా  చేరేది   కాలగర్భంలో.

• కాలక్షేమ   కలయికలే

  ఏనాటికైనా   నిలిచేది   కాలతలం లో.


• ఎవరికి  ఎవరో   చివరికి ఎవరో

  మమతలు   నిండిన   మనసు లతో

  మంచి గా   మసిలేది    ఎందరో.

• మాయలు  నిండిన    మనుషుల గా

  మసక    బారేది   ఇంకెందరో

  ఎవరికి ఎవరో    చివరికి ఎవరో.


• నాది   నాదనేది   ఒక  చింత.

  ఏదీ   నాది  కాదన్న  నాడే   నిశ్చింత.

• అందరూ  నా వారు     అనేది     చింత.

  నేను ఎవరి వాడిని  కాదు   అనేది    అక్షింత.


• ఎవరికి ఎవరో     చివరికి ఎవరో

  ఎవరికి ఎవరో      చివరికి ఎవరో.


• ఓ మనిషి ....

  నీ జీవితం ఎలా ఉన్నా    ఆనందించు

  కానీ

  నీ   జీవితం తో   నువ్వు   ఆటలు   ఆడకు.

  ఎందుకంటే  జీవితం తిరిగి ...   

  నీతో   ఆట  ఆడడం మొదలెడితే 

  నీ ఊహకు   కూడా   

  అందనంత పాతాళంలో ఉంటావు.


•  ఈ జన్మలో దొరికిన   జీవితం  

    ఉత్తమమైనా ,  అధమఃమైనా

    ఆనందించడానికే  గాని  ,  

    సాటి మనుషులతో   ఆటలు  ఆడి 

    అభాసుపాలు   కావడానికి కాదు.


 స్వీయ అంకితం

ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 12 Mar 2023 , 10:00 PM











Friday, March 10, 2023

319. శ్రీ హరి గోవింద

 

శ్రీ హరి గోవింద



• శ్రీ హరి   గోవింద  గోవింద 

  భజ   గోవింద     గోవింద  గోవింద.

  శ్రీ హరి    గోవింద  గోవింద 

  భజ    గోవింద    గోవింద  గోవింద.


• హరి నామము న    నిలిచింది   మకరందము.

  హరి  జపము తో     తెరిచింది    వైకుంఠ ద్వారము.


• తిలక ధారణ    చేసిన   మంగళ కరము

  పలికి ధారణ     చేసిన   అమృత ఫలము.


• శ్రీ హరి   గోవింద  గోవింద 

  భజ   గోవింద     గోవింద  గోవింద

  శ్రీ హరి   గోవింద  గోవింద 

  భజ    గోవింద     గోవింద  గోవింద


• హరి స్మరణము         దుఃఖ   సంహరణము. 

  సమ్మోహనస్త్రాల ను    సంధించు   శస్త్రము. 


• మనసు న   నిలిపి న      నిత్య  *కళ్యాణము

  స్వరము న   పలికి న      సత్య  *పారాయణం.


• శ్రీ హరి   గోవింద  గోవింద 

  భజ  గోవింద      గోవింద  గోవింద

  శ్రీ హరి    గోవింద  గోవింద 

  భజ   గోవింద      గోవింద  గోవింద


• శ్రేష్ట కర్మల    భాగ్యముు        వైకుంఠ దర్శనం.

  మోక్ష జన్మల పయనము    శ్రీ నివాసుని సదనము.


• మాయ తొలగిన    మార్గము   

  మాధవుని   సన్నిధానం.

  జ్ఞానము  తెలిసిన    చేరును    

  జగన్నాధుని   *సమ్ముఖం.


• శ్రీ హరి   గోవింద  గోవింద 

  భజ    గోవింద      గోవింద  గోవింద.

  శ్రీ హరి   గోవింద  గోవింద 

  భజ    గోవింద      గోవింద  గోవింద.


కళ్యాణము = శుభకరం

పారాయణం = చదవడం, పలకడం.

సమ్ముఖం = ఆశ్రయం.


యడ్ల శ్రీనివాసరావు 10 Mar 2023 10:00 pm .


















Wednesday, March 8, 2023

318. ఏమన్నానని


ఏమన్నాన ని



• ఏమన్నాన ని   … నే నేమన్నాన ని

  ఔనన  లే     కాదన  లే

  ఔనన ని      కాదన  లే

  కాద ని        ఔనన  లే

  అస లే మన్నాన ని … నే నే మన్నాన ని.


• తొలకరి  జల్ల ల్లే    తడిచి

  ముద్దయ్యింది   తొలి పరిచయం.

  ఉరుముల   మెరుప ల్లే

  పెనవేసుకుంది    స్నేహం.


• అడుగులు   వేస్తున్న   బంధం

  ఆనందాన్ని   బాట గా   చేస్తుంటే ...

  మోమాటపు    మనసు ల్లో

  ఏదో   ...

  కల్మషం   ఎరుగని   బిడియం.


• ఎవరికి చెప్పాలి  …  ఏమని చెప్పాలి

  ఎగిరే  పావురం    పలకరించి    పోతుంది.

  మెరిసే నక్షత్రం      సిగ్గు లొలక  పోస్తుంది.

 

• ఏమన్నాన ని   …  నే నేమన్నాన ని

  ఔనన లే      కాదన లే 

  ఔనన ని      కాదన లే

  కాద ని         ఔనన లే

  అస లే మన్నాన ని …  నే నే మన్నాన ని.


• ముసి ముసి నవ్వుల    కలయిక

  మురిపాల ను    కురిపిస్తుంటే ...

  కనురెప్పలు   వేసే    ప్రశ్నలకు

  జవాబు    ఎక్కడ    వెతకాలి.


• అల్లరి చేష్టల    మాటలు

  ముత్యా లై       పొర్లుతూ ఉంటే ...

  దోసిలి  చాలని   చేతుల పై

  నిట్టూర్పుని    ఎంత ని   విడవాలి.


• ఏమని  అనుకోవాలి  …  ఎలాగ  ఊహించాలి

  వెలిసిన  వర్షం    చెమ్మ         విడిచి పోయింది.

  మబ్బు చాటు   సూర్యుడు   ఆవిరి చేస్తున్నాడు.


• ఏమన్నాన ని   … నే నేమన్నాన ని

  ఔనన లే      కాదన లే

  ఔనన ని      కాదన లే

  కాద ని        ఔనన లే

  అస లే మన్నాన ని  …  నే నే మన్నాన ని.


యడ్ల శ్రీనివాసరావు  9 Mar 2023 10:00 AM.










Monday, March 6, 2023

317. అర్ద నారీ ఈశ్వరం - మహిళా దినోత్సవ సందర్భంగా

 

అర్ద  నారీ  ఈశ్వరం

మహిళా దినోత్సవం శుభాకాంక్షలతో.

అమెరికా లో స్థిరపడిన నా ఇంటర్మీడియెట్ మిత్రుడు మరియు నా  శ్రేయోభిలాషి  బొడ్డు శ్రీహరి కుమార్తె చిరంజీవి "ఈషా". ఇటీవల అమెరికా లో ప్రదర్శించిన శివుని "అర్థనారీశ్వర"  రూప నాట్యం.



• తెలుసు కో   మానవ   తెలుసు కో

  శివుడంటే    తండ్రే      కాదని

  శివుని లో    ఓ తల్లి    ఉందని.

• తెలుసు కో   మానవ   తెలుసు కో

  శివుడంటే    తండ్రే     కాదని

  శివుని లో     ఓ తల్లి    ఉందని.


• అర్ధనారీశ్వరుని      నిదర్శం

  సకల  మానవాళికి   ఆదర్శం.


• మానవ   జన్మకు   మూలం    మహిళని

  మహిళ   లేనిదే      మనుగడ లేదని 

  ప్రకృతి లో    స్త్రీ   నిలిచింది.

  సృష్టి కే   ఆరాధన  అయ్యింది.


• తెలుసు కో    మానవ    తెలుసు కో

  మహిళంటే    మనిషి    కాదని

  మహిళంటే    మహాశక్తి  అని.


• అమ్మ లోని    అమృతం

  మనిషి    జీవానికి     ఊపిరి.

• నారి      లోని   నిర్మలం

  సహనం  నింపే   చైతన్యం.


• తెలుసు కో     మానవ    తెలుసు కో

  మహిళంటే   *భోగి   కాదని

  మహిళంటే    భాగ్య   మని.


• వనిత   లోని    వెలుగు

  నిర్బయ  మిచ్ఛే   వీరత్వం.

• లలిత   గా    ప్రేమ తో 

  లాలిత్య   మిచ్ఛే   లతాంగి.


• తెలుసు కో    మానవ    తెలుసు కో

  మహిళంటే    బొమ్మ  కాదని

  మహిళంటే    మానవత్వ మని.


• ఫలితం   పొందక

  ఫలాల నిచ్చే   వృక్షం   మహిళ.

• మగ ని   మోడు గ   కాకుండా

  పరిమళం   నింపేటి   కుసుమం   మహిళ.


• మహిమాన్విత     మహిళ కి

  సర్వ శక్తులు  దాసోహం

  అందుకే   మహిళంటే

  ఆదిశక్తి    రూపం ... పరాశక్తి స్వరూపం.


• తెలుసు కో   మానవ   తెలుసు కో

• శివుడంటే    తండ్రే     కాదని

  శివుని లో    ఓ తల్లి   ఉందని.

• మహిళంటే   మనిషి   కాదని

  మహిళంటే   మహాశక్తి   అని.

• మహిళంటే   భోగి  కాదని

  మహిళంటే   భాగ్య మని.

• మహిళంటే   బొమ్మ  కాదని

  మహిళంటే   మానవత్వ మని.


భోగి = విలాస సుఖము నిచ్ఛె


మహిళా దినోత్సవ శుభకాంక్షలు 💐


మహిళలు గా జన్మించిన వారు మానవ మూలాలలో పురుషుల కంటే ఎంతో మానసిక బలవంతులు. ఇది భగవంతుడు స్త్రీ లకు ఇచ్చిన వరం . ఎందుకంటే స్త్రీకి ప్రతిసృష్టి తత్వం వలన , ఓర్పు, సహనం, నిర్మలం, ప్రేమ వంటివి స్త్రీ శరీర నిర్మాణంలో జన్మతః సహజంగా ఏర్పడిన విశిష్ట మైన లక్షణాలు ఇవి.

స్త్రీ ని ఆదిశక్తి అని, పరాశక్తి అని అంటారు. ఆది శక్తి అంటే శక్తి కి మూలం. పరా శక్తి అంటే వీరత్వానికి , శత్రు సంహరానికి ప్రతీక.

ఒక మనిషి (ఆడ లేదా మగ) ఈ భూమి మీద పెరగాలి అంటే ముఖ్యం గా,  ఒకటి మనుగడ చెయ్యాలి. రెండవది శత్రువుల నుంచి తనను తాను రక్షించు కోవాలి.

మనిషి మనుగడకు కావలసిన శక్తి , ఆదిశక్తి.  మనిషి రక్షణ కి కావలసిన శక్తి , పరాశక్తి.   ఈ రెండు శక్తులు ఎవరికైనా లభించేవి స్త్రీ నుంచి మాత్రమే. అందుకే పరమాత్ముడు అయిన శివుడు, సగభాగం స్త్రీ ని తనలో నిలుపుకొని  మానవాళికి సందేశం  ఇచ్చాడు.  స్త్రీ లేనిదే ప్రతి సృష్టి లేదని తెలియచేసాడు.


నేటి  కలియుగ కాలంలో సైన్స్, సాధనాలు, గొప్ప చదువులు, అభివృద్ధి అంటూ పరుగులు పెట్టే  మానవునికి సనాతన ధర్మం, కుటుంబ విలువలు, బంధాలలో ఉన్న ఔన్నత్యం మరియు ఉన్నతి ని కోల్పోయి అధోగతి తో, మానసిక ఒత్తిడి తో కూడిన జీవితం తో జీవనం సాగిస్తు సుఖం శాంతి లేక జీవిస్తున్నాడు.


దీని వలన నేటి తరం లో చాలా మంది కి మనుషుల పట్ల, మానవ సంబంధాల పట్ల కనీస అవగాహన, మర్యాద, సరియైన మాట తీరు లేకుండా అయోమయ పరిస్థితిలో వివాదాలతో జీవనం సాగించడం నేడు ప్రతి చోటా కనిపిస్తుంది.


స్త్రీ ఎక్కడైతే పూజింప బడుతుందో , ఆ ప్రదేశం స్వర్గ సీమ అవుతుందని సాక్షాత్తు భగవంతుని సందేశం. 

స్త్రీ లను పూజించక పోయినా పరవాలేదు కనీసం గౌరవించండి.  

ఒకవేళ గౌరవించడం చేత కాకపోయినా పరవాలేదు కానీ చులకన గా, అవమానం గ చూడకండి, మాట్లాడకండి. 

మంచిని చెప్పడం ప్రోత్సాహించడం,  భారతీయుని సంస్కారం. 

అదే విధంగా మంచిని ఆచరించడం ప్రతీ మనిషి ధర్మం.



• ఓం శాంతి 🙏

• ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 7 March 10:00 PM.





316. పౌర్ణమి

 

పౌర్ణమి



• వచ్చిందోయ్        వచ్చింది

  నిండు  జాబిలి     వచ్చింది.

  పండు  వెన్నెల     తెచ్చింది

  భూమి  అంతటా  పంచింది.


• మసక  బారిన   మనసు లకు

  మంచి  ముత్యాలు   ఇచ్చింది.

  ముఖాన   చిరునవ్వుల ను

  చిలకరించేసి    వెళ్లింది.


• వచ్చిందోయ్        వచ్చింది

  నిండు   జాబిలి    వచ్చింది

  పండు   వెన్నెల     తెచ్చింది

  భూమి   అంతటా  పంచింది.


• పక్షం    రోజుల కు

  పరువం  నింపుకుని  వస్తుంది.

  రోహిణి   తారక పై

  లాలిత్యం  ఒలక   పోస్తుంది.


• కవుల    మది లోన   మెరిసేలా

  కమ్మని    కవితలు  ఎన్నో   ఇస్తుంది.

  కొమ్మ న    నిలిచిన    కోయిల  చే 

  కోటి   రాగాలు   పలికిస్తుంది.


• వచ్చిందోయ్        వచ్చింది

  నిండు   జాబిలి    వచ్చింది

  పండు   వెన్నెల     తెచ్చింది

  భూమి   అంతటా  పంచింది.


• భావోద్వేగాల   నడుమ

  నవరసాలను  ధారణ  చేస్తుంది.

  ఆశల  భాసల తో

  లలిత కళలకు   జీవం పోస్తుంది.


• నేలను   తాకే    నీడకు

  సాక్షి భూతి గా   ఉంటుంది.

  అనురాగం  పంచే   మనిషి కి

  ఆనంద రూపం   అవుతుంది.


• వచ్చిందోయ్        వచ్చింది

  నిండు   జాబిలి    వచ్చింది

  పండు   వెన్నెల     తెచ్చింది

  భూమి   అంతటా  పంచింది.


యడ్ల శ్రీనివాసరావు 7 March 2023 12:30 AM








Sunday, March 5, 2023

315. మనసు పయనం


మనసు పయనం


• మనసా   ఓ  మనసా

  నీ పయనం  ఎందాకో   తెలుసా.


• ఒంటరి  వై   బాల్యం లో

  తుంటరి   తుమ్మెద    కాలేదు 

  భారం   నిండిన    బంతి లా

  నేలను   తాకుతు   నిలిచావు.

  మనసా   ఓ   మనసా .


• భయం  నిండిన   బాటసారి లా

  దిక్కుల   నడుమ   నలుగుతూ

  బంధాలు   తెలియని   బందీ వై

  బ్రతుకు   తీపి కై    వెతికావు.

  మనసా   ఓ   మనసా .


• మనసా   ఓ   మనసా

  నీకు  ఏమి   కావాలో   తెలుసా.


• ఉరకలు   వేసే   యవ్వనంలో

  ఊయల  ఊగే   తరుణం లో

  రంగుల  లోకం  చూసావు

  రంగులంటక   తిరిగావు 

  మనసా  ఓ  మనసా .


• ఆశల  పల్లకిలో  ఎగరాలన్న

  ఆకాశం లో   దారి    తెలియక

  అయోమయం తో   గడిపావు.

  విది వంచన తో    పని చేసావు.

  మనసా   ఓ  మనసా.


• మనసా   ఓ   మనసా

  నీలో ఏమి   దాగుందో   తెలుసా.


• ఊహ కందని   దివ్యం తో

  సృష్టి   జీవ   నిక్షిప్తాలు.

  అది  అంత్యాల  చక్రం లో

  నిగూఢమైన   విశేషాలు.

  మనసా   ఓ   మనసా.


• ఆత్మ   పరమాత్మల   యోగాలు

  జీవన్ముక్తి   సోపానాలు

  శక్తి బీజ     స్వరూపాలు

  సేవాభావ   పురుషార్థాలు.

  మనసా   ఓ    మనసా.


• మనసా   ఓ   మనసా

  నీ పయనం   ఎందాకో  తెలుసా

  పరమాత్ముని  చెంతకు  చేరే  వరకు.


• మనసా   ఓ  మనసా

  నీకు ఏమి  కావాలో   తెలుసా

  స్వర్గ సీమ లోని   ఆత్మానందం.


• మనసా    ఓ   మనసా

  నీలో  ఏమి దాగుందో  తెలుసా

  పూర్వ   పుణ్యాల  సుకృతం.



ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 5 March 2023 , 11:30 pm.











314. నిజమ య్యేనా

  


                                 నిజమ య్యేనా 




• ఏదైనా   ఏమున్నా

  ఏనాటికైనా   ఇది   నిజమ య్యేనా.


• తెరలు తెరలుగా   తరలి  వస్తున్న

  అలల  ఆలోచనలు

  ఎక్కడివి   ఎన్నటివి.


• కన్నుల  కందని   లోకంలో

  కలల    కోట లో   రూపాలా.

• ఊయల     ఊగే      మేఘాలలో

  మంచు ను  తాకిన   స్వప్నాలా.


• ఏదైనా    ఏమున్నా

  ఏనాటికైనా  ఇది నిజమ  య్యేనా.


• రవి ని    తాకిన    బిందువు నై

  కవి ని     గాంచిన   జీవా న్నా .

• జాబిలి    మనసు న    దీపాన్నై

  కవిత     రాసిన     వెన్నెల నా.


• ఏదైనా    ఏమున్నా

  ఏనాటికైనా   ఇది నిజమ య్యేనా.


• తెరలు తెరలుగా   తరలి వస్తున్న

  అలల     ఆలోచనలు

  ఎక్కడివి    ఎన్నటివి.


• పన్నీరు    చల్లిన    భావాలన్నీ

  పుష్పం    విడిచిన  బాష్పా లా.

• పొడిబారిన    మది కి     తడి

  నింపేటి     సెలయేరు   కావ్యా లా.


• ఏదైనా     ఏమున్నా

  ఏనాటికైనా   ఇది నిజమ య్యేనా.


• రంగులు   తెలియని  రంగం లో

  రాసే    రచన ల    రూపం.

• పెదవి    పలకని     లోకం లో

  పాడే    కోయిల    గానం.


• ఏదైనా    ఏమున్నా

  ఏనాటికైనా   ఇది నిజమ య్యేనా.


• తెరలు తెరలుగా తరలి వస్తున్న

  అలల   ఆలోచనలు

  ఎక్కడివో  ఎన్నటివో.


యడ్ల శ్రీనివాసరావు 5 Mar 2023 2:00 pm.














Wednesday, March 1, 2023

313. ఇచ్ఛెస్తే పోలే

 

ఇచ్ఛెస్తే పోలే



• “ ఇచ్ఛెస్తే పోలే ” ఇది చాలా బాగుంది కదా …. అవును ఎవరైనా ఏదైనా అడిగింది ఇచ్ఛెస్తే పోలే. మరి ఏది ఇవ్వాలి,  ఎలా ఇవ్వాలి ,  అసలు ఎందుకు ఇవ్వాలి.  అసలు ఇవ్వాలంటే ,  ఇవ్వవలసినది మన దగ్గర ఉందా లేదా … ఒకవేళ ఉంటే ఇవ్వడానికి మనసు అంగీకరిస్తుందా లేదా … ఇదే కదా సమస్య.


• అవును. మనిషి జన్మ కు ఒక విధంగా  మొత్తం సమస్య అంతా ఇదే .… ఏ ఇద్దరి మనుషుల మధ్య చూసినా వంద శాతం సమస్యల కి,  మనస్పర్థల కి  మూలకారణం ఒక్కటే.  అది ఏంటంటే,   ఒకరు ఆశించింది,    ఒకరికి కావలసింది మరొకరి నుంచి లభించక పోవడం.   

ఇలా ఆశించడం  అనేదానికి  కారణం ఒక మనిషి కి  మరో మనిషి పై ఉండే   “ ఆశ “   లేదా   “ హక్కు “.  ఇందులో  ఆ బంధం, ఈ బంధం అనే ప్రసక్తి  లేదు. సమస్త మానవాళి బంధాలలో   ఇమిడి పోయిన , చెప్పాలంటే అనాదిగా అలవాటు పడిపోయిన ఒక మనిషి మానసిక తత్వ స్థితి ఇది .  

ఇకపోతే మనిషి కి ఇది  బలమా, బలహీనత అనేది నిర్ణయించడం కూడా కష్టం. ఎందుకంటే కావలసింది దక్కితే బలం,   దక్కకపోతే బలహీనం.  

ఎవరికైనా సరే  దీనికి పూర్తి పరిష్కారం తో కూడిన ఏకైక సమాధానం ఒక్కటే   “ ఇచ్ఛెస్తే పోలే ”.


• ఈ సృష్టిలో ప్రతీ మనిషి కి , తన జీవిత కాలంలో సాటి మనిషి నుంచి ఏదో ఒకటి కావాలి. అది సంతోషం, స్నేహం, ప్రేమ, ధనం, బానిసత్వం, సహాయం, కామం, కోరికలు, మోహం, కాలక్షేపం, గౌరవం, సుఖం, అవసరం   తీర్చు కోవడం,  మానసికంగా  శారీరకంగా ఆధార పడడం … ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మనిషి కి,  తన తోటి సాటి మనిషి నుంచి , ఏ బంధం లో ఉన్నా సరే ఏదోకటి తప్పని సరిగా కావాలి. బహుశా ఈ ప్రక్రియ  సృష్టి లో ఒక భాగం అయి ఉంటుంది.


• కావలసినది మనిషికి దొరికితే చాలా ఆనందం, సంతోషం, సుఖం.   అప్పుడు మనిషి లో అంతర్లీనంగా ఉండే అహం, తృష్ణ చల్లబడుతుంది.  ఏదో సాధించిన విధంగా  అనిపిస్తుంది.  గాలిలొ తేలినట్టు ఉంటుంది.


• కానీ కావలసినది దక్కకపోతే ... మొదలవుతుంది ఇక్కడే అసలు సిసలు ఆరాటం, పోరాటం, అంతర్యుద్ధం. బహుశా అన్ని సమస్యలకు, ఎన్నో వివాదాలకు ఇదే మూలం.


• ఉదాహరణకు ఒక మనిషి  ఒక వస్తువు ను కోరుకుంటే, అతనికి అది దక్కుతుందో  లేదో అని తెలుసుకో గలడు.  ఎందుకంటే తన దగ్గర ఉన్న వనరులు, ధనం, సంపదల తో  అది తనకు సాధ్యమా కాదా అనే ఒక అవగాహన కలిగి ఉంటాడు.


• కానీ అదే  ఒక మనిషి ,  మరో మనిషి నుండి ఏదైనా ఆశిస్తే, అంటే ప్రేమ, స్నేహం, ఆరాధన, సంతోషం, ఆనందం, బానిసత్వం, ధనం, సుఖం, శాంతి, ధైర్యం వంటివి…. దొరుకుతాయో, దొరకవో చెప్పలేం. ఎందుకంటే అది పూర్తిగా కర్మైక స్థితి తో ఆధారపడి ఉంటుంది. 

• ఎందుకంటే ఏదైనా మనకు ఒకటి దొరకాలి, పొందాలి  అంటే ముందు ఇవ్వడం నేర్చుకోవాలి.

• ఇవ్వడం అంటే మాయతో, నటనతో, బాధతో  కాదు. నిజాయితీ తో, చిత్తశుద్ధితో ఏదైనా ఇస్తేనే, అది తిరిగి లభిస్తుంది .

• చాలా మంది మనుషుల మధ్య సంబంధాలు దీర్ఘకాలం సజావుగా లేకపోవడానికి ఇదే ఒక ముఖ్య కారణం.   ఒక బంధం, సంబంధం మనుషుల మధ్య ఏర్పడిన కొత్త లో అన్నీ సజావుగా అనిపిస్తాయి. ఆరంభం లో అన్నీ బాగుంటాయి. ఒకరి కోసం మరొకరు ఏదైనా ఇవ్వగలుగుతారు, చెయ్య గలుగుతారు.

• కానీ కాలం గడిచే కొద్దీ మార్పులు సంభవిస్తాయి. ఎందుకంటే , ఆ తరువాతే అంతర్లీనంగా దాగి ఉన్న మనిషి లోపలి అసలు సిసలైన బుద్ది తో మనిషి మెల్లగా నెమ్మదిగా బయటకు వస్తాడు. ఇక్కడే ఒకరిపై మరొకరు  లెక్కలు, బేరీజు వేసుకోవడం మొదలవుతుంది. బంధాలలో ఉన్న మనుషుల మధ్య ఈ  స్థితి  విపరీతానికి  చేరకూడదు.  అంటే ప్రతీ మనిషి తనను తాను బాలెన్స్ చేసుకోవాలి …. ఆశించడం కంటే ఇవ్వడం లో ఉన్న ఆనందాన్ని తెలుసుకోవాలి.


• అందుకే ఎవరైనా ఎప్పుడైనా ఇవ్వగలిగింది తమ దగ్గర ఉన్నప్పుడు  “ ఇచ్ఛెస్తే పోలే “.  

ఇవ్వడం అనేది ఎప్పుడూ నష్టం (loss) కాదు . 

అది రెట్టింపు అయి తిరిగి తప్పక చేరుతుంది … 

ఏదోక రూపం లో.


కానీ మనిషి కి జన్మ జన్మలు గా  తన ఆత్మ లో  ఏదైనా తీసుకోవడం , పొందడం అనే  అలవాటు రికార్డు అయిపోయి  .‌.... వదులుకోవడం, ఇవ్వడం అనేది అంత సులభం గా  చెయ్యలేరు.


ఒకటి మాత్రం నిజం ... ఏదైనా  ఇస్తున్నప్పుడు దాని ద్వారా సమస్యలు మొదలవుతాయి అనిపించినపుడు ఇవ్వక పోవడం మేలు.  ఇచ్చే దాని వలన మేలు కంటే కీడు, అపకారం ఎవరికైనా సరే సంభవిస్తుందని అనిపించినపుడు కూడా ఇవ్వకపోవడం మంచిది....ఈ విషయం విజ్ఞత తో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.


ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు,  ఏదీ మనతో రాదు అని తెలిసినపుడు ....  చేతి పిడికిలి గుప్పెడు బిగించి , ఏం ప్రయోజనం ... నొప్పి తప్ప.  అందుకే చేతి గుప్పెడు తో పాటు గుప్పెడు మనసు తెరిస్తే పోలే.... "  ఇచ్చెస్తే పోలే ".


ఇదంతా మనిషి  అంతర్లీనంగా, అంతర్గతం గా  సూక్ష్మ దృష్టితో ఆలోచించు కోవలసిన ఒక ధృడమైన మానసిక  స్థితి.


గమనిక :  "ఇచ్ఛెస్తే పోలే" అనే పదం వ్యవహరిక భాష లో  తేలిక గా  ఉంటుంది అని ఒక  ఈజ్ కోసం ఉపయోగించడం జరిగింది. అంతే కానీ తేలికపాటి భావం తో గాని, జాలి తో  అనే భావజాలం తో దయచేసి ఆ పదం ముడి పెట్టవద్దు. 

యదార్థ  సూక్ష్మ భావం ఏంటంటే అది (Kindness, Mercy),  దయ, కరుణ తో ముడి పడిన భావం గా  స్వీకరించాలి.  "ఇచ్ఛెస్తే పోలే".

🙏🙏


యడ్ల శ్రీనివాసరావు 1 Mar 2023 5:00 PM.











491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...