ఏమన్నాన ని
• ఏమన్నాన ని … నే నేమన్నాన ని
ఔనన లే కాదన లే
ఔనన ని కాదన లే
కాద ని ఔనన లే
అస లే మన్నాన ని … నే నే మన్నాన ని.
• తొలకరి జల్ల ల్లే తడిచి
ముద్దయ్యింది తొలి పరిచయం.
ఉరుముల మెరుప ల్లే
పెనవేసుకుంది స్నేహం.
• అడుగులు వేస్తున్న బంధం
ఆనందాన్ని బాట గా చేస్తుంటే ...
మోమాటపు మనసు ల్లో
ఏదో ...
కల్మషం ఎరుగని బిడియం.
• ఎవరికి చెప్పాలి … ఏమని చెప్పాలి
ఎగిరే పావురం పలకరించి పోతుంది.
మెరిసే నక్షత్రం సిగ్గు లొలక పోస్తుంది.
• ఏమన్నాన ని … నే నేమన్నాన ని
ఔనన లే కాదన లే
ఔనన ని కాదన లే
కాద ని ఔనన లే
అస లే మన్నాన ని … నే నే మన్నాన ని.
• ముసి ముసి నవ్వుల కలయిక
మురిపాల ను కురిపిస్తుంటే ...
కనురెప్పలు వేసే ప్రశ్నలకు
జవాబు ఎక్కడ వెతకాలి.
• అల్లరి చేష్టల మాటలు
ముత్యా లై పొర్లుతూ ఉంటే ...
దోసిలి చాలని చేతుల పై
నిట్టూర్పుని ఎంత ని విడవాలి.
• ఏమని అనుకోవాలి … ఎలాగ ఊహించాలి
వెలిసిన వర్షం చెమ్మ విడిచి పోయింది.
మబ్బు చాటు సూర్యుడు ఆవిరి చేస్తున్నాడు.
• ఏమన్నాన ని … నే నేమన్నాన ని
ఔనన లే కాదన లే
ఔనన ని కాదన లే
కాద ని ఔనన లే
అస లే మన్నాన ని … నే నే మన్నాన ని.
యడ్ల శ్రీనివాసరావు 9 Mar 2023 10:00 AM.
No comments:
Post a Comment