Saturday, September 23, 2023

402. ప్రకృతి పాటవం

 

ప్రకృతి పాటవం 



• లలిత  ప్రియ  కమలం

  విరిసే

  కనుల కోసం .

• మధుర  జల  సరసం

  కలిసే

  తపన   కోసం .

• జాలువారే   కిరణం

  తపించే

  ప్రకృతి   కోసం .

• శ్వేత   నీలి వర్ణం

  ఆశించే

  వెన్నెల   కోసం .


• విరిసి     కలిసిన   యోగం

  ప్రేమ కు   సుందర  భాగ్యం .

• తపించే     ఆశల  భోగం

  ప్రేమికుల   శృంగార దీపం .


• కారుమబ్బుల   హృదయం

  హర్షించే

  కారుణ్య   వర్షం.

• మంచు  తెరల   అందం

  శోభించే

  సన్నజాజి  వర్ణం.

• మలయ  మోహ  గంధం

  గుబాళించే

  మానస  స్వర్ణం‌.

• సూర్యరశ్మి    తేజం

  కౌగిలించే

  పుడమి  స్వప్నం .


• హర్షించే   శోభన  శృతి

  మన్మధ  లయ సాగరం.

• గుబాళించే   వెచ్చని కౌగిలి

  స్వర్గం లో   తేలే  సంబరం .


  పాటవం = నైపుణ్యం, సామర్థ్యం.

  సరసం = సెలయేరు, సరస్సు. 

  

యడ్ల శ్రీనివాసరావు 23 sep 2023  9:00 pm. 




Friday, September 22, 2023

401. నీవే నా ఆ నీవు

 

నీ వేనా   ఆ  నీవు



• నీ   వేనా

  ఆ   నీవు   నీవే నా.


• సప్త  పది న

  స్వర్ణ  మాలతి   నీ వేనా.

• సప్త  స్వరాల

  సురభి  నారీ     నీ వేనా.


• నీ వేనా

  ఆ  నీవు    నీవే నా.

 

• రకతపు   మడుగులో

  రహదారి    ఒడిలో

  నే  చివరిగ  చూసిన

  దార వి      నీవే నా.


• విడిచిన    వేలికి

  చిటికెడు   ఊపిరి  లేక

  నే  పలికిన   మాటకు

  ఊపిరి     నీవే నా.


• నీ వేనా

  ఆ నీవు   నీవే నా.


• కలిసిన   జీవితం లో

  కల గా    మిగిలిన

  నా  కావ్య   కమలిని

  నీవే   నా.


• ప్రేమను     నింపే

  హృదయం  కలిగిన 

  నా అమృత  వర్షిణి

  నీవే  నా.

 

• నీ  వేనా

  ఆ నీవు   నీవే నా.


• ఊసుల   సరిగమ

  జీవం    నీ వేనా.

• చూపుల   ఆశా 

  ప్రాణం   నీవే నా.

 

• నీ  వేనా

  ఆ నీవు    నీవే నా.


• సప్తపది = ఏడడుగులు

• మాలతి = జాజితీగ

• సురభి = మనోజ్ఞమైన

• నారీ = భార్య

• దార = భార్య

• కమలిని = తామర కొలను


యడ్ల శ్రీనివాసరావు , 22 sep 2023, 11:00 pm.


Thursday, September 21, 2023

400. రౌద్రం ఆరుద్రం

 

రౌద్రం ఆరుద్రం



• ఎనాటి దో      ఈ సంద్రం.

  ఏపాటి దో      ఈ ఆత్రం.

• ఏ జన్మ దో     ఈ కర్మం

  ఎంతున్నదో    అవశేషం


• ఢమరుక   నాదం    ఉద్వేగం

  తాండవ    నాట్యం   లయకరం.

• రుద్రుని     రాకతో     రౌరవం

   రౌద్రం     అయేను    ఆరుద్రం.


• ఎనాటి దో     ఈ సంద్రం.

  ఏపాటి దో     ఈ ఆత్రం.


• ఏకాంతం    నింపెను   కాంతిని

  ఏ కాంత     నింపని     శోభని.

• మది లోన   తడిసెను    తపనలు.

  కంటతడి  తోను   కరిగెను   తుఫానులు.


• ఏ జన్మ దో     ఈ కర్మం

  ఎంతున్నదో   అవశేషం‌

• ఆరుద్ర   సారం   శక్తి స్వరూపం

  భావోద్వేగాల   ఆటలు   పరిసమాప్తం.


• మోహం   విడిచిన    దేహం

  దుష్ట తత్వాల  వేట యే  కర్మం.

• కాలం    చేరింది     గమ్యం

  శేషం   అవుతుంది  జయం.


• ఎనాటి దో    ఈ సంద్రం.

  ఏపాటి దో    ఈ ఆత్రం.

• ఏ జన్మ దో     ఈ కర్మం

  ఎంతున్నదో   అవశేషం.


రౌరవం = భయానకం

ఆరుద్రం = తడిసినది ఆరుద్ర నక్షత్రం.


యడ్ల శ్రీనివాసరావు 21 sep 2023 , 10:00 pm.


Wednesday, September 20, 2023

399. చెప్పవే సింగారి

 

చెప్పవే  సింగారి



• చెప్పవే   సింగారి

  నను   విడవని   శృంగారి.

  ఎన్నాళ్ల కి   వచ్ఛావో

  నాకేమి    ఇస్తావో.


• ఆ  చూపుల  కేమిటి   అర్దం

  నా మనసు కి   తెలియని  భావం.

  ఆ  నవ్వుల   కేమిటి   భాష్యం

  నా తనువు   ఎరుగని   గోప్యం.


• చెప్పవే    సింగారి

  నను   విడవని   శృంగారి.


• నీ  కనుల లో   చూశాను

  ఓ  బంగారు    కలువ ను.

• నీ  నవ్వు తో    పొందాను

  ఓ  పొన్నారి    లాలన ను.

• నీ కురుల   సుడులు

  వలపుల   వలలై

  తలపుల   అలలై

  నా మది ని   సుడిగుండం  చేసాయి.


• చెప్పవే   సింగారి

  నను  విడవని   శృంగారి.

  ఎన్నాళ్ల కి  వచ్ఛావో

  నాకేమి    ఇస్తావో.


• ఆ చూపుల  కేమిటి  అర్దం

  నా మనసు కి   తెలియని  భావం.

  ఆ నవ్వుల   కేమిటి   భాష్యం

  నా తనువు  ఎరుగని  గోప్యం.


• నీ    అందం లో

  వెలసింది   నా ఆనందం.

• ఆరాధన   తో

  అయింది  అది  ఎంతో కమనీయం.

• పొందలేని    శిల్పానివి

  నీవు

  పొందికగా   చూసుకుందామంటే.

• అందని    మేఘానివి

  నీవు

  చల్లనిసేద    తీరుదామంటే.


• అందుకే

• ఈ రేయి  నను  రమ్మంటుంది

  నిశి తో    జత   కమ్మంటుంది

  తోడై   నిలిచి    పొమ్మంటుంది.


• ఏమని   చెప్పను   సింగారి

  నను   విడవని   శృంగారి.

  ఎన్నాళ్ల కి    వచ్ఛావో

  నాకేమి   ఇస్తావో.


యడ్ల శ్రీనివాసరావు 20 సెప్టెంబర్ 2023 10:00 am.


Monday, September 11, 2023

398. ఎన్నాళ్లని చూడాలి శివా


ఎన్నాళ్లని చూడాలి  శివా 


• ఎన్నాళ్లని    చూడాలి.

  నీ సన్నిధి     

  చేరుటకు

  ఎన్నేళ్లని   ఎదురు చూడాలి.


• దేహమే   భారమని      తెలిసినా

  సందేహమే   ఇక లేదని  తెలిసినా


• ఎన్నాళ్లని    చూడాలి.

  నీ సన్నిధి    

  చేరుటకు

  ఎన్నేళ్లని   ఎదురు చూడాలి.


• ధ్యానం లో   నిను   చూడగలను

  కానీ   చేర లేను.

• జీవం తో    అనుభూతి   పొందగలను 

  కానీ   నిను   తాక లేను.


• ఆత్మ నని     తెలిసాక

  ఈ మాయ   నాటకం లో

  నటన   ఎవరి కోసం.

• అంతరాత్మ లో    ఒదిగాక

  విభిన్న   పాత్రల 

  పోషణ  ఎందు కోసం.


• ఎన్నాళ్లని    చూడాలి.

  నీ  సన్నిధి   

  చేరుటకు

  ఎన్నేళ్లని   ఎదురు   చూడాలి.


• కర్మ శేషం    కొరకు    కాలం తో

  పయనం    ఇంకెంత  కాలం.

• శూన్య స్థితం  కొరకు   జీవం తో

  భారం    ఇంకెంత   కాలం.


• హితవు   తెలియని   వానికి

  సంహితము    ఎందుకు.

• ఆశ లోదిలిన    వానికి

  ఆడంబరము  లెందుకు.


• ఎన్నాళ్లని    చూడాలి.

  నీ సన్నిధి    

  చేరుటకు

  ఎన్నేళ్లని   ఎదురు   చూడాలి.


• దేహమే    భారమని    తెలిసినా

  సందేహమే  ఇక లేదని  తెలిసినా.


• ఎన్నాళ్లని    చూడాలి.

  నీ  సన్నిధి    

  చేరుటకు

  ఎన్నేళ్లని   ఎదురు  చూడాలి.


యడ్ల శ్రీనివాసరావు 11 sep 2023, 10:00 pm


Sunday, September 10, 2023

397. శివుని యోగం భోగం

 

శివుని యోగం భోగం



• శివుని     ప్రార్థించుట   యే   యోగము

  హరుని    కీర్తించుట    యే    భోగము.


• ప్రార్థన   అంటే    పొందేటి   లాభం

  కీర్తన     అంటే     పలికేటి   శుభం.

• యోగము   అంటే      అదృష్ట  కవచం

  భోగము      అంటే      నిత్య  సంతోషం.


• శివుని   ప్రార్థించుట     యే   యోగము

  హరుని  కీర్తించుట       యే    భోగము.


• ప్రార్థించు   వానికి

  ఆశా  పాశముల  ఆరాటం   ఎందుకు.

• కీర్తించు   వానికి

  జన జంజాటాల   మోహం   ఎందుకు.


• యోగము    భోగమై తే

  రాజాధికారి  యే   కదా.

• భోగము      యోగమై తే

  రాజరికమే    కదా.


• శివుని   ప్రార్థించుట యే   యోగము

  హరుని   కీర్తించుట యే   భోగము.


• శివ నామ    స్మృతి తో

  సర్వ   దుఃఖ  హరణం.

• శివ ధ్యాన    శృతి తో

  విశ్వ  సుఖ   శాంతం.


• స్మృతి   చేయు వాడు

  ఫరిస్తా    స్వరూపుడు.

• శృతి     కలుపు వాడు

  తామరాకు పై    బిందువు.


• శివుని   ప్రార్థించుట  యే   యోగము

  హరుని   కీర్తించుట   యే   భోగము


• ప్రార్థన   అంటే    పొందేటి   లాభం

  కీర్తన     అంటే     పలికేటి   శుభం.

• యోగము  అంటే   అదృష్ట కవచం

  భోగము     అంటే   నిత్య సంతోషం.



• ఫరిస్తా = గాలిలొ తేలియాడే దేవదూత.


యడ్ల శ్రీనివాసరావు 10 Sep 2023 9:30 pm.


Wednesday, September 6, 2023

396. శివమే జీవము

 

శివమే జీవము


• శివుడే     నిజమని   తెలుసుకో రా

  శివమే     జీవమని    మసలుకో రా.


• ఎద్దునెక్కి     ఏలే  టోడు

  మన   మొద్దు బుద్ధి   మార్చుతాడు.

• శూలమునే   పట్టి  నోడు

  మన  వికారాలు   త్రుంచు తాడు.


• శివుడే    నిజమని    తెలుసుకో రా

  శివమే    జీవమని    మసలుకో రా.


• బూడిద   పూసుకున్నోడు 

  నిన్ను నన్ను 

  ఒంటికి రాసుకు   తిరుగు తాడు.

• నెత్తిన    గంగమ్మ   నెత్తినోడు

  దప్పిక నే    ఎరగనివ్వడు.


• అన్నమెట్టే      అన్నపూర్ణ

  ఇంటాయన   శివుడు రా …

• ఆకలితో   నిన్ను  నన్ను

  ఎన్నడూ   వదలడు  రా.


• శివుడే   నిజమని   తెలుసుకో రా

  శివమే   జీవమని   మసలుకో రా.


• కాలము నే    కదిలించే   టోడికి

  గొంతు లో     గరళం

  మనసేమో    అమృతం.

• మృత్యువు నే   శాసించే  టోడికి

  రూపం లో      రౌద్రం

  దేహమేమో    ధ్యానం.


• శివుడే    నిజమని    తెలుసుకో రా

  శివమే    జీవమని    మసలుకో రా.


• సందేలపు   సంబరాలు

  అర్ధరాత్రి    మెలకువలు.

• ఆదిశంకరుని     లీలలు

  జగతికి   దివ్య   ఆనవాళ్లు.


• మాయచేయని   వాడు

  మర్మమెరుగని    వాడు

• కర్మనే    కొలతగా  

  చేసేటి   వాడు   విభుడు.


• శివుడే    నిజమని   తెలుసుకో రా

  శివమే    జీవమని   మసలుకో రా.


  🙏ఓం నమః శివాయః 🙏


తులసి రామ కృష్ణ,  యడ్ల శ్రీనివాసరావు.

6 Sep 2023 , 7:00 pm.


Saturday, September 2, 2023

395. ప్రజా గాయకుడు గద్దర్

 

గద్దర్

ప్రజా గాయకుడు 

అమర వీరుడు గద్దర్ కు నివాళుల తో ....


• అమర వీరుడా    ఓ    అమర వీరుడా

  అశువులు బాసిన    సమర  యోధుడా.


• బడుగు   జీవుల    ఆరాటం

 నువు   మోసిన   "పల్లకి"    పోరాటం.

• ఆకలి   దప్పుల    ఆవేశం

  నువు  వేసిన    బాటకు    సోపానం.


• అమర వీరుడా   ఓ   అమర వీరుడా

  అశువులు  బాసిన   సమర   యోధుడా.


• నల్ల కంబళి  … ఆ …  నల్ల కంబళి

  నీ నిరసన కాదు

  పెత్తం దొరలకు      భేతాళ  స్వప్నం.

  భేతాళ స్వప్నం      భేతాళ నృత్యం

  భేతాళ స్వప్నం      భేతాళ నృత్యం.


• అమర వీరుడా     ఓ    అమర వీరుడా

  అశువులు   బాసిన    సమర యోధుడా.


• తూటాలు దిగినా  … ఆ.. తూటాలు దిగినా

  తెంచ లేదు లే     నీ  ప్రాణం.

  తుంచ  లేదు లే    నీ లక్ష్యం.


• రకతం కారినా … ఆ …  రకతం కారినా 

  రంగు  మారలేదు లే    నీ  రంగం

  సరికదా   వరదై   పొంగింది

  చైతన్యం  …  నీ  చైతన్యం.


• అమర వీరుడా    ఓ    అమర వీరుడా

  అశువులు  బాసిన   సమర  యోధుడా.


• గజ్జె కట్టిన    నీ పాదం …  ఆ …

  గజ్జె కట్టిన    నీ పాదం

  బడుగుల   మనసులో

  గంటై మోగింది

  గుడి గంటై మారు మోగింది.


• పదం  కట్టిన   నీ పద్యం

  అందరి   ఆశై  సాగింది

  శ్వాసై   పాడింది

  ఆశై సాగింది  …  శ్వాసై పాడింది.


• పేదల కోసం         ప్రమిధై   నిలిచావు

  నీ ఊపిరి నంతా   సమిధ   చేసావు.


• అమర వీరుడా     ఓ   అమర వీరుడా

  అశువులు   బాసిన   సమర  యోధుడా.


యడ్ల శ్రీనివాసరావు 2 sep 2023 , 10:00 pm.


Friday, September 1, 2023

394. కాలం కరగదు

 

కాలం కరగదు తరగదు



• కాలం కరగదు లే

  కాలం తరగదు లే

• కరగని    కాలం లో      

  కలిగేదే    

  నీ లోని   మార్పు .

  తరగని    కాలం లో     

  తెలిసేదే   

  నీ లోని   నేర్పు.


• కాలం కరగదు లే

  కాలం తరగదు లే

• కాలం   కరిగితే

  ప్రకృతి కి   గమనం   ఎలా.

• కాలం   తరిగితే

  జీవుని కి   జీవం    ఎలా.


• కాలం   ఒక   చక్రం

  అలుపెరుగని   యంత్రం.

• కాలం  ఒక   భైరవం 

  సృష్టి పాలన   సంభూతం.


• కాలం    కరగదు లే

  కాలం    తరగదు లే

• కరగని   కాలం లో     

  కలిగేదే   

  నీ లోని   మార్పు.

  తరగని కాలం లో    

  తెలిసేదే   

  నీ  లోని  నేర్పు.


• కాలం లో    పయనం

  నీ మూలాల    దర్శనం.

• కాలం తో     కయ్యం 

  నీ కనుమరుగు కి   ఆహ్వానం.


• కాలం   కాలం

  జననానికి     సుందరం

  కాలం     కాలం 

  మరణానికి   మనోహరం.


• కాలం   కరగదు లే

  కాలం   తరగదు లే.


యడ్ల శ్రీనివాసరావు 1 Sep 2023 , 7:00PM


490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...