శివుని యోగం భోగం
• శివుని ప్రార్థించుట యే యోగము
హరుని కీర్తించుట యే భోగము.
• ప్రార్థన అంటే పొందేటి లాభం
కీర్తన అంటే పలికేటి శుభం.
• యోగము అంటే అదృష్ట కవచం
భోగము అంటే నిత్య సంతోషం.
• శివుని ప్రార్థించుట యే యోగము
హరుని కీర్తించుట యే భోగము.
• ప్రార్థించు వానికి
ఆశా పాశముల ఆరాటం ఎందుకు.
• కీర్తించు వానికి
జన జంజాటాల మోహం ఎందుకు.
• యోగము భోగమై తే
రాజాధికారి యే కదా.
• భోగము యోగమై తే
రాజరికమే కదా.
• శివుని ప్రార్థించుట యే యోగము
హరుని కీర్తించుట యే భోగము.
• శివ నామ స్మృతి తో
సర్వ దుఃఖ హరణం.
• శివ ధ్యాన శృతి తో
విశ్వ సుఖ శాంతం.
• స్మృతి చేయు వాడు
ఫరిస్తా స్వరూపుడు.
• శృతి కలుపు వాడు
తామరాకు పై బిందువు.
• శివుని ప్రార్థించుట యే యోగము
హరుని కీర్తించుట యే భోగము
• ప్రార్థన అంటే పొందేటి లాభం
కీర్తన అంటే పలికేటి శుభం.
• యోగము అంటే అదృష్ట కవచం
భోగము అంటే నిత్య సంతోషం.
• ఫరిస్తా = గాలిలొ తేలియాడే దేవదూత.
యడ్ల శ్రీనివాసరావు 10 Sep 2023 9:30 pm.
No comments:
Post a Comment