Thursday, January 28, 2021

35. స్నేహం....ప్రేమ

      స్నేహం..‌. ప్రేమ


·        స్నేహం,  ప్రేమ రెండూ కవలల్ల చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవి మానవ సంబంధాల్లో అత్యంత ప్రాముఖ్యత గల అంశాలు . వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఎప్పుడూ సందేహంగాను, అగమ్యగోచరం గానే ఉంటుంది.

·        స్నేహం స్వజాతి జీవుల మధ్య చిగురించే అంశం.అది పూర్తిగా భౌతికమైనది. ఒక మనిషి , మనిషి తో తప్ప వేరే జీవితో స్నేహం చెయ్యలేడు. ఉదాహరణకు మనిషి పశుపక్ష్యాదులతో స్నేహం చేయలేడు. ఎందుకంటే  స్నేహం లో ఇవ్వడమే కాదు ఏదో ఒకటి తీసుకోవడం, అనేది కూడా ఒక అంశంగా ఉంటుంది.

·        ప్రేమ స్వజాతి తోపాటు, విభిన్న జాతుల మధ్య చిగురించే, అనిర్వచనీయమైన అంశం.  ఒక మనిషి  వృక్షాలను,  ప్రకృతిని, శిలలను , అర్థం కాని జీవులను, పశుపక్ష్యాదులను  ప్రేమించగలడు.  ప్రేమ అనేది విశ్వంలో విశ్వసనీయమైన అనుభూతి మరియు పూర్తిగా మానసికమైనది  . ప్రేమ మనసుకు సంబంధించినది.  ఒక మనిషి శునకానికి సపర్యలు చేసి  ప్రేమించగలడు. తిరిగి భౌతికంగా పొందేది ఏమీ ఉండదు ఒక అనుభూతి తప్ప.

·        ప్రేమ అంటే ఆశించకుండా  ఇవ్వగలిగేది మాత్రమే. అది ఒక మానసిక అంశమే గాని శారీరక , భౌతిక అంశం ఎన్నటికీ కాదు.

·        స్నేహం ఒకరికి సంతోషం ఇవ్వగలదు....కానీ ప్రేమ  చైతన్యవంతం చేయగలదు. చైతన్యం ఎన్నో సమస్యలను పరిష్కరించగలదు .

·        స్నేహానికి పరాకాష్ట (మితిమీరితే) స్వార్థం ....ప్రేమకు పరాకాష్ట త్యాగం . స్నేహాన్ని, ప్రేమని లింగభేదం తో ముడి పెట్టలేము.

·        స్నేహం రెండువైపులా చిగురిస్తేనే నిలబడుతుంది , ఎందుకంటే అది భౌతికం. కానీ ప్రేమ రెండు వైపులా అన్నివేళలా చిగురించదు‌. ఎందుకంటే అది అనుభూతి కాబట్టి . ఉదాహరణకు తల్లి బిడ్డ ని ప్రేమిస్తుంది, కానీ బిడ్డ అన్ని సందర్భాల్లో తిరిగి ప్రేమను తల్లికి పంచ లేదు, ఇలా చాలా అంశాల్లో ఉంటుంది .

·        మానవ బంధాలైనా, సంబంధాలైనా  పవిత్రమైనవి . వాటిని గుర్తించి ఉన్నతంగా కాపాడుకోవాలి గానీ , తుచ్ఛమైన అవసరాలకు వినియోగించుకో కూడదు.

·        సృష్టి ధర్మాన్ని బట్టి శరీరానికి భౌతిక అవసరాలు ఉంటాయి . కానీ మనసుకు అనుభూతులు మాత్రమే ఉంటాయి. మనసంటే ఆలోచన, ఆత్మ. ఆత్మ రూపం లేనిది.

·        నేటి సమాజంలో ప్రేమను వక్రీకరించి ఒక అవసరంగాను లేక కోరికగాను చిత్రీకరిస్తూ,  ప్రచార మాధ్యమాలు దౌర్భాగ్యం తో  దాని అర్థం మారిపోయే పరిస్థితి నెలకొంది.   ప్రేమ , స్నేహం అనేవి చాలా బలహీనమైన అంశాలుగా చూపబడుతున్నాయి.

·        చివరిగా....... భగవంతుడు  భక్తునితో ఎన్నడూ స్నేహం చేయడు.  ఒకవేళ  భక్తుడు  భగవంతుని తో స్నేహం చేసి నంత మాత్రాన కరుణించడు.  ఎప్పుడైతే భక్తుడు తన ప్రేమతో, మోహాలను వదులుకొని, త్యాగాలకు సిద్ధం అవుతాడో,  అప్పుడే భగవంతుని ప్రేమ, అనుగ్రహం దొరుకుతుంది . ఇది ప్రేమకు భగవంతుడు ఇచ్చిన శక్తి .

·        నిస్వార్థంగా ఆలోచన చేస్తే, భగవత్ సృష్టిలో ప్రతిదీ ఒక అద్భుతం.... మహా అద్భుతం .

·        ఓం శ్రీ గురుభ్యోనమః

·        యడ్ల శ్రీనివాసరావు

Tuesday, January 26, 2021

34. ఆహారం...జీవితం…మనిషి...మనసు…సారుప్యత.

 

·        ఆహారం...జీవితంమనిషి...మనసుసారుప్యత.





·        మనిషి బ్రతకడానికి శక్తి అవసరం.

·        శక్తి కావాలంటే ఆహారం అవసరం.

·        ఆహారం అంటే పాలు,  కాయగూరలు , ఆకుకూరలు,  దుంపకూరలు , మాంసం ఇలా ఎన్నో.  ప్రతి దానిలో  ఎన్నో రకాల, రంగులు, రుచులు, ఆకారాలు, పరిమాణాలు, దేని విశిష్టత, ప్రాముఖ్యం దానిదే.

·        ఏ రకమైన ఆహారం తిన్నా, చివరికి ఉత్పన్నమైన శక్తి ఒకటే అది కిలోక్యాలరీస్.

·        ఇన్ని రకాల ఆహార పదార్ధాలు ఈ సృష్టిలో  ఉన్నా అందరికీ అన్నీ నచ్చవు . కొందరికి మాంసాహారం , మరికొందరికి శాఖాహారం ఇష్టం. మాంసాహారంలో అందరికీ అన్నీ నచ్చవు , అదేవిధంగా శాకాహారంలో కూడా అన్నీ అందరికీ నచ్చవు . కొంతమంది శరీరతత్వానికి , మనస్తత్వానికి కొన్ని రకాలైన ఆహారాలు జీర్ణం కావు. అలాగే కొంతమందికి కొన్ని రకాల దుంప కూరలు  వాత గుణం చేసి కీళ్ల నొప్పులు వంటి అనారోగ్యాలు వస్తాయి.

·        అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనుషులు ఎవరి ఆరోగ్యం కాపాడుకోవడం కోసం  వారు,  వారికి ఇష్టమైన ,  సరిపడిన ఆహారం మాత్రమే తీసుకుంటారు. ...అంతమాత్రాన మిగిలిన ఆహారాలు అన్ని పనికిరానివి అని అర్థం కాదు. ప్రతి ఆహారం ఎవరో ఒకరికి ఏదో ఒక రూపంలో అవసరం అవుతూనే ఉంటుంది,  అది మనిషి యొక్క శారీరక మానసిక అవయవ నిర్మాణాన్ని బట్టి ఉంటుంది.

·        అలాగే ఏ ఆహారమైన తాజాగా ఉంటేనే  ఎవరైనా స్వీకరించగలరు.

·        ఇక అసలు విషయానికొస్తే ....సమాజంలో మన చుట్టూ ఉన్న మానవులందరు ఉత్తములే (అన్నిరకాల ఆహారాల వలే) , ఎందుకంటే అది భగవంతుడు సృష్టి . మనకి ఈ సమాజంలో అనేక మందితో అనేక రూపాల్లో సంబంధ బాంధవ్యాలు ముడిపడివుంటాయి . కొందరు దేశం వరకు , కొందరు రాష్ట్రం వరకు , కొందరు జిల్లా వరకు , కొందరు ఊరి వరకు , కొందరు వీధి వరకు , కొందరు ఇంటి వరకు , కొందరు మనసు వరకు మితం (ఇష్టం) అవుతూ ఉంటారు (ఇష్టమైన లేదా ఆరోగ్యానికి అవసరమైన  ఆహారం తీసుకుంటున్నట్లే). అది వ్యక్తుల ఆలోచన స్థాయి సరళిని బట్టి ఉంటుంది .  ఇది జగమెరిగిన సత్యం, సృష్టిలో పరంపర కూడా.  అంతమాత్రాన ఒకరు గొప్ప మరోకరు అల్పం అనుకోవడం అవివేకం . మన వ్యక్తిత్వాన్ని మనమే అభివర్ణించు కుంటున్నంత కాలం,  మన ఉనికి మనం ఈ సమాజంలో కోల్పోతున్నట్లే.

·        ఏ వ్యక్తికి సాటి వ్యక్తిని దూషించే హక్కు లేదు . కాలచక్రం లో ఏది చేస్తే అదే తిరిగి పొందవలసి వస్తుంది,  సిద్ధం గా ఉండాలి.  మన మానసిక స్థాయిని బట్టే ఒకరు మనకు అర్థం అవుతున్నారా , లేదా,  అలాగే  ఒకరికి మనం అర్థం అవుతున్నామా లేదా, అనేది ముడిపడి ఉంటుంది . “ ఉన్నతమైన ఆలోచనలే మనలను  ఉత్తముల దగ్గరకు చేర్చగలవు”.   “మన ఆలోచనలే మన జీవిత విధానం” , ఈ ఒక్క నినాదాన్ని కూలంకషంగా  అర్థం  చేసుకోగలిగితే ఈరోజు మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నామో, మనకే  అర్థమవుతుంది.

·        ఆత్మ విమర్శ అనేది ఆత్మ స్థాయిని పెంచాలి గాని ఆత్మ నాశనాన్ని కాదు .

·        అర్థమైన ధన్యం...వ్యర్థమైన శూన్యం.

·        ఆత్మ విమర్శ తో కూడిన మన వ్యక్తిత్వం మనకి అర్థం కానంతవరకు మన చుట్టూ ఉన్నది అంతా రాజకీయ చదరంగం వలె అనిపిస్తుంది,  కనిపిస్తుంది .

·        మన మనసే మనకు రక్షశిక్ష.

·        మనిషి మనుగడకు మనుషులు అవసరం,…మనుషులకు స్థిరమైన, ఉన్నత తత్వం చాలా అవసరం.

·         If you are REACTIVE PERSON always you will be on the ROAD. From Road you can able to visualise only few things.

·        If you are PROACTIVE PERSON always you will be on the SKY. From Sky you can able to visualise vast things.

·        ఓం శ్రీ గురుభ్యోనమః

 

యడ్ల శ్రీనివాసరావు

Friday, January 22, 2021

33. అగమ్యం

అగమ్యం


·        నేను నువ్వు కాదని తెలిసి

·        నువ్వు నేను కాదని తెలిసి


·        నీ లో లేని నేను  తలంచి

·        నా లో ని  నిన్ను తపించి


·        నీవు నేను అనే భేధమెరుగక

·        ఒకటి కాని రెండు ను ... ఒకటి గా

         భ్రమించి … పరిభ్రమించి


·        ఈ గమ్యం లో అగమ్యగోచరమై

·        వాస్తవమునే స్తంభనం చేసి


·        ఎదురు చూపులెవరి కోసమేమనసా..

·        ఓ మతి లేని మనసా….

         నీ లో లేని నా కోసమా.. 

         నాలో ఉన్న నీ కోసమా.

 

యడ్ల శ్రీనివాసరావు


 




Thursday, January 21, 2021

32. అంతర్మధనం

అంతర్మథనం

·         బాధ భారమవుతుంది.

·        మాట మౌనమవుతుంది.

·        నీడ నిరీక్షణవుతుంది.

·        ఆలోచన ఆవిరవుతుంది.

·        ఊహ ఊపిరి కానంటుంది.

·        నిజం లోని నేను స్పష్టం.

·        నా లోని నేను అస్పష్టం.

·        చుక్కాని లేని నావ ఏ దరి చేరునో..

·        నేనెవరినో….అవగతము చేయు ఈశ్వరా!

---యడ్ల శ్రీనివాసరావు.

31. నైరాశ్యం

నైరాశ్యం


·  మౌనమే మకరందమైనపుడు

·  కను బాసలే కలవరింతలైనపుడు

·   పలుకు లేమి పెదవులు పలకనపుడు

·   మనసులోని మాట మధురమైనా,   భారమే. 

·   సున్నితమైన మనసుకు 

    సుందరమైన తలంపులు.... కలలే!

·   "ప్రే"రణ  "మ"రపించుటయే   సంతోషమా?

·    ఎదురుచూపుల సమయం ఆసన్నమైంది

     రెప్పపాటు క్షణం లో ఆవిరైంది,

·    విశ్వమంత మౌనాన్ని  

     అలలు లేని కడలిని 

     పరిమళం లేని పుష్పాలను 

     బహుకరించింది.

·   చాలు,  ఇంతకు మించిన ఆశ.... దురాశే




. ---యడ్ల శ్రీనివాసరావు.

 

Monday, January 11, 2021

30. కవిత

కవిత

·        చిన్నగా ఉంటావు... చింతలెందుకంటావు

·        జ్ఞప్తి కి మూలమై…. జ్ఞప్తే లేదనే జ్ఞాన జాజివి

·        బాధ్యత నెరిగిన బంధాలకు భ్రమరాతిదివి

·        నిరీక్షణ తో నిశీధి నేలే నీలాంబరివి

·        హసమునే పాశముగా హవనించే హంసవి

·        క్షణికమైన క్రోధానికి కాళాక్షివి

·        శాంతమైన స్వరూపానికి సరజాక్షివి

·        సత్యమునే సంధించే సూదంటివి

·        ప్రతినకు పట్టమహిషివి

·        కరుణకు కాంత మూర్తివి

·        చేతలకు చేయూతనిస్తావు

·        ఊహకు ఊపిరివుతావు

·        కలలకు  కలమువై కవితవవుతావు

·        సరిగమల వీణమనసున వాన.

 

యడ్ల శ్రీనివాసరావు

481. పరిమళ భాష

  పరిమళ భాష • ఏమిటో     ఈ  భాష   ఎద కే    తెలియని   ఆశ.   అనుభవం  లేని   యాస   సృష్టి   మూలానికి    శ్వాస. • అక్షరాలు   ఉండవు  కానీ   భావం ...