Thursday, August 31, 2023

393. శృంగార సఖుడా

 

శృంగార సఖుడా


• రా రా  …  సరసకు రా రా 

  సరాగాల     ప్రియుడా 

  నా శృంగార  సఖుడా.


• ఊసుల లో   ఊరేగించ రా

  బాహువు లో   బంధించ రా.

• అరవిరిసిన    అందాలన్నీ 

  కలబోతతో      ఆరగించ రా.

• వడపోసిన    శృంగారం తో

  తనువును    తీగ నే  చేయరా.


• రా రా …  సరసకు  రా రా

  సరాగాల   ప్రియుడా 

  నా  శృంగార  సఖుడా.


• చెక్కిళ్ళ    సోయగాలు

  వెక్కిళ్లు    కావాలంటూ

• ఎద పొంగులు    ఆహ్వానం తో

  ఆచ్ఛాదన ను    వీడాయి  రా.


• నాభి లోని    నవనీతం

  ఉవ్వెత్తున    పొర్లుతూ ఉంటే

• మదన    యజ్ఞానికి

  ముహూర్తం   ఎందుకు రా.


• రా రా …  సరసకు  రా రా

  సరాగాల    ప్రియుడా

  నా శృంగార  సఖుడా.


• నర్తించే   నా   నడుము

  రణరంగానికి   సిద్ధమయితే 

• నీ   మునిపంటి   పెదవులకు

  మొహమాటం    ఏల  రా.


• కటిద్వయము   కవ్విస్తూ

  స్వేదానికి    పరితపిస్తూ  ఉంటే

• గారం   చేయకు  రా

  శృంగారం  ఆరంభించ  రా.



• రా రా  …  సరసకు రా రా 

  సరాగాల ప్రియుడా 

  నా శృంగార  సఖుడా.


• అరవిరిసిన    అందాలన్నీ 

  కలబోతతో     ఆరగించ రా.

• వడపోసిన    శృంగారం తో

  తనువును   తీగ నే  చేయరా.



ఆచ్ఛాదన = కప్పిన వస్త్రం.

నవనీతం = చిలికిన తాజా వెన్న

మదన = మన్మధ,  రతి కామ.

కటిద్వయము = పిరుదులు


( ప్రతీ కళ పై, ప్రతీ అంశం పై  రాయవలసిన  నైపుణ్య పరీక్ష భాగంగా  శృంగారం పై తొలిసారి ఈ పద ప్రయోగం.)


యడ్ల శ్రీనివాసరావు 27 August 2023 6:00 pm.


Tuesday, August 29, 2023

392. రక్షా బంధన్ విశిష్టత

 

రక్షా బంధన్ విశిష్టత 

రాఖీ పౌర్ణమి 




రక్షా బంధనం రాఖీ పౌర్ణమి.   రక్షా అంటే రక్షణ, protection.   ప్రతీ బంధం లో రక్షణ కలిగి ఉండాలి అనే శుభ సంకల్పం ఈ పండుగ రహస్యం.

ఈ పండుగ యొక్క సూక్ష్మ అర్దం చాలా మంది కి తెలియక ఇది పూర్తిగా  బాహ్య ప్రపంచ దృష్ట్యా కేవలం సోదర సోదరీమణుల కు సంబంధించిన పండుగ అని అనుకుంటారు.


అసలు సోదర సోదరీమణులు అంటే ఎవరు ?... ఏనాడైనా దీని అంతరార్థం తెలుసుకున్నామా ?


 బాల్యం లో పాఠశాల లో ప్రతి రోజూ ఉదయం ప్రతిజ్ఞ (pledge) చేసే సమయంలో   “ భారతీయులు అందరూ నా సోదర సోదరీమణులు”  అని అంటారు.  అదే విధంగా ప్రతీ పాఠ్య పుస్తకం లో ఈ ప్రతిజ్ఞ (pledge) ముద్రించి ఉంటుంది. దీని  అంతరార్థం ఎవరికీ అర్థం కాక, నవ్వుకుంటారు. ఎందుకంటే  అందరూ సోదర సోదరీమణులు అయితే అసలు వివాహం ఎలా చేసుకో గలుగుతారు , అనే ఆలోచన తలెత్తుతుంది. దీనికి సమాధానం కూడా ఎక్కడా దొరకదు. బహుశా ఎవరో కాని వివరించి చెప్పలేరు కూడా.


ఈ సృష్టికి  భగవంతుడైన  పరమాత్ముడు  తండ్రి. ఆత్మలైన  మానవులు అందరూ  ఆయన పిల్లలు అనేది   సృష్టి  సత్యం.   ఆత్మ పరమాత్మ అనే వాస్తవ దృష్టి నుంచి చూస్తే ,  భగవంతునికి   మానవులకు మధ్య ఉన్న సంబంధం  తండ్రి పిల్లల బంధం.  

తండ్రి ఒక్కడే ,  ఆయన సంతానం అయిన పిల్లలు మాత్రం అనేకం.  ఈ విధంగా  పిల్లలైన  ఆత్మలు అందరూ  సోదర సోదరీమణులు.  ఇది  ఆత్మ దృష్టి కి చెందిన పరమ సత్యం. ఇదే విషయాన్ని ఆధ్యాత్మిక కోణంలో,   విశ్వ శాంతి కోసం  పాఠ్య పుస్తకాల  ప్రతిజ్ఞ లో  పొందు పరిచారు.


సాధారణంగా మనిషి  ఈ  లోకంలో,   తాను ఒక శరీరం అని అనుకుంటాడే,  కాని అంతకు మించి తనను తాను  ఆత్మ  అనే  నిజం,  మాయ ప్రభావం వలన తెలుసుకో లేడు.

మనిషి ఈ  బాహ్య ప్రపంచంలో జీవించడం కోసం,  తన శరీర ధర్మం మరియు  అవసరాల  కోసం,  కొన్ని బంధాలు, అలవాట్లు, కట్టుబాట్లు ఏర్పరచుకున్నాడు.  ఇందులో భాగంగా  రక్త సంబంధం ఉన్న వారు మాత్రమే  సోదర సోదరీమణులు  అని  నిశ్చయం చేయబడింది  .


మనిషి శరీరంలో  ఉన్న  అనంతమైన  చైతన్య  శక్తి  ఆత్మ.  ఇది అతి  సూక్ష్మాతి సూక్ష్మమైన   బిందు రూపం లో ఉంటుంది.  ఆత్మ  అవినాశి .  అంటే  నాశనం లేనిది,  కానిది. 

This is nothing but Every human being is an amount of  ENERGY.   

ఈ శక్తి అందరిలో ఒకేలా ఉండదు. ఒకరిలో ఎక్కువ, మరొకరి లో తక్కువ గా  ఉంటుంది.  దీనిని బట్టే కొందరు ధైర్యంగా, సంతోషంగా, చిరునవ్వు తో,  పాజిటివ్ గా ఉంటారు. మరికొందరు అధైర్యం గా, దుఃఖం తో,  ఆత్మ విశ్వాసం కోల్పోయి నెగెటివ్ గా ఉంటారు. ప్రతి ఒక్కరిలో  ఈ శక్తి  సమతూకం గా  ఉండదు.


అసలు రక్షాబంధనం పండుగ మూల అర్దం ఏమంటే …. మానవ శరీరం తో ఉన్న   ప్రతీ ఆత్మ  తన తోటి ఆత్మ కు రక్షణ ఇవ్వాలి.  అవసరమైనపుడు సహాయం చేయాలి.  నీకు నేను తోడు ఉన్నాను అనే ధైర్యం కలిగించాలి.  ఒక శక్తివంతమైన ఆత్మ  మరో బలహీనమైన ఆత్మ కు శక్తిని  ధారణ చేయాలి.

ఇక్కడ శరీరం అనే  మాట,  ఆలోచన కి  తావు లేదు.  బంధాలకు  తావులేదు.   ఇదే రక్షా బంధనం లో ఉన్న సూక్ష్మ అర్దం.


ఒకసారి ఇది ఆలోచించి చూడండి. కేవలం అన్నా చెల్లెళ్ళ కేనా రక్షణ… తల్లి తండ్రులు కి, బంధువులకు, స్నేహితులకు, భార్యకు, భర్తకు , పిల్లలకు , సమస్త మానవాళికి, ప్రకృతి కి   రక్షణ కల్పించుకోవలసిన అవసరం లేదా ….  కేవలం రక్త సంబంధానికి మాత్రమే రక్షణ పరిమితమై ఉంటుందా, ఆలోచించండి. 

ఈ రక్షణ అనేది ఒకరికి మరొకరు ఇచ్చుకోవాలి, అనే అద్భుతమైన  సదుద్దేశం ఈ రాఖీ పండుగ లో దాగి ఉంది.


శ్రావణ అంటే   “ ప్రత్యక్షముగా “ అని అర్దం 

శ్రవణం అంటే   “ వినిపించుట “  అని అర్దం.


శ్రావణ మాసం లో వచ్చే  స్నేహితుల దినోత్సవం రోజున కట్టే   friendship band  అయినా ... రాఖీ పండుగ  రోజున  కట్టే రాఖీ అయినా ... వరలక్ష్మి వ్రతం  రోజున  భార్య చేతికిి   భర్త కట్టే తోరం అయినా …  “ ఒకరికి ఒకరు రక్షణ గా ఉన్నాము “  అని ప్రత్యక్షంగా వినిపించడానికి  శుభకరమైన  గుర్తు .  

ఇవి అన్ని  మానవ కళ్యాణం కోసం జ్ఞానులు ఏర్పాటు చేసిన విశిష్టమైన పండుగలు. అంతేకాని ఆడంబరాలు, వృధా ఖర్చుల కోసం కాదు.

రాఖీ కట్టడం అంటే అర్దం ఒకరు మరొకరు  రక్షణ గా జీవితంలో అవసరమైనపుడు అండగా ఉండాలి అని అర్దం. …. ఇది ఒక మానసిక ఆత్మ బంధం… స్త్రీ, పురుష లింగ భేదాలకు,   రక్త సంబంధానికి,  దేహ సంబంధానికి ఇది అతీతం.

కాకపోతే అనాది గా ఒక ఒరవడి కి అలవాటు పడి పోయిన మానవ సమాజం కేవలం  దేహ దృష్టి తో ఈ పండుగ జరుపుకుంటారు.

ఇక్కడ ప్రస్తావించిన ఈ విషయం అంతా నిజమే ,    అని  మనసు కి  అనిపించినా , ఎవరూ ఆచరించ లేక పోవచ్చు.    ఎందుకంటే భయం,  ఎవరు ఏం అనుకుంటారో అని. ఈ భయమే అజ్ఞానానికి పునాది.

భార్య భర్తలకు వివాహ సమయంలో అగ్ని సాక్షిగా ఒకరికొకరు రక్షణగా ఉండాలని ప్రమాణం చేయిస్తారు. కాని నేడు సమాజం లో   చాలా  మందికి  ఈ రక్షణ కొరవడుతోంది అనేది వాస్తవం …. అదే విధంగా రక్త సంబంధం లో ఉన్న అన్నా చెల్లెళ్ళ లో, తమ వివాహాలు అయిన తరువాత, ఈ రక్షణ కేవలం రాఖీ పండుగ కే పరిమితం అవుతుందా లేక  వారి జీవితం చివరి వరకు ఉంటుందా, ఆలోచించండి … అదే విధంగా స్నేహితుల మధ్య రక్షణ ఉంటుందా లేక భక్షణ ఉంటుందా.

మనిషి స్వభావం లో  నిజాయితీ  నిండిన   ప్రేమ  ఉంటేనే రాఖీ పండుగ తో పాటు, ఏ పండుగ కైనా ఒక పరమార్థం ఉంటుంది. లేకపోతే ఈ పండుగలు వృధా ఖర్చులతో చేసుకునే అలంకారాలు గా మిగులుతాయి. తిరిగి నిరంతరం మనల్ని వెక్కిరిస్తూ నే ఉంటాయి. 


నేటి కాలం బంధాలలో మనుషులందరూ ఎంతో దగ్గరగా, భౌతికంగా (Physical), నిత్యం చూస్తూ (Visual) కలిసి ఉంటున్నారు , ఇది సంతోషమే  ….. కానీ మనసు తో, మానసిక అనుభూతి తో ఎందరు కలిసి ఉంటున్నారు ?  

ఈ మానసిక అనుభూతి ఉంటేనే కదా మరొకరి మనసుకు, శరీరానికి, ఆత్మ కు రక్షణ కలిపించ గలరు…. ఎవరు ఎవరికైనా.

పండుగలు మనుషులను, బంధాలను  మానసికంగా  దగ్గర చేస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది.

ఈ రచన కేవలం , ఒక మంచి ఆలోచన ఉద్భవించాలనే సంకల్పం కోసం. అంతేకాని ఏదీ వ్యతిరేకించాలని కాదు.

రక్షా బంధనం , రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 💐.


ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 29 August 2023, 6:00 PM .


Saturday, August 26, 2023

391. సుప్రభాతం

 

సుప్రభాతం


• సుప్రభాతం      సుప్రభాతం.

• ఆశలు    నిండిన  మనసు కి

  ఇది   మధుర  భాతం.

  ఎదలో   నిలిచిన    ప్రియునికి

  ఇది    దివ్య    భాతం.


• సుప్రభాతం      సుప్రభాతం.

  సుప్రభాతం      సుప్రభాతం.


• ఉదయించని    సూర్యుడి లా

  తాకింది    ఓ   ప్రేమ.

  జనియించని     జాబిలి లా

  నిండింది   నా  లోన.


• ఆ   మరువని    ఆలోచనలు

  నా   ప్రేమకు     ప్రతిరూపాలు.

• ఈ   వదలని   మధుర క్షణాలు 

  నా     ప్రేమకు     ప్రతిబింబాలు.


• సుప్రభాతం      సుప్రభాతం

• వేకువ   చూడని    ప్రేమకు    విఘాతం.

  కాలం    కలపని     చెలిమి కి   అగాధం.


• సుప్రభాతం     సుప్రభాతం.

  సుప్రభాతం      సుప్రభాతం.

 

• కలవని     నీ పాదం తో

  కొలువై      నడవ లేనని

  వెళ్లి    పోమాకు

  విడిచి   పోమాకు.


• కలవని    నీ పాణి తో

  జత     సరి  లేనని

  వీడి      పోమాకు

  వదలి   పోమాకు.


• సుప్రభాతం      సుప్రభాతం.

• ఆశలు    నిండిన   మనసు కి

  ఇది    మధుర    భాతం.

  ఎదలో   నిలిచిన    ప్రియునికి

  ఇది     దివ్య   భాతం.



సుప్రభాతం = శుభమును సూచించు దిన ఆరంభం.

వేకువ =  వెలుగు 

విఘాతం = అవరోధం 

పాణి = మణికట్టు నుంచి చాచిన వ్రేళ్ళ హస్తం.

భాతం =  ప్రకాశించు 


యడ్ల శ్రీనివాసరావు 26 August 2023 9:00 pm


Tuesday, August 15, 2023

390. నందీశ్వర



నందీశ్వర




• కరగ డా     నా తండ్రి    కదల డా

  కని విని  ఎరుగని

  ఈ హంస   గానానికి.

• మెదల డా    నా తండ్రి   వదల డా

  కైలాస నఖ శిఖ ను

  ఈ  ఆమని  రాగానికి.


• ప్రేమ తో     పిలిచినా

  ఆర్తి తో    పాడినా

  నా ఎదలో ని శబ్దం

  నీ  మదికి   చేరలేదా 

  ఈశ్వర … పరమేశ్వరా


• ఏమి భాగ్యమో …. ఎంత భోగమో

  నీ   కీర్త నే   నా సౌభాగ్యము.


• కరగ డా   నా తండ్రి    కదల డా

  కని విని  ఎరుగని

  ఈ హంస   గానానికి.

• మెదల డా   నా తండ్రి   వదల డా

  కైలాస  నఖ శిఖ ను

  ఈ ఆమని  రాగానికి.


• నా స్వరము లో   కొలువైన   ఈశ్వర

  ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాస   లయము లే

  నీకు   ఉయ్యాల జంపాల ఆటలు.


• నా ప్రేమ లో   నెలవైన    రుద్రుడా 

  రేయి పగలెరుగక   పట్టే

  నీకు  కళ్యాణ  మంగళ  హారతులు .


• కరగ డా    నా తండ్రి    కదల డా

  కని విని   ఎరుగని

  ఈ హంస   గానానికి.

• మెదల డా   నా తండ్రి    వదల డా

  కైలాస నఖ శిఖ ను

  ఈ ఆమని రాగానికి.


యడ్ల శ్రీనివాసరావు 14 August 2023, 9:50 to 10:18 pm .


Monday, August 14, 2023

389. బ్రో ఆధ్యాత్మిక శ్లోకాలు

 


బ్రో ఆధ్యాత్మిక  శ్లోకాలు



• ఇటీవల , బ్రో అనే సినిమాలో రెండు ఆధ్యాత్మిక శ్లోకాలు, background music లో play అవుతూ ఉంటాయి. చాల బాగుంటాయి.  అవి సినిమాలో అంత స్పష్టంగా వినపడవు.

• ఒక  మిత్రుడు  , ఈ పాటలలో ఉన్న మూలార్దం  ఏమిటి అని అడిగితే,  ఆ శ్లోకాల లోని అర్థం తెలుగులో అనువాదం చేయడం జరిగింది.

 శ్లోకం : 1

🍀🍀🍀🍀🍀🍀🍀

బ్రహ్మ  పూర్ణ  బృహస్పతిః

స బ్రహ్మి  పూర్వ  సమాకృతిః

ప్రపర్వ గర్వ  నిర్వాణావృతి

విశ్వ శ్రేయ సమర్వతిః

సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిః

విదేహ గేహ వాహ జాగృతి

🍀🍀🍀🍀🍀🍀🍀


ఆది గురువు శివ పరమాత్ముడు. పరమాత్మ తన జ్ఞానాన్ని బ్రహ్మ ద్వారా వినిపిస్తాడు. బ్రహ్మ జ్ఞానం బృహస్పతి  (గురు) గ్రహం అనుకూలత వలన మానవుని కి తెలుస్తుంది.  గ్రహాలలో బృహస్పతి గ్రహానికి గురు తత్వం కలదు.  దేవతలందరికీ గురువు బృహస్పతి.

ఈ మొత్తం శ్లోకం పూర్తిగా బృహస్పతి (Jupiter) అంటే ఒక గురువు యొక్క విశిష్టత గురించి సంస్కృతంలో వర్ణిస్తూ రాయబడింది…..


వివరణ : 

బ్రహ్మ పూర్ణ బృహస్పతి :

  బ్రహ్మ యొక్క పూర్ణమైన జ్ఞానం  కలిగిన వాడు బృహస్పతి  దేవతల గురువు.

స బ్రహ్మి పూర్వ సమాకృతి :

  సరస్వతి దేవి కి  తొలి సమానమైన కృతార్దుడు గురువు.

ప్రపర్వ  గర్వ  నిర్వాణావృతి :

  ఆది  దేవతలను ప్రసన్నం చేసుకొని , అభిమానం తో కోరికలు లేని శూన్య మోక్ష స్థితి ని వరింప చేయువాడు గురువు .

విశ్వ శ్రేయ సమర్వతిః :

  సమస్త సృష్టి కి ధర్మ పుణ్య శుభ ఫలాలు ఇచ్చు దీపపు వత్తి గురువు.

సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుని :

  మంచి విద్వాంసుడు, సంపన్నమైన జ్ఞాన శిఖరం గురువు.

విదేహ దేహహా వ జాగృతి :

  దేహం లేని వాడు కానీ,  దేహమును మేలు కొలుపు వాడు. దేహం లో కుండలినీ శక్తి జాగృతం చేయు వాడు గురువు (బృహస్పతి).


🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


శ్లోకం: 2


 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

  సప్తకాల లిప్తలీల యుక్తయోగ ఆగమం

  వాయులీనమో వరాళీరాగ రంజనం.


  సుప్తకీల తప్తడోల లుప్తపాశ బంధురం

  తోషణార్దమౌ విశేషకర్మ గర్జనం


  జీర్ణ కా లా నాం

  మృగ్య మా వా హం పురోగమార్గ నిర్గమం


  పూర్ణ వా హ నాం

  నిర్ణయా రూపం ప్రపూజ్య సాద్య సద్గమం


  ప్రణవ ఓం ఓం ఓం కారం

  ప్రమద ధీమ్ ధీమ్ ధీమ్ నాదం


  ప్రణవ ఓం ఓం ఓం కారం

  ప్రకర నిర్మొహ నిర్మాణ నిర్వహణం

  అద్వైతం   అక్షలక్షణం 

  ఆశ్వాసం   బుద్బుదస్సమం

  అపర వాజీనం నిత్య నిశ్చలం

  అఖిల రాజీవం జీవ సంచితం

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

 

ఈ శ్లోకం ఆత్మ, పరమాత్మ ల అనుసంధాన మార్గం గురించి చెప్పబడింది. మానవుని దేహం లో ఉన్న ఆత్మ మూలాధారం చక్రం నుంచి సహస్రారం వరకు చేసే ప్రయాణమే ధ్యాన యోగ సాధన. ఇందులో సమస్త సృష్టి దాగి ఉంటుంది మరియు పరమాత్మ తో అనుసంధానం ఎలా జరుగుతుందో చెప్పబడింది.


వివరణ :

  సప్తకాల లిప్తలీల యుక్తయోగ ఆగమం

  వాయులీనమో వరాళీరాగ రంజనం.

• రెప్ప పాటు క్షణం లో జరిగే సప్తకాల ఆట యే ధ్యాన యోగం. అదే ఆగమ వేద శాస్త్ర జ్ఞానం.

• ఇది వయోలిన్ పలికే వరాలీ  కర్ణాటక  సంగీత రాగమంత ఆహ్లాదం గా ఉంటుంది .

సప్తకాలు : మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, ఆనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రార కుండలీ చక్రాలను సప్తకాలు అంటారు.


  సుప్తకీల  తప్తడోల  లుప్తపాశ  బంధురం

  తోషణార్దమౌ  విశేషకర్మ  గర్జనం

• నిద్రకు బంధీ అయి ,  ఆకలితో తపిస్తూ,   ధనం కోల్పోయిన  వాడు  త్రాడు వలే  వంగి ఉంటాడు.

• పరిపూర్ణత సాధించుట కొరకు ఉత్తమ కర్మలు ఘోషిస్తుంటాయి.

  

   జీర్ణ   కా లా నాం

  మృగ్య  మా వా హం  పురోగమార్గ  నిర్గమం

• వృద్ధాప్య కాలంలో

• వెతకదగినది పరబ్రహ్మ స్వస్థానానికి బయలుదేరే ప్రధాన మార్గం.


   పూర్ణ వా హ నాం

   నిర్ణయా రూపం ప్రపూజ్య సాద్య సద్గమం

• పరి పూర్ణత సాధించిన వాడు ...

• నిశ్చయ రూప జీవుడు . అది యే దేవత లా పూజింపబడేందుకు సుగమనమైన మార్గం.


  ప్రణవ   ఓం ఓం  ఓం కారం

  ప్రమద  ధీమ్ ధీమ్ ధీమ్  నాదం

• ఆత్మ పరమాత్మను కలిపేది ఓంకార ధ్వని

• మూలాధారం నుంచి సహస్రారం చేరే అమితానంద ధ్వని.


  ప్రణవ ఓం ఓం ఓం కారం

  ప్రకర నిర్మొహ నిర్మాణ నిర్వహణం

• ఆత్మ పరమాత్మను కలిపేది ఓంకార ధ్వని

• పోగు చేసిన కచ్చితమైన యోగ్యత యే నిష్ట.


  అద్వైతం అక్షలక్షణం

  ఆశ్వాసం బుద్బుదస్సమం

• పరబ్రహ్మము వ్యాపించినది అనడానికి గుర్తు ...

• ఊపిరి విడవడం.  అనగా గర్భం లో ఉద్భవించిన బుడగను సమాప్తి చేయడం

 

  అపర వాజీనం నిత్య నిశ్చలం

  అఖిల రాజీవం జీవ సంచితం

• మనుష్యాది గర్భస్థపిండమునకు రక్షకముగా మీఁద క్రమ్ముకొనియుండు తోలుసంచి ప్రాణరంధ్రం శాశ్వతంగా స్థితమైనది

• సమస్తం నారాయణ మంత్రం. అదియే జీవునికి ఆర్జించి   పెట్టేది.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀


ఓం నమఃశివాయ 🙏

అనువాదం : 

యడ్ల శ్రీనివాసరావు 13 August 2023, 11:00 pm.


Wednesday, August 2, 2023

388. ఏనాటిదో ఈ సమయం

 

ఏనాటిదో ఈ సమయం



• ఏనాటిదో     ఈ స‌మయం 

  ఈ నాటికి     వచ్చింది.

• ఏనాటిదో     ఈ అనుభవం 

  సరికొత్తగా     తాకింది.


• నింగి    హంగు తో    విరిసింది.

  నిశి    తొంగి     చూస్తుంది.

• మేఘం     ముత్యమై     మెరిసింది

  మధురం   మనసు లో     నిండింది.


• ఏనాటిదో     ఈ స‌మయం 

  ఈ నాటికి     వచ్చింది.

• ఏనాటిదో      ఈ అనుభవం 

   సరికొత్తగా       తాకింది.


• కలిసే    ఓ  కనకాంబరం

  మెరిసే     పీతాంబరం.

• సాగే       ఈ  సంబరం

  తాకే       ఆ   అంబరం.


• ఏమనగలను      నేనేమనగలను

  కాలం    తిరిగి     వచ్చింద నా…

  ఏదో       చెప్పి     వెళుతుంద నా.


• ఏమనగలను     నేనేమనగలను

  కలల కు      కొనసాగింప నా...

  ఆశల కు      ఊరేగింప నా.

• ఏమనగలను      నేనేమనగలను

  ఏమనగలను      నేనేమనగలను


• ఏనాటిదో     ఈ  స‌మయం 

  ఈ నాటికి     వచ్చింది.

• ఏనాటిదో     ఈ అనుభవం 

  సరికొత్తగా     తాకింది.


• ఆ   పొద్దు   లోని      తొలిపొడుపు 

  ఈ పొద్దు     తిరిగి     చూస్తున్నా …

• ఆ నాటి    లోని     తొలి   స్పర్శ 

  ఈ నాడు   నే   అనుభవిస్తున్నా.


• ఏమనగలను     నేనేమనగలను

  ఎవరికి    ఏమని    చెప్పగలను.


• ఏనాటిదో     ఈ స‌మయం 

  ఈ నాటికి     వచ్చింది.

• ఏనాటిదో     ఈ అనుభవం 

   సరికొత్తగా     తాకింది.


యడ్ల శ్రీనివాసరావు 2 Aug 2023 , 11:00 pm.


490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...