అనంత గానం
Dedicated to my childhood friend for singing talent.
• ఓ కోయిల కూసెను రాగం
అది మనసును మీటిన శ్రావ్యం.
• ఓ కోయిల కూసెను గానం
అది వయసుకు చూపెను బాల్యం.
• ఆ రాగం ఆనంద రాగం
ఆ గానం సునంద భోగం.
• రాగాన భోగం తో పొందేను పరవశం
వయసు న మనసు లో చేరేను పసితనం.
• ఆ కోయిల పేరే అనంత.
తను పాడగా కలిగే పులకింత.
• ఓ కోయిల కూసెను రాగం
అది మనసును మీటిన శ్రావ్యం.
• ఓ కోయిల కూసెను గానం
అది వయసుకు చూపెను బాల్యం.
• గత మెరిగిన కోయిల గమకాలు పలికింది.
శృతి తెలిసిన పాపలా లయమై పాడింది.
• విశ్వానికి నాధుడే వినువీధిన విన్నాడు.
పార్వతితో ప్రీతుడై పదనిసలు కట్టాడు.
• ఓ కోయిల కూసెను రాగం
అది మనసును మీటిన శ్రావ్యం.
• ఓ కోయిల కూసెను గానం
అది వయసుకు చూపెను బాల్యం.
• ఇది జరిగిన కాలం లే
తిరిగి జరుగుతుంది లే.
• ఇది జరిగిన కాలం లే
తిరిగి జరిగి తీరాలి లే.
యడ్ల శ్రీనివాసరావు 26 Jan 2024, 2:00 AM.
సునంద = సంతోషపరుచు
విశ్వానికి నాధుడు = శివుడు
వినువీధి = ఆకాశం
No comments:
Post a Comment