బాల్య పిపాసి
( Observation from #90’s web series Title song)
పిపాసి = One Who Thirsty
• వయసు పలుకుతోంది
మనసు జారుతుంది.
• సాగుతున్న బాల్యం లో
ఏదో జరుగుతుంది
అది ఎంతో తికమకగా ఉంది.
• వయసు పలుకుతోంది
మనసు జారుతుంది.
• కళ్లు వెతుకుతున్నాయి ఓ స్వరం కోసం.
పెదవి విచ్చుకుంటుంది ఓ రూపు కోసం.
• అర్దం కాని భావమిది ఆనందం కురిపిస్తుంది.
వ్యర్థం కాని కాలమిది అనుభవం చూపిస్తుంది.
• తాకిన ఈ గాలిలో తనువు తేలుతుంది.
తపనలు తోడుగా కలవరిస్తు ఉన్నాయి.
• వయసు పలుకుతోంది
మనసు జారుతుంది.
• సాగుతున్న బాల్యం లో
ఏదో జరుగుతుంది
అది ఎంతో తికమకగా ఉంది.
• పాదాలు అడుగుల్లో చప్పట్లు చరిచాయి.
నిదుర లో రాగాలు మువ్వలా మోగాయి.
• మౌనం లో నవ్వులు జడగంటల సవ్వడి లా.
కాటుక తో టపటపలు హృదయానికి గారం లా.
• తేలుతున్న వయసు కి
మనసు తెలియ లేదు.
• ఎగురుతున్న తూరీగ కి
దిక్కులు తెలియ రాదు.
• క్రాపుల కేరింత లు
తుమ్మెదల కు అలజడవుతూ ....
• సాగుతున్న బాల్యం లో
ఏదో జరుగుతుంది
అది ఎంతో తికమకగా ఉంది.
యడ్ల శ్రీనివాసరావు 17 Jan 2024, 1:00 am.
No comments:
Post a Comment