Thursday, January 4, 2024

445. అంతర్ముఖ అందాలు

 

అంతర్ముఖ అందాలు



• కనులు   మూసినా

  మనసు    తెరిచినా

• కనిపించే   ఈ సుందరం

  అదే

  నా మనసు కి  అంబరం.


• సప్త   వర్ణాల   తేజం

  మెరిసింది

  ఇంద్ర   నీలాల  కన్నుల్లో.

• చందన   సుగంధ    భరితం

  తాకింది

  ఎద లయల    లోతుల్లో.


• జర జర   సెలయేరు   రాగం

  జారింది

  చెవి   వంపు    లోయల్లో.

• తార  సితారల   సౌందర్యం

  నిండింది

  అణు వణువు   సొంపుల్లో.


• కనులు   మూసినా

  మనసు   తెరిచినా

• కనిపించే  ఈ సుందరం

  అదే

  నా మనసు కి   అంబరం.


• ధ్యాస తో      ధ్యానం

  ప్రకృతి లో    మమేకం.

• శ్వాస తో     శ్రావ్యం

  విశ్వం తో    సంయోగం.


• హరిత వనాల   అందాలు

  నా మనసు కి    పొదరిల్లు .

• నవ గ్రహాల      చందాలు

  నా ఆరా కి        లోగిళ్లు.

 

• కనులు    మూసినా

  మనసు    తెరిచినా

• కనిపించే   ఈ సుందరం

  అదే

  నా మనసు కి   అంబరం.


యడ్ల శ్రీనివాసరావు  5 Jan 2024, 1:00 am.


No comments:

Post a Comment

495. అర్పితం

అర్పితం • పూస ను    కాను   పూస ను    కాను   నీ హారం లో   పూస ను  కాలేను. • పూవు ను   కాను   పూవు ను   కాను   నీ మాలలో   పూవు ను   కాలేను...