Sunday, January 23, 2022

130. ప్రకృతి ప్రేమ

 

ప్రకృతి ప్రేమ

• చలి చలిగా చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి.

• తడి తడిగా చినుకులు చిత్తడి చేస్తూ ఉన్నాయి.


• నీలి రంగు ఆకాశం నల్ల మబ్బులతో కమ్మెస్తుంటే…

• అడవి లోని పక్షులు ఆనందం తో ముసురుతూ ఉంటే…

• కళ్ల లోని ఆనందం అన్వేషణ అవుతుంది.

• మనసు లోని సంతోషం ఆలాపన అవుతుంది.


• జడి జడి గా జలధారలు జారుతూ ఉంటే

• పద పదమని మనసులు జోడీ కడుతూ.

• వడి వడిగా అడుగులో అడుగులు వేస్తూ…


• అడవి తల్లి ఇంటిలో….

• మంచె మాటు నీడలో …

• జత జత గా మన చేతులు ఒకటవుతుంటే.

• తహ తహతో తనువులు తేలుతూ ఉన్నాయి.


• నీ కంటి పాపలో నా రూపం కనిపిస్తుంటే…..

• నీ రెప్పలు తటపటలాడుతూ…..

• సంబరాలు చేస్తున్నాయి.


• ఈ చిత్తడి జల్లుల చిటపటలు….

• నీ చిరు నవ్వుల పాలిట ముత్యములై రాలుతూ ఉంటే…..

• నా దోసిలి బరువు అవుతుంది.


• తడిచి ముద్దైన తనువులకు….

• చిరుజల్లుల తలంబ్రాలు గా….

• దీవెనలు ఇస్తుంటే ఇంకేమి కావాలి నాకు….


•  వనము లో ని కుందేలు కలవర పడుతుంటే,

•  నెమలి నాట్యం తో  ఓదారుస్తుంది.

• ప్రకృతి ని ప్రేమిస్తే ఇంతకంటే ఇంకేం మిస్తుంది.


యడ్ల శ్రీనివాసరావు 23 జనవరి 2022, 9:50 pm


Tuesday, January 18, 2022

129. బాల్యం….వజ్రతుల్యం

 

                   బాల్యం….వజ్రతుల్యం

• ఓహోహో…హహహ…. లాలాలా….లలలలా.

• మదిలో చెదరని బాల్యమే

  కనుల ముందు కదలాడుతూ

  కలియ తిరుగుతూఊఊ ఉంది.


• ఓహోహో…ఆహహహ…లాలాలా….లలలలా.

• పెరిగిన వయసు కి ధనము లా

  తరగని మనసు కు ఇంధనము లా

  బాల్యం కనిపిస్తూ ఉంది

  నా చిన్ని బాల్యం పిలుస్తూ ఉంది.

• లల లా…లాలా లా….లాలా లా…..లలలలా.


• ఆ రోజు సాయంత్రం

  ఆకాశం ఉరుముతూ

  మేఘాలే చెదురుతూ

  ఈదురు గాలులు వీస్తున్నాయి

  కారు మబ్బులు కరుగుతున్నాయి.


• చిటపట చినుకుల లో…. చిందులాటల తో

  జోరు వర్షం లో చెక్కిలి గిలి హేలలు, గోలలు.


• అమ్మమ్మ ఇంటిలో…. తాటాకు సూరులో

  ధారలు ధారలు జలధారల వర్షం జారుతూ ఉంటే


• చిలక పళ్ల నవ్వులతో……చిట్టి పొట్టి గౌను లో

  చిన్ని చిన్ని గంతులతో…..చిందేసెను నా వయసు.


• ఆహహ…ఆహహహ…లాలాల….లలలలా…


• వర్షపు నీటి లో కాగితపు పడవలు

  నా చిట్టి మనసుకు రెక్కలు తొడిగిన ఆనందం.


• వర్షపు మట్టి పరిమళమే  పన్నీరు గంధం లా 

  ముక్కు పుటాలకు మధురం లా ఉంది.


• ఆ బాల వాసనలే….నేటికీ సువాసన లై

  ప్రాణం నిలుస్తొంది…..జీవనం గడుస్తోంది.


• ఓహోహో…ఆహహహ….లాలాలా…లలలలా.


• వర్షపు నీటినే అడిగా

  ఎందుకు నా కీ ఆనందమని.

• ఈదురు గాలినే అడిగా 

  ఎందుకు నా కీ జ్ఞాపకాలు అని.


• అవి ఏమన్నాయో తెలుసా 

  ఏమంటున్నాయో తెలుసా


• కలుషితం కాని నీరు లా 

  నా లోని బాల్యం   

  సెలయేరు లా నిలిచి ఉందంట.


• దుర్గంధం లేని గాలి లా

  నా లోని బాల్యం 

  చందనం లా   చెదపట్టక   ఉందంట.


• ఆనంద స్మృతుల  గాలి నీరు 

   కలిసి చందనపు సెలయేరైన, 

   నా బాల్యాన్ని ప్రకృతి 

   తన ఒడిలో లాలిస్తుందట.


• ఆహహ…. ఓహోహో….లావాలా…లలలలా.


• ఇంకేమి కావాలి నాకు

  నా లో జీవం లేకున్నా  నా బాల్యం సజీవం 

  ప్రకృతి లో కలిసిన  నా బాల్యం సజీవం.


• బంగారు కలలు కనే భవిత  కంటే

  గడచిన బాల్య స్మృతులే వజ్రతుల్యం.


• ఔనన్న....కాదన్నా….ఇది నిజమే కదా..


• ఓహోహో…ఆహహహ…లాలాలా…లలలలా.



యడ్ల శ్రీనివాసరావు 17 జనవరి 2022, 10:30 pm.




Friday, January 14, 2022

128. సంక్రాంతి

 

సంక్రాంతి

🌾🌵🌻🌿🌱🌴

• సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ……..నీ రూపం   తెలుగుదనం లోని వెన్నెల వెలుగు  అవుతూ ఉంది.

• నువ్వు గంగిరెద్దుల గంగన్నకు  ధాన్యము పోస్తూ ఉన్నపుడు,   ఎద్దు మెడ లోని గంటలు గణగణలాడుతూ ఉంటే…..నీ కాలి గజ్జెలు సవ్వడితో శృతి చేస్తూ ఉన్నాయి.

• నీలాల పసుపు పచ్చని పరికిణీలో నిన్ను,   పల్లె లోని పైరులు చూసి గుసగుసలు ఆడుతూ ఉంటే…..గుసగుసలు విన్న సీతాకోకచిలుకలు, నీ చుట్టు తిరుగుతూ , నీ అందానికి అసూయ పడుతూ ఉన్నాయి.

• చెంగు చెంగున గెంతుతూ,   పల్లె పాటలు పాడే  నీ కూని రాగాలకు ,    నీ దాగుడు మూతల వయ్యారి జడగంటలు నాట్యమే చేస్తూ ఉంటే ….. పెరటి చెట్టు మీద  గోరింక కన్ను ఆర్పక చూస్తూ ఉంది.

• నీ నవ్వులోని, పళ్ల అందమును చూసి …..పొలము గట్టున బోదెలో స్వచ్చమైన తెల్లటి నీళ్లు పరవళ్లు తొక్కుతూ, నొచ్చుకుంటూ నలిగి నలిగి… పోతూ…పోతూ… ఉన్నాయి.

• పల్లె అంతా కలియ తిరిగిన నిన్ను,   ప్రకృతి….. నీ చూపు లోని మురిపెం తో,  సంక్రాంతి ఆభరణం గా ఆనందిస్తూ ఉంది.

• సంక్రాంతి పద్మము లో గొబ్బెమ్మలా నీ ముఖము లోని తేజం మురిపిస్తూ ఉంటే…….. మనసు దోచిన గొబ్బెమ్మ ముంగిట నిలిచి చూడాలని ఉంది.


యడ్ల శ్రీనివాసరావు 14 జనవరి 2022 ,11:00 pm.


Thursday, January 13, 2022

127. వైకుంఠ ఈశ్వరా_ కైలాస శ్రీనివాస

 

వైకుంఠ ఈశ్వరా_ కైలాస శ్రీనివాస


• వేయి పడగలు నీడ 

  వైకుంఠ వాసా   శ్రీ వేంకటేశా.

• కోటి తీర్థముల తోడ 

  కైలాస వాసా     శ్రీ పార్వతీశా.


• ముల్లొక దేవతలు 

  మీ ముందు నిలిచి ముత్యాల 

  మిమ్ము   మననమే  చేయ …

• వందనము వందనము …

  శుభవందనము అభివందనము.


• కలియుగ దేవా శ్రీ వేంకటేశ్వరా …

  పాపాలను (వేం) 

  హరించ(కట) 

  అవతరించిన  శివా(ఈశ్వరా).

• మాయలో మునిగి తేలే వారికి 

  జ్ఞానధన  సముపార్జనకు  మార్గము 

  సుగమం  చేయ  వెలిసిన శ్రీ రంగనాథ.

• సంథికాలమున సకలజనుల 

  సంరక్షణకు సంగమించిన సంగమము 

  శివకేశవుల సంగమం.

• శ్రీ వేంకటేశా…. శ్రీ శ్రీనివాసా… 

  నీ మోము లో    సిరులు 

  తేజోవిలాసంతో  కురుపించు 

  మా పైన   శ్రీ చిద్విలాసా.


• నందనాల   నందీశ్వరుని కి 

  మనసాభివందనము.

• చందనాల నారసింహుని కి 

   శిరసాభివందనము.

• కుందనాల కాలేశ్వరుని కి 

  హృదయాభివందనము.


• భూలోక   సుఖదామము 

 అజ్ఞాన ఆకృత్య ఆడంబరాలతో 

 దుఃఖదామము గా మారెను.

• శ్రేష్టమైన కర్మలతో 

   పతితులను పావనము గాంచి 

   జ్ఞాన శక్తి తో   జీవన ముక్తులను 

   గాంచు   శ్రీ హరనాథ.

• ఓం నమో నారాయణాయ

  నీ నామ అష్టాక్షరీ …

  ఓం నమఃశివాయ 

  నీ నామ పంచాక్షరీ ... 

  జీవుడికి   జననమరణ  చక్రాన్ని 

  తప్పించే ముక్తి ఆయుధాలు.


• ఓం  శివకేశవాయనమః 🙏


• యడ్ల శ్రీనివాసరావు 13 జనవరి 2023 , 1:50 pm.














Tuesday, January 11, 2022

126. పంచభూతాల సమ్మేళనం


పంచభూతాల సమ్మేళనం

నీటి లోని నా  నీడ….. నా మనసు లోని తరంగాలను చూసి నిరాశ పడుతున్నాయి.

గాలి లోని నీ జాడ…… నా మనసు అంతరంగాన్ని స్పృశిస్తూ ఆవేదన చెందుతుంది.

భూమి మీద పగుళ్లు……. నా బంజరు మనసు జీవితానికి ఆనవాళ్లు.

ఆకాశం లోని శూన్యం……. విశాలమైపోయిన నా ఖాళీ మనసు కు బింబం.

అగ్ని లోని వేడి…….. నిరంతర నా మనసు దహనానికి దేదీప్యమైన వెలుగు.


• పంచభూతాల సమ్మేళనం …… నీడ లేని నా మనసు, నీ జాడ కోసం తిరుగుతూ, బంజరు భూమి పై ఉండలేక, దహించి దహించి,. సూక్ష్మాతి సూక్ష్మమై, తేలికయై శూన్యం లో కలిసిపోతుంది…... అది యే ఆత్మ…..శివుడు ఆడించే ఆటలో ఇది ఒక ఘట్టం. ఇది సత్యం. జన్మ జన్మల లో ఏదోక జన్మలో ఈ ఘట్టం అనుభవించవలసిందే. ఈ అనుభవమే అదృష్టం, ప్రారబ్దక కర్మ వియోగం.


యడ్ల శ్రీనివాసరావు 12 జనవరి 2022 11:00 am.


125. అమ్మ ప్రేమ

 

అమ్మ ప్రేమ


• “అమ్మా” అనే రాగము లో నే 

   అనురాగం తెలిసింది.

• అమ్మలోని మురిపాలు పాలతో 

  అమృతమై ఆకలి తీర్చింది.

• నా కనులు తెరిచిన గంటలలో కంటికి కనపడని

  నీవు, అనురాగము తో అమృతం పోశావు.

• పెనిమిటి పై ఉన్న ప్రేమను మించి …

 నా పైన “ ‘పర’ వశమే” అయ్యావు.


• చంకనేసుకుని చేతి ముద్దలతో “చందమామ రావే జాబిల్లి రావే” అంటుంటే, నాటి చిరునవ్వుల నీ రూపం నేటికీ చందమామ లోనే కనిపిస్తుంది.

• అర్థరాత్రి నిదురలో అరచేతితో నను నిమురుతుంటే, నాటి నీ కౌగిలి స్పర్శకి నేడు నా కంట నీరు కారుతూనే ఉందమ్మా.

• చిరుతిళ్ళు కోసం చిల్లర పైసలిచ్చిన……నీ చూపు నా ఆకలి చుట్టూ నే ఉండేది.

• అమ్మా…. భావోద్వేగాల సంగ్రామం లో ఒకరి పై కోపం నీ పై చూపిస్తుంటే….నీ సహనం తో తల్లడిల్లిన ఆ నాడు…..ఈ నాడు ఏహ్యం గా అనిపిస్తుంది నాకు.


• నాడు నా శరీరం పై గాయాలకు తల్లడిల్లావు…

 నేడు నా మనసు గాయానికి రక్షణ అయ్యావు.

• అమ్మ….ఇంత చూసిన నిన్ను….ఇంత చేసిన నిన్ను…. ఒంటరిని చేసి నేనెట్ట బ్రతికేది, నేనేడకు పోయేది, నేనెవరికోసం జీవించేది.

• అన్నీ మరచినా….. నాకు అన్నమే దొరికే నా?.....ఆనందమే మిగిలే నా?


• వయసును బట్టి మనిషి కి ప్రేమపై, ప్రేమలోని భావం మారుతూ ఉంటుందేమో……. కానీ, మనసు కు మూలమైన ప్రేమ తల్లి బీజం నుండి వృద్ధి చెందినదే.

• తల్లి, కూతురు, సోదరి, భార్య....... ఈ జీవన నాలుగు స్తంభాలాట లో    స్త్రీ ప్రేమ  ఎందరినో ఉత్తములు గా  తీర్చి దిద్దగలదు…. అది స్త్రీ యెక్క  లేేదా  స్త్రీ  పై  ఉన్న  రక్తి,  అనురక్తి,  విరక్తి …...ఏదైనా కావచ్చు.


యడ్ల శ్రీనివాసరావు, 11 జనవరి 2022, 6:00 am.


Sunday, January 9, 2022

124. ప్రకృతి లో ఒక రోజు

 

 ప్రకృతి లో  ఒక రోజు

• తెలవారుతుంది  తెల తెలవారుతుంది 

  నింగి లో ని తళుకు బెళుకు తారలకు 

  నిదురవుతు ఉంది.


• మంచు దారలతో తడిసిన 

  పచ్చని పైరు లన్ని నిదుర మేలుకొని 

  నిటారుగా అవుతున్నాయి.


• రంగు పూసుకున్న సూర్యుడు 

  రొమ్ము విరుచుకుని,  దిన రంగంలో

 అడుగుపెడుతున్నాడు.


• పైరు మీద కోయిలలు కుహు కుహు రాగాలతో

  గింజల కోసం గిరులు దాటి పోతున్నాయి.


• చేతి సంచిన సద్ధి మూటతో శ్రామికులు 

  శ్రమ కోసమై , పంటపొలాల గట్లపై ఉరుకులు

  పెడుతున్నారు.


• నడినెత్తిన చేరిన సూర్యునికి 

 నడక తగ్గినందుకు  గోదావరి తల్లి,  

 సెలయేటి చెల్లి  దాహంతో దహనం అవుతున్నారు.


• చింత చెట్టు నీడలో , సద్దిమూట అన్నం 

  పరమాన్నం గా తింటున్న కర్షకులు , 

 కందిరీగ హోరు ను జోలపాటలా వింటున్నారు.


• చెరువు చెంతకు చేరిన 

  తెల్లని కొంగల సమూహం , 

  తెరిచి తరచి చూస్తున్నాయి చేపల కోసం.


• మండుటెండలో ని చెట్లన్నీ 

 ఒకే జాతివి కాకపోయినా , చిరునవ్వులతో 

 అటుఇటు ఊగుతూ, చల్లని నీడతో 

 సూర్యుడిని వెక్కిరిస్తున్నాయి.


• ఒంగి నాటుతున్న వరినాట్లు తో, 

 రవిక జారిన రంగిని 

 చల్లని పిల్లగాలులు తాకుతూ ఉంటే , 

 తొంగి చూస్తున్న సూర్యుడు నిరాశ పడుతున్నాడు.


• సాయంసంధ్య లో దిశ మారిన సూర్యుడు,  

  రంగు మార్చుకుని నిదురలోకి జారుకుంటున్నాడు.


• అలసి సొలసిన శ్రామికులు 

  బరువు తగ్గిన సంచి తో, 

  తిరుగు ప్రయాణంలో ఉన్నారు.


• గిరులు తిరిగిన పక్షులు , 

  గింజలు నోట కరుచుకుని 

  గూడు చేరుకుంటున్నాయి.


• నిటారుగా ఉన్న పంట పైరులన్ని 

  నడుము వాల్చడానికి సన్నాహం అవుతున్నాయి.


• మగత నిదురలో నుంచి, 

  మత్తు కళ్లను తెరుస్తూ చందమామ, 

  చుక్కలు రాతిరి రంగం లోకి అడుగుపెడుతున్నాయి.


• అలసట లేని ప్రకృతి అంతా గమనిస్తూ,

  సింగారం తో ఉన్న స్త్రీ మూర్తి లా 

  చిరునవ్వు తో చూస్తూ ఉంది.



యడ్ల శ్రీనివాసరావు 10 జనవరి 2022 9:00 am.





123. నీ లోని విశ్వం


నీ లోని విశ్వం

• తెలుసుకో తెలుసుకో నీ లోనే‌ విశ్వం ఉందని తెలుసుకో.

• ఉల్కలు, ఉప్పెనలు, సెలయేరు లు, జలపాతాలు, అగ్ని పర్వతాలు నీ రక్త ప్రవాహం లో ఉన్నాయని తెలుసుకో.

• నీ మెదడు యొక్క శక్తి,  యుగయుగాల జ్ఞాపకాల నిక్షిప్తి.

• నీ కంటి యొక్క యుక్తి,  ఖండ ఖండాల వీక్షణకు అనురక్తి.

• నీ శక్తి ని పెంచుకో….. సూక్ష్మ స్థితి ని  తెచ్చుకో.

• విశ్వం లో ధ్వనులు, నీ శరీర గ్రంథుల లో అంతర్గత స్వరాలు.

• మనిషి నీ వొక ఆకారం తో నిండిన అనేక రసాయనాల ద్రవ్యరాశి వి.

• నీ జీవన క్రియకు దోహదం చేసే ఎన్నో రసాయనాలు , విశ్వం లో ప్రకృతి లోనివే. (కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, జింక్, కాపర్, ఆక్సిజన్…..)

• విశ్వం లో ని భూమి విద్యుదయస్కాంత క్షేత్రం అయితే….ఆ భూమి పై ఉన్న నీ లో ఉన్నది ఏ శక్తి తెలుసుకో.

• లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రాల గ్రహలశక్తి ప్రభావం, నీ పై లేనప్పుడు అమావాస్య పౌర్ణమి లకు కొందరి మానసిక స్థితి ఎందుకు మారుతుందో తెలుసుకో.

• విశ్వం లో ని శక్తి నీ కుండలిని లో నిక్షిప్తం……ఆ శక్తి జాగృతమా లేక నిద్రాణమై ఉందా తెలుసుకో.


యడ్ల శ్రీనివాసరావు 10 జనవరి 2022, 5:00 am.


122. శివైక్యం


శివైక్యం



• ఎవరినో    నే నెవరినో

  ఎవరినో     నే నెవరినో

• గమనం  ఎటువైపో

  పయనం  ఎటువైపో  ఈశ్వరా!


• ఎవరివో   నీ వెవరివో

  ఎవరివో   నీ వెవరివో

• ఎల్లలు దాటి   ఎదురేగి నా    

   కానరాని   నీవెక్కడో  ఈశ్వరా!


• ఆది  అంత్యాల  నడుమ 

  ఊయల ఊపే నీ ఆట ఏమిటో


• గమనం  ఎటువైపో

  పయనం  ఎటువైపో ఈశ్వరా!


• చీకటి లోని నాకు  

  నీ నీడ   

  నీ చెంతకు చేరుస్తుంటే 

  ఇక నేనేమి చూడాలి శివా!


• కదలని రూపం తో

  కదిలే సాకారం నీవే శివా!


• నీ నీడలో వస్తూ ఉంటే అందమైన 

  అందని పువ్వును కానుక గా ఇస్తున్నావు

  ఉద్యానవనం లో విహారం చేయిస్తున్నావు

  ఇది నీ పరిక్ష యే కదా శివా!


• మాయ లోని మర్మం 

  మదికి ఎరుక అవుతుంటే

  మలినాలను మోసే కాయం 

  కమనీయం కాదు కదా శివా!


• తలంపు లోని తరంగాలు 

  అంతరంగాన్ని  తెరిపిస్తుంటే 

  మదిలో న   మాటు వేసిన  

  మూలవిరాట్టు వి  నీవే కదా శివా!


• కలలు కన్న జీవితం 

  కల్లోల కడలి అయితే

  ఇక మిగిలినది 

  కలవరమే అనుకుంటే

  నీ కరుణ తో   కడలి నే 

  క్షీరమయం  చేసావు    కైలాసనాధ!


• శివ 

   ఏమివ్వగలను నీకు

   నీవిచ్చిన భిక్ష లో అక్షరము తప్ప.


• మలినం నిండిన శరీరం పై 

  మమకారం లేదు కానీ 

  లో లో ని బిందు స్వరూపం 

  నీ సన్నిధి కోరుకుంటుంది.


• ఆత్మను అర్పితం చేసినా

   ఇంకా  నాతో 

   ఈ ఆట లేల

   ఈ పాట లేల

   ఈ రాత లేల

   శరీరం మిగిలి ఉన్నందుకా శివా!


ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు , 9 జనవరి 2022, 6:30 pm.












Friday, January 7, 2022

121.శుభోదయం _ ఓం శాంతి


శుభోదయం _ ఓం శాంతి

• శుభోదయం శుభోదయం

  చిరునవ్వు లతో చిగురించే 

  అరుణ కిరణాలకు శుభోదయం.


• వెలుగు లో ని వన్నెతో 

  కిరణాలు తాకుతుంటే

  మురళి లోని మాధుర్యమే 

  జ్ఞానామృతమవుతుంది.


• బృందావనం  లోని మురళికి  

  గోవులు  పరవశిస్తుంటే

  మధువనం  లోని   మురళి కి  

  పిల్లలు పులకరిస్తున్నారు.


• బాబ తండ్రివి  నీవు

  తనయులు మేము.


• తరతరాల బంధము నే  

  తరియించి తన్మయులమైనాము.


• నీ చూపు కై ఈ నిరీక్షణ

   అదే మా ఆత్మకు రక్షణ.


• సెలయేటి సవ్వడి లా 

  నీ జ్ఞానము ప్రవహిస్తూ ఉంటే 

  హంసలమై వింటూ ఉన్నాము.


• మా కనులెంత మూసినా

   కనులెంత తెరిచినా 

   కదలాడె నీ రూపం బాబ 

   ఓ బ్రహ్మ బాబ.


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 7 జనవరి 2023 8:00 pm











120. నామము బ్రహ్మ నామము_ ఓం శాంతి

  నామము బ్రహ్మ నామము_ ఓం శాంతి

 


• నామము 

  బ్రహ్మ నామము

• ప్రణామము

  బ్రహ్మ బాబ కు ప్రణామము.


• చిన్ని చిన్ని పిల్లలము

  చిట్టి పొట్టి ప్రాణులము.

• దయచూప వచ్చావు మా తండ్రి.

  లాలించ వచ్చావు మా తండ్రి.

• నీ ప్రేమ  బంధీలము బాబ.


• వికసించిన కమలము లా 

  జ్ఞానము నే  ధారణ చేసి 

  దరి చేరిన  జీవులను 

  ధన్యులను చేసావు బాబ.


• తరగని మకరందమే 

  నీ జ్ఞాన మందారము.


• మిణుగురుల మై మేము 

   నీ నీడలో జ్ఞాన వెలుగును 

   చూస్తున్నాము బాబ.


• నీ నీడలో ఉన్న మాతో

  పువ్వులు పలకరిస్తున్నాయి

  చల్లని గాలి నవ్వుతుంది 

   ఏమీ ఈ అధ్బుతం.


• నామము

  బ్రహ్మ నామము.

• ప్రణామము 

   బ్రహ్మ బాబ కు ప్రణామము.


• అలసి సొలసి న మాకు

  అమృతమే ఇచ్చావు

  ఆకలినే తీర్చావు

  ఆనందం లో ముంచావు.


• ఏమివ్వగలము నీకు

  మా సేవను మించి

• ఏమివ్వగలము నీకు

  మా ఆర్తి ని మంచి

• బాబ…..బాబ…. బ్రహ్మ బాబ.


• దేహము లో దహియించే 

  సందేహాలు  అడగకనే

  నీ అడుగు లో అడుగు వేసిన మాకు

  అడుగంటుతున్నాయి బాబ.


• ఏమిటీ చిత్రం

  ఏమిటీ ఈ విచిత్రం.

• నామము నామము

  బ్రహ్మ నామము

• ప్రణామము

  బ్రహ్మ బాబ కు ప్రణామము.


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 7 జనవరి 2022 , 7:30 pm.




Tuesday, January 4, 2022

119. కృతి గారం


కృతి గారం

• వేసే అడుగులో  నీ రూపం , తరగని వన్నెకు శ్రీ కారం అవుతుంటే ఇంకా ఆలస్యం ఎందుకు అంటుంది,  ఆలింగనము నాతో.

• వాలుజడ సరిగమల విన్యాసానికి,  నీ నడుము నొచ్చుకుంటుంటే…..కలవరం ఎందుకు అంటున్నాయి,  కళ్లు నాతో .

• నీ చెవి ఝంకాలు ఊగిసలాటలాడుతుంటే “నా’సిక’ “ నీ సిగను తాకుతూ ఊపిరి తో ఊయలూపుతుంటే ఆహా!

• సుతిమెత్తని నీ పాదములను….. సున్నితమైన నా అరచేతులు…..తరచి తరచి నిమురుతుంటే మృదువైన ఆ స్పర్శ ఎంత భాగ్యమో!

• నీ రెప్పల కలవరము తో, రా రమ్మని నను పిలిచే నీ అరచేయి సంజ్ఞలకి , నా ఆధరముల తడబాటును చిరునవ్వు తో గమనిస్తున్న వెన్నెలకు, సిగ్గు తో నేను ఏమని సమాధానం చెప్పాలి.

• ప్రకృతి   *కృతి  శృంగారం లోని  గారం తో  వికసించిన అదే  వికృతి కి ముక్తి .


*కృతి = చేసే, చేయు

YSR 29 Dec 21 11:00


488. నా ప్రపంచం

నా ప్రపంచం • నా దొక   ప్రపంచం   అది   సోయగాల   సౌందర్యం. • నా  మనసెరిగిన   ప్రపంచం   మధువొలికిన     అనందం. • అందాల   ఆరబోతలు   ఆదమరచి   ...