Tuesday, January 4, 2022

119. కృతి గారం


కృతి గారం

• వేసే అడుగులో  నీ రూపం , తరగని వన్నెకు శ్రీ కారం అవుతుంటే ఇంకా ఆలస్యం ఎందుకు అంటుంది,  ఆలింగనము నాతో.

• వాలుజడ సరిగమల విన్యాసానికి,  నీ నడుము నొచ్చుకుంటుంటే…..కలవరం ఎందుకు అంటున్నాయి,  కళ్లు నాతో .

• నీ చెవి ఝంకాలు ఊగిసలాటలాడుతుంటే “నా’సిక’ “ నీ సిగను తాకుతూ ఊపిరి తో ఊయలూపుతుంటే ఆహా!

• సుతిమెత్తని నీ పాదములను….. సున్నితమైన నా అరచేతులు…..తరచి తరచి నిమురుతుంటే మృదువైన ఆ స్పర్శ ఎంత భాగ్యమో!

• నీ రెప్పల కలవరము తో, రా రమ్మని నను పిలిచే నీ అరచేయి సంజ్ఞలకి , నా ఆధరముల తడబాటును చిరునవ్వు తో గమనిస్తున్న వెన్నెలకు, సిగ్గు తో నేను ఏమని సమాధానం చెప్పాలి.

• ప్రకృతి   *కృతి  శృంగారం లోని  గారం తో  వికసించిన అదే  వికృతి కి ముక్తి .


*కృతి = చేసే, చేయు

YSR 29 Dec 21 11:00


No comments:

Post a Comment

699. మన నమ్మకాలు

  మన నమ్మకాలు   మనం ఏది  విశ్వసిస్తామో  అదే సాధిస్తాం . • జీవిత ప్రయాణంలోని నమ్మకాలన్నీ  ఎక్కడ నుండి వచ్చాయని మనం కొన్ని సార్లు ఆశ్చర్యపోతుం...