Friday, January 7, 2022

121.శుభోదయం _ ఓం శాంతి


శుభోదయం _ ఓం శాంతి

• శుభోదయం శుభోదయం

  చిరునవ్వు లతో చిగురించే 

  అరుణ కిరణాలకు శుభోదయం.


• వెలుగు లో ని వన్నెతో 

  కిరణాలు తాకుతుంటే

  మురళి లోని మాధుర్యమే 

  జ్ఞానామృతమవుతుంది.


• బృందావనం  లోని మురళికి  

  గోవులు  పరవశిస్తుంటే

  మధువనం  లోని   మురళి కి  

  పిల్లలు పులకరిస్తున్నారు.


• బాబ తండ్రివి  నీవు

  తనయులు మేము.


• తరతరాల బంధము నే  

  తరియించి తన్మయులమైనాము.


• నీ చూపు కై ఈ నిరీక్షణ

   అదే మా ఆత్మకు రక్షణ.


• సెలయేటి సవ్వడి లా 

  నీ జ్ఞానము ప్రవహిస్తూ ఉంటే 

  హంసలమై వింటూ ఉన్నాము.


• మా కనులెంత మూసినా

   కనులెంత తెరిచినా 

   కదలాడె నీ రూపం బాబ 

   ఓ బ్రహ్మ బాబ.


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 7 జనవరి 2023 8:00 pm











No comments:

Post a Comment

756 . హద్దు లేని ఆకాశం నీ ప్రేమ

  హద్దు లేని  ఆకాశం  నీ  ప్రేమ • హద్దు  లేని   ఆకాశం    నీ  ప్రేమ .   హావభావాలు   ఎరుగకనే   చూపావు .   ఆనందడోలికలలో   ముంచావు . • హద్దు  ...