Monday, November 27, 2023

429. ప్రేమామృతం

 

ప్రేమామృతం



• నిజమే    కదా

  ఇది   నిజమే కదా.

• నీవు     లేకపోయినా

  నిన్నే     చూస్తున్నా.

• నీవు     కానరాకున్నా

  నీతో     ఉంటున్నా .


• నిజమే    కదా

  ఇది    నిజమే  కదా.


• ప్రతి     క్షణము

  గతమవుతూ  ఉంటే  …

• అను    క్షణము

  నీవే     అంటూ …

• ఆనవాలు   ఎన్నో

  అనుభమవు  తున్నాయి.

• ఆలోచన   లెన్నో 

  ఆదమరవ   కున్నాయి.


• నిజమే    కదా

  ఇది    నిజమే  కదా.


• చావు లేని   మన   ప్రేమ కు

  చాలినంత    జీవితం  లేదు.

• ఆగి పోని      కాలానికి

  సాక్ష్యాలను  తుడిచే  ధైర్యం లేదు.


• నిజమే     కదా

  ఇది  నిజమే  కదా.

• నీవు    లేకపోయినా

  నిన్నే     చూస్తున్నా.

• నీవు    కానరాకున్నా

  నీతో     ఉంటున్నా.


• మరణం తో     వీడి పోయినా 

  మమేకమై    ఉన్నాను.

• దరి    కాని    దూరం తో 

  నిను  విడవ  లేక   ఉన్నాను.


• ని జ మే     క దా ...

  ఇ ది    ని జ ము    కా దా.



దరి = సమీపం, దగ్గర .


యడ్ల శ్రీనివాసరావు 27 November 2023. 10:00 pm.


Sunday, November 26, 2023

428. కార్తీక పౌర్ణమి

 

కార్తీక పౌర్ణమి 


• సిగ   లోన    సింగారుడు

  శివుని   సిగ లోన   సింగారుడు.

• కార్తీక    పౌర్ణమి న

  భువిని    జ్యోతి గా 

  చేసిన   శీతభానుడు.


• సిగ   లోన   సింగారుడు

  శివుని  సిగ లోన   సింగారుడు.

• పూర్ణ   కుంభుడై   వెన్నెలతో

  వెలిగే  మగువ  మానసుడు.

• నిందలకు   నీరుగారని  వాడు

  నెలవంక లా   నిలిచే   నిశాకేతుడు.


• సిగ   లోన   సింగారుడు

  శివుని   సిగలోన   సింగారుడు.

• ఆటుపోట్ల ను   ఆనంద

  సాగరం   చేసే   సోముడు.

• మనసును   మైనం    చేసి

  ముగ్దం    గావించే    సారసుడు.


• సిగ   లోన   సింగారుడు

  శివుని  సిగ లోన   సింగారుడు.

• హసంతి    తాపము ను

  వాసంతి గా   చేసే    హసనుడు.

• శివుని    తేజము  తోన 

  మదికి  మహారాజు  ఆయే   చందురుడు.


• సిగ   లోన    సింగారుడు

  శివుని    సిగ లోన    సింగారుడు.

• కార్తీక   పౌర్ణమి న

  భువిని    జ్యోతి గా 

  చేసిన   శీతభానుడు.



చంద్రుడు = శీతభానుడు, నిశాకేతుడు, మానసుడు, సారసుడు, సింగారుడు, సోముడు, హసనుడు.

భువి = భూమి.

హసంతి = కుంపటి.

తాపము =  బాధ, దుఃఖం, ఉద్వేగం, వేడి.

వాసంతి = మల్లె, శాంతం, తెలుపు.


యడ్ల శ్రీనివాసరావు 26 November 2023 10:00 PM .


Saturday, November 25, 2023

427. పౌర్ణమి చంద్రుడు

 

పౌర్ణమి చంద్రుడు


• మనసున్న    వాడు

  నా   చంద్రుడు.

• నేడు  ప్రియుడై  నాడు

  నా   ఇంద్రుడు.


• పక్షాని   కొస్తాడు 

  పలకరించి   పోతాడు.

• వెన్నల ను   ఇస్తాడు

  మల్లె లా   మురిపిస్తాడు.

• కాంతులీనే    వాడు

  నా చంద్రుడు.

• కాంతలతో  దోబూచు లాడే 

  సుందరాంగుడు.


• మనసున్న   వాడు

  నా   చంద్రుడు.

• నేడు   ప్రియుడై  నాడు

  నా   ఇంద్రుడు.


• నక్కి నక్కి   పౌర్ణమి కి    వస్తాడు

  నిండు    కౌగిలి ని     ఇస్తాడు.

• పాల లాంటి   ప్రేమతో     చూస్తాడు

  రోహిణి పై   మురిపాలు   పోస్తాడు.


• మనసున్న    వాడు

  నా   చంద్రుడు.

• నేడు  ప్రియుడై  నాడు

  నా   ఇంద్రుడు.


• కలల ను    కళలల తో

  కన్నుల కు   కడతాడు.

• కంటిమీద    కునుకు

  లేకుండా     చేస్తాడు.


• మనసున్న   వాడు

  నా    చంద్రుడు.

• నేడు   ప్రియుడై  నాడు

  నా   ఇంద్రుడు.


యడ్ల శ్రీనివాసరావు 26 November 2023 

6:00 AM


Friday, November 24, 2023

426. రాగ నృత్యం

 

రాగ నృత్యం


• రాగం   సరిగమ లు   పాడే

  పాదం   తకదిమి న    ఆడే.


• తరంగా ల     పదనిసల కు 

  తనువా యే    తీగ లా.

  సరాగా ల       సందడి కి

  మనసా యే     మల్లె లా.


• రాగం   సరిగమ లు   పాడే

  పాదం   తకదిమి న    ఆడే.


సృష్టి       చేసే

  భావం

  కళల కు    సంకేతం.

స్థితి     చూపే

  అభినయం

  భంగిమ కి   జీవం.

లయ    మాడే

  నాట్యం

  నటరాజు ని  స్వరూపం.

• సృష్టి   స్థితి    లయలు

  శివుని    ఆధీనం.

 

• రాగం   సరిగమ లు   పాడే

  పాదం   తకదిమి న    ఆడే.


• నృత్యం     తన్మయత్వం

  గాత్రం       మనఃతంత్రం

 

• రాగం   సరిగమ లు    పాడే

  పాదం   తకదిమి న    ఆడే.


• రాగాల    జననం    రస రంజనం.

  భావాల   అభినయం   నాట్యం.


గాత్రం = స్వరం, కంఠం, దేహం

మనఃతంత్రం = మనసు యొక్క శబ్దం.


యడ్ల శ్రీనివాసరావు 24 November 2023, 8:00 pm


Thursday, November 23, 2023

425. ప్రేమిస్తాను జీవిస్తాను

 

ప్రేమిస్తాను    జీవిస్తాను



• ప్రేమిస్తాను    జీవిస్తాను.

‌  ప్రేమే    నా   లోకం

  జీవం   నా   భాష్యం.


• ప్రేమిస్తాను    జీవిస్తాను.

  రాతల   లోకాన్ని        ప్రేమిస్తాను.

  పదాల   భాష్యం లో    జీవిస్తాను.


• నేనున్న    నాడు

  ప్రేమ ను   పంచుతాను.

  నే లేని     నాడు

  కావ్యం లో   కనిపిస్తాను.


• ప్రేమిస్తాను     జీవిస్తాను

  ప్రేమే    నా     లోకం

  జీవం   నా    భాష్యం.


• ఎవరూ  లేని      నా  లోకం లో

  శివుడే    తోడు    గున్నాడు.

• ఎందరో   ఉన్న    ఈ లోకంలో

  బంధాలే   నీడ    గున్నాయి.


• ప్రేమిస్తాను    జీవిస్తాను

  ప్రేమే    నా    లోకం

  జీవం   నా    భాష్యం.


• మనస్సాక్షి     ఉండేది

  మనిషి    లోనే.

  మభ్య పెట్టి     జీవిస్తే

  మనసు కే   దుఃఖం.


• మహా    "జ" నటులతో

  మసలడం    నరకం.

• మౌనం తో   మమేక 

  మవ్వడం    స్వర్గం.


• ప్రేమిస్తాను     జీవిస్తాను

  రాతల   లోకాన్ని      ప్రేమిస్తాను.

  పదాల   భాష్యం లో   జీవిస్తాను.


భాష్యం = మూలాలను వ్రాసే కావ్య రచన


యడ్ల శ్రీనివాసరావు 24 November 2023, 9:00 pm


Sunday, November 19, 2023

424. మరణం మధురం

 

మరణం మధురం


• మరణం    మరణం

  మనసు

  మతి లో    మధురం.

• జననం     జననం

  జీవన

  గతి లో     గరళం‌.


• మది    మీటిన    మరణం

  ఓ    స్మరణం.

• జవ    దాటిన      జననం

  ఓ    బుణం.


• మధురమైన       మరణం

  మరుజన్మ కు     పునీతం.

• గరళమైన       జననం

  ఇహ జన్మకు      శోకం.


• మరణం      మరణం

  మనసు

  మతి లో      మధురం.

• జననం       జననం

  జీవన

  గతి లో       గరళం.


• ఆశల   ఆటల    అలలు

  కోరికలు.

• ఆరని    చిచ్చుల   వలలు

   వేదనలు.


• సుగుణాల    పునాదులు

  మనుగడకు   మూలాలు.

• అర్రులుచాచే    ఆడంబరాలు

  వికారాల       జీవనాలు.


• మరణం      మరణం

  మనసు

  మతి లో     మధురం.

• జననం     జననం

  జీవన

  గతి లో      గరళం‌


• జననం     ఎందుకో

  తెలియక

  జన్మలు     గడుస్తాయి.

• జన్మ       కారకం

  తెలిసాకే 

  మరణం    మధురం.



గతి = విధానం, దారి

గరళం= విషం.

జవదాటిన = అతిక్రమించిన


యడ్ల శ్రీనివాసరావు 20 Nov 2023 3:00 AM


Friday, November 17, 2023

423. కరుణ కటాక్షుడు

 

కరుణ కటాక్షుడు



• కరుణ   కటాక్షుడు

  కోమలాంగుడు   శివుడు

  కార్తీకమున   కనకం   నింపే    కాలుడు.


• విభువుని    తలచిన

  ప్రభువుగ    చేసెను  వాముడు.

  విలువలు    వలువగా

  ధారణ    చేసెను    విధుడు.


• కరుణ     కటాక్షుడు

  కోమలాంగుడు   శివుడు.

  కార్తీకమున    కనకం నింపే   కాలుడు.


• హరుని    ఘోషతో

  నరుని    కోరికలకు   మోక్షం.

  శివుని    తపము తో

  జీవుని    బాధలు   మాయం.


• విశ్వ    శక్తి తో

  సూక్ష్ముడైనాడు   శివుడు.

  సూక్ష్మం లోనే

  మోక్ష మిచ్ఛేను    హరుడు.


• కరుణ   కటాక్షుడు

  కోమలాంగుడు  శివుడు.

  కార్తీకమున   కనకం నింపే   కాలుడు.


• ధ్యానమనే   ప్రమిద తో

‌ ఆత్మ  అనే    జ్యోతి     చేరును దైవం.

‌ జ్ఞానమనే    తైలం తో

 బుద్ధి  అనే   సిద్ధి    అగును   యోగం.


• కర్మ భోగ   మే     నరకం.

  కర్మ యోగ మే     స్వర్గం.

  ఆత్మ చైతన్య మే     జీవం.

  పరమాత్మ  స్మృతి యే   కైవల్యం.


యడ్ల శ్రీనివాసరావు 18 Nov 2023, 3:45 AM.


Thursday, November 16, 2023

422. ప్రేమాభిషేకం

 

ప్రేమాభిషేకం


• కదలని      వదలని

  మనసుల    ఆరాధన   ప్రేమ.

• తపనలు    విడువని

  తనువుల   అభిమానం   ప్రేమ.


• ఉరిమే      ఉద్వేగం    ప్రేమయితే

  ఉనికి లో    పెరిగేది    ఇష్టం.

• కలిగే    కామనలు     ప్రేమయితే

  కలిసి న    భావాలే    బంధం.


• ప్రేమంటే   మోహం    కాదు

  ప్రేమంటే   కామం     కాదు

• ప్రేమంటే   వికారం   కాదు

  ప్రేమంటే   విరహం  కాదు


• ప్రేమ తో    కలిగేది     వన్నె

  ప్రేమ లో    మిగిలేది   వెన్న.

• ప్రేమ లో   చూడాలి   శుభం

  ప్రేమ తో   జరిగేది   జయం.


• కదలని     వదలని

  మనసుల   ఆరాధన   ప్రేమ.

• తపనలు   విడువని

  తనువుల   అభిమానం  ప్రేమ.


• అనురాగాల    సంగమం

  భవ  బంధాల   సాగరం.

• ఆనందాల    త్యాగం

  అజరామరమ    వికసితం.


• ఆస్వాధన ల     తోడు లు

  అదృష్టమైన       నీడ లు.

• ఆలాపన ల     రాగాలు

  అమరమైన     జ్ఞాపకాలు.


• కదలని    వదలని

  మనసుల  ఆరాధన  ప్రేమ.

• తపనలు   విడువని

  తనువుల  అభిమానం   ప్రేమ.


• ఉరిమే    ఉద్వేగం    ప్రేమయితే

  ఉనికి లో   పెరిగేది   ఇష్టం.

• కలిగే   కామనలు    ప్రేమయితే

  కలిసి న     భావాలే   బంధం.


కామన = ఆకాంక్ష.

వన్నె = గౌరవం, శుభం, సంతోషం.

అజరామరమ =  స్థిరం, ఎప్పటికీ సజీవం 


యడ్ల శ్రీనివాసరావు 16 November 2023 9:00 pm .


Sunday, November 12, 2023

421. సత్యభామ

 

సత్యభామ 



• విరిసే   మురిసే   

  సొగసు ని తాకే

  నీ   నవ్వుల   పువ్వులు.

• మెరిసే   నా మనసే 

   ఊగిస లాడే

   నీ మువ్వల   సవ్వడి లో .


• మంత్రించిన    నీ ముద్దు

  దాటించెను     నా హద్ధు.

  మురిపించే      ఈ పొద్దు

  నా సిగ్గు ని    చేసే   రద్దు.


• విరిసే   మురిసే 

  సొగసు ని  తాకే

  నీ నవ్వుల   పువ్వులు .

• మెరిసే   నా మనసే 

   ఊగిస లాడే

   నీ  మువ్వల  సవ్వడి లో .


• నీవొక    చిత్రించిన   చిత్రం

  రవివర్మ కే     విచిత్రం.

  నీ  మోహం  లోని     రూపం

  బాపు   ఎరిగిన   భావం.

 

• నీ  దేవయాని  తీగ శోభనం 

  దేవదాసు    దాసోహం.

  నీ  సత్యభామ  సాంగత్యం 

  చేసే  మనసు   శాంతం.


• విరిసే   మురిసే 

  సొగసు ని   తాకే

  నీ నవ్వుల   పువ్వులు .

• మెరిసే నా మనసే 

  ఊగిస లాడే 

  నీ మువ్వల   సవ్వడి లో.


యడ్ల శ్రీనివాసరావు 12 November 3:30 pm.


Wednesday, November 8, 2023

420. కార్తీక మీనం

 

కార్తీక మీనం


• మంచు  ముసుగు   వేసింది

  మది లో   మీనం  ఆడింది.

• మతి   మధురం   అయింది

  మనసు   జలకం   ఆడింది.


• కార్తీకపు    లోగిలిలో

  పారిజాతపు   పేరంటాలు.

• కావేరి    కౌగిలిలో

  తేనెటీగ ల     సంబరాలు.


• వేకువ లో      కోకిల లు

  కీరవాణి        రాగాలు.

• మేలుకొ నే    భానుడి కి

  ఉషోదయపు   గారాలు.


• మంచు   ముసుగు   వేసింది

  మది లో   మీనం   ఆడింది.

• మతి   మధురం   అయింది

  మనసు   జలకం   ఆడింది.


• తోట లో    తరుణి కి

  తామర స    తాంబూలాలు.

• సుతి   మెత్తని   చూపులే

  ఉసిరి    కసిరే     కవ్వింపులు.


• పల్లకీ లో     పరిణయం

  తెరల   చాటు    సింగారం.

• జుంకాల     జావళి తో

  జల్లుమంది   గుండె లో.


• మంచు   ముసుగు  వేసింది

  మది లో   మీనం   ఆడింది.

• మతి    మధురం   అయింది

  మనసు   జలకం    ఆడింది.


తామరస = బంగారు

జావళి = శ్రావ్యమైన సంగీతం


యడ్ల శ్రీనివాసరావు 8 Nov 2023 , 7:00pm.


Saturday, November 4, 2023

419. శివుని కిరణం

 

శివుని కిరణం


• ఈశ్వర     పరమేశ్వరా

  నీ   కిరణము   తాకింది

  నీ   శ్రవణము   చేరింది.


• కిరణముల   కాంతితో

  పదములు    విన్యాస  మాడేను.

  నా కరములు   నాట్యం  చేసేను.

  

• శ్రవణముల   శ్రావ్యం తో

   కర్మల   శేషం   తెలిసేను

   నా  జన్మల సాక్ష్యం  చూసేను.


• ఈశ్వర    పరమేశ్వరా

  నీ  కిరణము  తాకింది

  నీ  శ్రవణము  చేరింది.


• నా తోడు     నీ వని   తెలిసాక

  నే    దేహము కాదు

  ఆత్మ  నని   తెలిసింది.

• నీ తోటి      నేను   నడిచాక

  నీవు    ఆకారము  లేని

  పరమాత్ముడి వని   తెలిసింది.

• ఏమి    పుణ్యమో

  ఎంత    శ్రేష్టమో 

• అభాగ్యులు ను    చేర దీసి

  అసలైన   భాగ్యం   ఇస్తావు.


• ఈశ్వర   పరమేశ్వరా

  నీ కిరణము    తాకింది

  నీ శ్రవణము   చేరింది.


• కాలేటి    కడుపులను 

  కమనీయం   చేసే    నీ స్మరణము.

• ఊగేటి     జీవితాలను

  సుస్థిరం     చేసే       నీ మననము.


• ఏమి    యోగమో 

  ఏమి     ప్రాప్తమో 

• అంధులను   అక్కున  చేర్చుకుని 

  అందలము    ఎక్కిస్తావు.


• ఈశ్వర      పరమేశ్వరా

  నీ కిరణము    తాకింది

  నీ శ్రవణము    చేరింది.



యడ్ల శ్రీనివాసరావు 5 Nov 2023. 3:00 AM.


Friday, November 3, 2023

418. శివ పాశం

 

శివ పాశం



• మాటాడి   చూడు

  శివుని తో

  మాటాడి   చూడు.


• మాటల   మూటల   భాగ్యం

  సిరు లై    చేరగా

  బాధల   దుఃఖపు    శోకం

  మైన మై    కరుగును.


• మాటాడి    చూడు

  శివుని   తో

  మాటాడి    చూడు.

• శివుని తో      మాటలు

  నిను    మేలుకొలుపు   బాటలు.


• మనసు    తెరిచి    చూడు

  శివుని కై

  నీ మనసు  తెరచి   చూడు.


• వెలుగు  తెరిచిన   ద్వారం

  ఆహ్వానం    పలుకగా

  చీకటి   దారుల    పయనం

  కనుమరుగై     పోవును.


• మనసు    తెరిచి  చూడు

  శివుని కై

  నీ మనసు   తెరచి  చూడు.

• శివుని కై    చూపులు

  నీకు   మోక్షమిచ్చు   కిరణాలు.


• శివుని    తెలుసుకోవడం

  ఎన్నో      జన్మల పుణ్యం.

• శివుని      ప్రేమ పొందడం

  అంతులేని  సౌభాగ్యం.


• శివుని     సేవ చేయడం

  దుష్కర్మల   వినాశనం.

• శివుని     చేరు వవ్వడం

  పవిత్రతకు   నిదర్శనం‌.


• మాటాడి     చూడు

  శివుని తో

  మాటాడి చూడు.

• మనసు   తెరిచి  చూడు

  శివుని కై

  నీ  మనసు   తెరచి  చూడు.


యడ్ల శ్రీనివాసరావు 3 November 2023 1:00 pm.


Wednesday, November 1, 2023

417. శివ సుందర

 

శివ  సుందర


• శివుడే    సుందరుడు

  నా  శివుడే   చందురుడు.

• రూపము   చూసిన   శాంతము

  నామము   చేసిన     సౌఖ్యము.


• శివుడే      సుందరుడు

  నా శివుడే  చందురుడు.


• మౌనము    గానే    మనసున

  అగ్ని ని   కొలువై నాడు.

• ఆరుద్రం లోనే     వెన్నెల నిండి

  నేడు  ఉదయించాడు.


• శివుడే      సుందరుడు

  నా శివుడే  చందురుడు.

• రూపము   చూసిన  శాంతము

  నామము   చేసిన    సౌఖ్యము.


• కాంతల   పూజకు   నేడు

  కాంతి నే    వరమిస్తాడు.

• భాగ్యం   నింపే   భాగస్వామిని

  జత గా     చేరుస్తాడు .

 

• శివుడే      సుందరుడు

  నా శివుడే  చందురుడు.


• ప్రేమను  త్యాగం చేసిన వాడు 

  ప్రేమ ను    పంచుతాడు.

• వైరాగ్యం      నిండిన వాడు

  రాగాలను     పలికిస్తాడు.

•  ఇది      కళ్యాణం 

   శివుడు

  చేసేటి   లోక  కళ్యాణం.


• శివుడే      సుందరుడు

  నా శివుడే చందురుడు.

• రూపము   చూసిన   శాంతము

  నామము    చేసిన    సౌఖ్యము.



 ఈ రోజు కర్వాచౌత్ , కరక చతుర్థి అంటారు. ఇది ఉత్తర భారతదేశంలో వివాహం కాని, మరియు వివాహిత స్త్రీలు తమ భర్త, ప్రియుడు, స్నేహితుడు సంక్షేమం కోసం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అలంకరణ తో శివపూజ చేసి , జల్లెడ లో చంద్రుని చూస్తారు. దీనిని తెలుగు వారు అట్లతద్ది అనికూడా అంటారు.


 కానీ ఈరోజు మాత్రం చాలా ప్రత్యేకం. వంద సంవత్సరాల తరువాత ఈ రోజు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర లో ఉదయిస్తాడు. దీనిని శివ యోగం అంటారు. (హైదరాబాద్ సమయం రాత్రి 8:40 నిమిషాల నుంచి)


యడ్ల శ్రీనివాసరావు 1 November 2023, 8:40 PM.


490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...