శివ సుందర
• శివుడే సుందరుడు
నా శివుడే చందురుడు.
• రూపము చూసిన శాంతము
నామము చేసిన సౌఖ్యము.
• శివుడే సుందరుడు
నా శివుడే చందురుడు.
• మౌనము గానే మనసున
అగ్ని ని కొలువై నాడు.
• ఆరుద్రం లోనే వెన్నెల నిండి
నేడు ఉదయించాడు.
• శివుడే సుందరుడు
నా శివుడే చందురుడు.
• రూపము చూసిన శాంతము
నామము చేసిన సౌఖ్యము.
• కాంతల పూజకు నేడు
కాంతి నే వరమిస్తాడు.
• భాగ్యం నింపే భాగస్వామిని
జత గా చేరుస్తాడు .
• శివుడే సుందరుడు
నా శివుడే చందురుడు.
• ప్రేమను త్యాగం చేసిన వాడు
ప్రేమ ను పంచుతాడు.
• వైరాగ్యం నిండిన వాడు
రాగాలను పలికిస్తాడు.
• ఇది కళ్యాణం
శివుడు
చేసేటి లోక కళ్యాణం.
• శివుడే సుందరుడు
నా శివుడే చందురుడు.
• రూపము చూసిన శాంతము
నామము చేసిన సౌఖ్యము.
ఈ రోజు కర్వాచౌత్ , కరక చతుర్థి అంటారు. ఇది ఉత్తర భారతదేశంలో వివాహం కాని, మరియు వివాహిత స్త్రీలు తమ భర్త, ప్రియుడు, స్నేహితుడు సంక్షేమం కోసం ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అలంకరణ తో శివపూజ చేసి , జల్లెడ లో చంద్రుని చూస్తారు. దీనిని తెలుగు వారు అట్లతద్ది అనికూడా అంటారు.
కానీ ఈరోజు మాత్రం చాలా ప్రత్యేకం. వంద సంవత్సరాల తరువాత ఈ రోజు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర లో ఉదయిస్తాడు. దీనిని శివ యోగం అంటారు. (హైదరాబాద్ సమయం రాత్రి 8:40 నిమిషాల నుంచి)
యడ్ల శ్రీనివాసరావు 1 November 2023, 8:40 PM.
No comments:
Post a Comment