శకునాలు - మూఢనమ్మకాలు
చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి.
కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు , జీవాలు మరియు భౌతిక శరీరాల వెలుపల , సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల శక్తి మరియు ప్రకంపనలు (vibrations) – దురదృష్టాన్ని తెస్తాయని మనం నమ్మకం కలిగి ఉండడం తో, ఆ భయం వలన బాధితులులా జీవిస్తాము . కాబట్టి , మనం వాటి నెగెటివ్ ప్రభావానికి లోనయ్యి మన జీవితంలో నెగెటివ్ పరిస్థితులను ఆకర్షిస్తాము .
చెడు శకునాలను మరియు మూఢనమ్మకాలపై నమ్మకం మన మనస్సులలో అనాది నుంచి చాలా లోతుగా పాతుకుపోయి ఉన్నాయి . అదే మన బలహీనత అని గ్రహించలేని స్థితి తో నేడు జీవిస్తున్నాము . కొన్ని వస్తువులను లేదా సంఘటనలను అదృష్టం లేదా దురదృష్టంతో కనెక్ట్ చేయడం వల్ల మనకు సహజంగా ఉన్న స్థితి , పరిస్థితుల కంటే కూడా అది మనల్ని బలహీనంగా తయారు చేస్తుంది. ఇది సత్యం.
1. మీ మూఢనమ్మకాలను సవాలు చేస్తే అవి మీ మనస్సులో ఉన్నాయని మీరు గ్రహిస్తారు. గ్రహల కదలికలు, వస్తువులు, పరిస్థితులు, తమ శక్తిని ప్రసరింపజేస్తాయి . అదే విధంగా మనుషులు కూడా తమ ఆలోచనల ద్వారా శక్తి ని ప్రకంపనల (vibrations) రూపేణా విడుదల చేస్తారు , ఇది వాస్తవం.
కానీ , ఇతర బాహ్య ప్రభావం నుంచి రిలీజ్ అయ్యే శక్తుల కంటే , మీ జీవితంపై మీ మనస్సు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన మనస్సును దృఢం గా ఉంచుకునే అభ్యాసం చేయాలి.
2. మీ ఆలోచనలు మీ భావాలుగా మారుతాయి. మీ భావాలు మీ వైఖరిని ఏర్పరుస్తాయి . మీ వైఖరి కార్యరూపం దాల్చుతుంది. పదే పదే చేసే కర్మలు అలవాటుగా మారతాయి. మీ అలవాట్లన్నీ కలిసి, మీ వ్యక్తిత్వం గా తయారు అవుతుంది . మీ వ్యక్తిత్వం మీ అదృష్టాన్ని సృష్టిస్తుంది. కాబట్టి, మీ ఆలోచనలు మీ అదృష్టాన్ని సృష్టిస్తాయి.
3. మీ ఆలోచనలు నెగెటివ్ గా, బలహీనంగా ఉంటే, బాహ్య శక్తులు మీ ఆలోచనలను మరియు ఫలితంగా మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి.
మీ ఆలోచనలు స్వచ్ఛంగా, పాజిటివ్ గా , శక్తిశాలి వైబ్రేషన్స్ కలిగి ఉంటే, బాహ్య అంశాలు మీ అదృష్టం పై ప్రభావం చూపవు. మీ లో ఉన్న నెగెటివ్ భావాలు (మైనస్ “-“) ఆలోచనలను మొదట మీ మనసు అంగీకరించ గలిగాలి. అంగీకరించినపుడు మనసు మొదట నిర్లిప్తత శూన్యం (జీరో “0” ) దిశగా అడుగులు వేయడం ప్రారంభిస్తుంది . శూన్యం నుంచి పాజిటివ్ భావాలు ( ప్లస్ “ + ” ) , ఆలోచనలతో ఎదుగుదల జరుగుతుంది మరియు అదృష్టం తయారవుతుంది .
4. మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోండి మరియు ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆలోచనలు మరియు భాషా పదాలతో మీరు చేసే పనులను ఆశీర్వదించండి. మీ స్వంత భావోద్వేగ ఫిట్ నెస్ , సంకల్పం, క్రమశిక్షణ మరియు పాజిటివ్ ఆధ్యాత్మిక ప్రయత్నాలు కావలసిన అదృష్టాన్ని మీ కోసం సృష్టిస్తాయి.
5. మెడిటేషన్ ద్వారా భగవంతునికి కనెక్ట్ అవ్వండి మరియు మీ మైండ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. శక్తిశాలి వైబ్రేషన్స్ తో , మీరు మీ మనస్సుకు యజమానిగా, మీ జీవితం మరియు పరిస్థితులపై మాస్టర్ అవుతారు. చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల భయాన్ని అధిగమిస్తారు . ఆనందం గా జీవిస్తారు. అందరికీ ఆనందం పంచుతారు .
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏.
యడ్ల శ్రీనివాసరావు 15 March 2026 , 9:30 PM.

No comments:
Post a Comment