యుగాది
• ఉగాది ఉగాది
యుగముకి జీవం పోసే ఆది .
• యుగములు నాలుగైనా
ఉగాదులు మాత్రం ఎన్నో . . . ఎన్నెన్నో…
• ఉగాది ఉగాది
యుగముకి జీవం పోసే ఆది .
• ఈ కాలం లోని సౌందర్యం
మనసు కోరుకునే ఔషధం .
• ఈ సమయం లోని సంతోషం
మనిషి అనుభవించే ఇంధనం .
• ఉగాది ఉగాది
యుగముకి జీవం పోసే ఆది .
• మామిడి చిగుళ్ళు
మది పచ్చదనానికి తోరణాలు .
• కోయిల సవ్వళ్లు
శ్రవణ సొంపుల తరంగాలు .
• ఉగాది ఉగాది
యుగముకి జీవం పోసే ఆది .
• యుగములు నాలుగైనా
ఉగాదులు మాత్రం ఎన్నో . . . ఎన్నెన్నో…
• భావోద్వేగాల సంబరం
షడ్రుచుల మేళనం .
• కొత్త ఆశల అంబరం
రాశిఫలాల రాజసం .
• పంచాంగ శ్రవణం
పంచభూతాల ఆశీర్వాదం .
• ఈ ఆచారాల సాంప్రదాయం
తెలుగు సంస్కృతి ఉల్లాసం.
• ఉగాది ఉగాది
యుగముకి జీవం పోసే ఆది .
• యుగములు నాలుగైనా
ఉగాదులు మాత్రం ఎన్నో . . . ఎన్నెన్నో…
• బుతువుల బుణానుబంధం
ఈ వసంతాల వైభోగం .
• ఉగాది ఉగాది
యుగముకి జీవం పోసే ఆది .
ప్రపంచ వ్యాప్తంగా
" గోదావరి గలగలలు " బ్లాగు ను
ఆదరిస్తున్న తెలుగు వారందరికి
నా హృదయ పూర్వక
కృతజ్ఞతలు 🙏
ఉగాది శుభాకాంక్షలు 💐 .
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 18 March 2026 , 9:00 PM.

No comments:
Post a Comment