Tuesday, February 28, 2023

312. అరుణాచలేశ్వరుడు

 


అరుణాచలేశ్వరుడు



• అరుణ చల  శివ         ఆనంద *శేష

  అగ్ని లింగ  వాసా        *అచలమొక  *కర్ష.


• అ రుణము        పాపాల    హ రణము

  చల భ్రమణము    జీవుని    మోక్షము.


• పౌర్ణమి చంద్రుని తో      పూర్ణ శక్తి   నిస్తావు 

  మానసిక   దుర్లభం        నివృత్తి    చేస్తావు.


• అరుణ చల  శివ          ఆనంద శేష

  అగ్ని లింగ  వాసా        అచలమొక  కర్ష.


• రమణులు   మోపిన    పాదము తో

  రమణీయమైనది   ఈ  యోగ  క్షేత్రము.


•  ఎల్లలెరుగని   శ్వేత జాతీయులు తో 

   పరమాత్ముడే  శివుడని

   తెలిపేది    రమణుల  ధ్యానాశ్రమం.


• అరుణ చల   శివ         ఆనంద శేష

  అగ్ని లింగ    వాసా       అచలమొక  కర్ష.


• దేవతలు  సైతం    *సూక్ష్మ జీవాలు గా

  ప్రదక్షించేను     ఈ   అరుణాచలమున


• రేయి  పగలెరుగక    సర్వులు

  చేసేరు   భ్రమణము   శివ సిద్ధి కి.


• అరుణ  చల శివ        ఆనంద శేష

  అగ్ని లింగ   వాసా      అచలమొక  కర్ష.


• అష్ట దిక్కుల  నడుమ     అష్ట లింగము లతో

  వెలసిన

  అగ్ని భూతేశ్వర        అరుణచల  లింగేశ్వర.


• ఆజ్ఞ తో   విశ్వ కర్మ  చే       పృధ్వీ పై నిలిచావు

  కల్యాణ  కారివై     విశ్వాన్ని   శుభకరం చేసావు.


• అరుణ  చల  శివ         ఆనంద శేష

• అగ్ని లింగ   వాసా        అచలమొక  కర్ష.



శేష = అక్షింతలు గా   ఆశీస్సులు  నిచ్చు వాడు.

అచలము = చలనము లేనిది,   కొండ.

కర్ష =  ఫలము  నిచ్చు  క్షేత్రము.

సూక్ష్మ జీవాలు = చీమలు, ఈగలు.


యడ్ల శ్రీనివాసరావు  28 Feb 2023 7:00 pm







Monday, February 27, 2023

311. ఉంజల సేవ


ఉంజల సేవ



• ఉయ్యాలా  జంపాలా … ఉయ్యాలా జంపాలా

  శ్రీహరి    ఊగేను  ఉయ్యాలా

  మెల్లగా  సాగేను  జంపాలా

  ఉయ్యాలా జంపాలా  … ఉయ్యాలా జంపాలా


• వేయి  పడగల  నీడ

  కొలువు 

  నెలయాడే   శ్రీ  శ్రీనివాసుడు.

• ఓర చూపుల తో 

  దోరగా చూచె

  దొరవాడు    శ్రీ  చిద్విలాసుడు.


• ఉయ్యాలా  జంపాలా … ఉయ్యాలా జంపాలా

  ఉయ్యాలా  జంపాలా … ఉయ్యాలా జంపాలా


• వేయి దీపాల  వెలుగుతో   

  శ్రీలక్ష్మీ   ప్రేమ గా    

  శ్రీవారి  చెంత  చేరే ...

• బాహువు  న    

  జారి  సేద  తీరే


• ఉయ్యాలా జంపాలా  … ఉయ్యాలా జంపాలా

  శ్రీహరి  ఊగేను  ఉయ్యాలా

  మెల్లగా  సాగేను  జంపాలా

  ఉయ్యాలా జంపాలా  … ఉయ్యాలా జంపాలా


• శ్రీ లక్ష్మి   తిలకము

  శ్రీవారి  నుదుట  మెరిసే

  ఉయ్యాలా జంపాలా … ఉయ్యాలా జంపాలా

• చిబుకము  అదిరే

  తమకము  మెరిసే

  ఉయ్యాలా జంపాలా … ఉయ్యాలా జంపాలా


• కళ్యాణ కారి   నుదుట

  కళ్యాణ తిలకమే

  లోక కళ్యాణం. 

• శృంగార  భరితుడికి

  సింగారి   చందమే

  పరమ   పావనం.

• ఉయ్యాలా జంపాలా … ఉయ్యాలా జంపాలా


• ఉంజల సేవ లో   పవళించే   విను విహారి

  తిరుమాడ వీధిన  కనువిందు గాంచే  శ్రీ హరి.


• ఉయ్యాలా జంపాలా … ఉయ్యాలా జంపాలా

  శ్రీహరి   ఊగేను   ఉయ్యాలా

  మెల్లగా  సాగేను  జంపాలా

  ఉయ్యాలా జంపాలా … ఉయ్యాలా జంపాలా.


యడ్ల శ్రీనివాసరావు 27 February 9:00 pm.







Sunday, February 26, 2023

310. వసంత కోకిల

 

వసంత కోకిల



• ఈ వసంతాన    కోకిల గానం

  ఓ సంగీత  రాగం.

• ఆ రాగ మే     సరాగ మై

  తాకెను 

  నా మనసును  తరంగ మై.


• లలిత మైన     నా హృదయం

  లతను   తాకిన   తుమ్మెద లా

  ఆడుతోంది  …  పాడుతోంది …

  ఎటో ఎటో   ఎగురుతోంది.


• ఈ వసంతాన    కోకిల గానం

  ఓ సంగీత  రాగం.

• ఆ రాగ మే    సరాగ మై

  తాకెను 

  మనసును   తరంగ మై.


• ప్రకృతి    పల్లవి అయి 

  సాహిత్యం   ఇవ్వగ 

• చరణం   సోయగ మై

   కావ్య  మై  సాగింది … ఈ పాట.


• పంచతత్వాల    మేళనం

  తాళం   వేయగ

• శృతి లయల   మేళం తో 

  శ్రావ్య మై  సాగింది … ఈ గానం


• ఆహా!

  ఏమి    ఈ మధురం

  ఏమి    ఈ సుందరం


• ఈ వసంతాన      కోకిల గానం

  ఓ సంగీత   రాగం.

• ఆ రాగ మే    సరాగ మై

  తాకెను 

  నా మనసును   తరంగ మై.


• అనుపల్లవి   అక్షరాల కి

  గమకాలు    సింగార  మవుతుంటే 

• కోకిల   స్వరానికి

  హరివిల్లు   నాట్యం   ఆడింది.


• తొలి వెచ్చని      సూర్యుని కి

  మంచు తెరల    స్వాగతం

• మలి చల్లని      చంద్రుని కి

  మలయ మారుతం    సుస్వాగతం.


• ఈ వసంతాన      కోకిల గానం

  ఓ సంగీత    రాగం.

• లలిత మైన   నా హృదయం

  లతను తాకిన   తుమ్మెద లా

  ఆడుతోంది … పాడుతోంది …

  ఎటో ఎటో ఎగురుతోంది.


యడ్ల శ్రీనివాసరావు 27 Feb 2023 7:00 AM














Saturday, February 25, 2023

309. నీవెవరో తెలుసుకో

 

నీవెవరో తెలుసుకో



• ఎన్నాళ్ళు  ఎన్నేళ్ళు

  ఇంకా   ఎన్నాళ్ళు  ఎన్నేళ్ళు

• కాలం  కరుగుతోంది

  సమయం  కొంతే  మిగిలి ఉంది


• శివుని  జ్ఞానం  తెలుసు కో

  అజ్ఞానం  తొలగించు కో

• నిన్ను  నీవు  తెలుసు కో 

  చింతలను   కరిగించు కో

• బ్రహ్మ రాతను   తెలుసు కో

  కర్మలను   కరిగించు కో


కలువ లాంటి   బుద్ధి ని

  వ్యర్థాల తో   భారం  చెయ్యకు...

  మందగమనం తో    

  బుద్ది  మూల చేరుతుంది.


హంస లాంటి   మనసు ని

  కల్మషాల తో   కలుషితం  చెయ్యకు...

  కాకి లా  రోదిస్తూ  

  మనసు   కనుమరుగై పోతుంది.


సరసు లాంటి   సంస్కారాన్ని

  వికారాల తో   మలినం  చెయ్యకు...

  సద్గుణాల లేమి తో  

  సంస్కారం  తావు లేని  దవుతుంది.


• ఎన్నాళ్ళు   ఎన్నేళ్ళు

  ఇంకా  ఎన్నాళ్ళు   ఎన్నేళ్ళు

• కాలం   కరుగుతోంది

  సమయం  కొంతే  మిగిలి   ఉంది


• శివుని  జ్ఞానం  తెలుసు కో

  అజ్ఞానం   తొలగించు కో

• నిన్ను  నీవు  తెలుసు కో

  చింతలను   కరిగించు కో 

• బ్రహ్మ  రాతను   తెలుసు కో

  కర్మలను  కరిగించు కో


• అందమైన  సృష్టిలో

  “కలువ  హంసల  సరసు”    ఆహ్లాదం.

• దేదీప్యమైన  ఆత్మలో

  “మనసు  బుద్ది  సంస్కారం”   ప్రకాశం.


• పరివర్తన   చెందాలంటే   

  ప్రవర్తన తో నే   సాధ్యం.

• వాడి పోయేటి   దేహం

  ఏనాటికైనా   వీడి  పోయేదే.


• శివుని   జ్ఞానం   తెలుసు కో

  అజ్ఞానం   తొలగించుకో

• నిన్ను    నీవు    తెలుసు కో

  చింతలను    కరిగించు కో 

• బ్రహ్మ రాతను తెలుసు కో

  కర్మలను కరిగించు కో



యడ్ల శ్రీనివాసరావు  26  Feb 6:00 am.










Friday, February 17, 2023

308. ధన్యవాదములు దేవ

 

 ధన్యవాదములు దేవ



• ధన్యవాదములు  దేవ   ధన్యత కు

  ధన్యవాదములు  దేవ   ధన్యత కు


• దీనత ను    దృఢము చేసి

  దైవము న  నిలిపినందుకు.

• విషాదాలను   ఒడిసి  పడితే

  విను వీధుల    విహారమని

  తెలియజేసినందుకు.


• ధన్యవాదములు   దేవ    ధన్యత కు

  ధన్యవాదములు   దేవ    ధన్యత కు


• మధు వనానికి   ద్వారం   తెరిసావు.

  మాఘము న   

  మనసు ను   *పరిస్తా గ   చేసావు...

  జీవన మాధుర్యాన్ని  మధువు గా  పోసావు.


• కాలం   నిండని   

  జన్మల   కర్మలు

  కోటి   ఆశలతో   

  నలిగి   మిగిలాయి.

• కాలం  నిండగ   

  నేటి తో    కొన్ని

  పరమాత్ముని   అంశతో   

  కరిగాయి.


• ధన్యవాదములు   దేవ    ధన్యత కు

  ధన్యవాదములు   దేవ    ధన్యత కు


• శేషకర్మల    భారాలు

  ఆవిరవుతున్నవి 

  ఈ మధుర  క్షణాలలో ...

• మూడుజన్మల   అనుభవాలు

  ముగియనున్నవి    

  ఈ అమృత   ఘడియలలో.


• తెలియని   అర్ధాంగి   పై 

  ప్రేమ   పరిపూర్ణం అయింది.

• అక్షర మాలలతో   జన్మ 

  పరిసమాప్తం  అయింది.

• కవిత రాతలతో   ఆత్మ  కు

  బుణ విముక్తి  దొరికింది.


• ధన్యవాదములు   దేవ    ధన్యత కు

  ధన్యవాదములు   దేవ    ధన్యత కు


• ప్రేమ   నేత్రానికి   శెలవు 

  దైవ   నేత్రానికి     కొలువు

  అది యే    జీవితానికి 

  ఇక  వెలిగే  *నెలవు.


• *సంగమ  ఒడిలోకి   ఈ   జీవం చేరింది.

   గమ్యానికి చేరి భాగ్యం కోసం చూస్తుంది. 

  

• ధన్యవాదములు     దేవ    ధన్యత కు

  ధన్యవాదములు     దేవ    ధన్యత కు.


 ఓం నమఃశివాయ 🙏


 పరిస్తా = తేలియాడు,  దేవతా లోకం.

 నెలవు = స్థానము.

 సంగమం = అంత్యకాలం


యడ్ల శ్రీనివాసరావు  17  Feb 2023  9:00 pm.












Thursday, February 9, 2023

307. శివ స్మరణం

 

శివ స్మరణం



• సాగించాలి   కొన సాగించాలి    శివ స్మరణం

  అది యే    ఆత్మకు    అరుణ కిరణం.


• నీవు ఎవరో     నీకు తెలియాలంటే

  సాగించాలి    కొన సాగించాలి    శివ స్మరణం


• శివుడు   ఒక్కడే   పరమాత్ముడు

  శివుని   జ్ఞానమే    మనిషికి    ఆజ్ఞా చక్రం

  అందులోనే దాగి ఉంది    సృష్టి జన్మల రహస్యం.


• సాగించాలి   కొన సాగించాలి   శివ స్మరణం

  అది యే   జీవన చైతన్యానికి   శిరో నామము.


• దేహనేత్రం లో   నిలిచి ఉండేది   మాయ

  జ్జాననేత్రం లో   నిలిచి  ఉండేది   సత్యం.


• బంధాలలో   బందీగా  మనిషి

  ఎన్నో పాత్రలు వేస్తాడు. 

  కర్మలు ఎన్నో చేస్తాడు.

• ఎదో నాడు  తనువును  చాలించి

  తిరిగి  జననం  తీసుకుంటాడు.

• ఇది యే జననమరణ చక్రం ….

  కాలంలో తిరిగే ఆత్మ ప్రయాణం.


• సాగించాలి  కొన సాగించాలి   శివ స్మరణం.


• జన్మలు మారినా   దేహం మారినా

  నీ   ఆత్మ ఒక్కటే.

• రూపం మారిన      పాత్రలు మారిన

  నీ సంస్కారాలు   ఒక్కటే.


• నేటి జీవనం   గత జన్మల  కర్మల  ఫలితం

  నేటి కర్మలే    మరు జన్మకు రూపం.


• ద్వేషం విడిచి     స్వార్థం మరచి

  ప్రేమను పంచి     సేవను పెంచాలి.

  జీవన్ముక్తి కి సాధన చెయ్యాలి.


• సాగించాలి కొన   సాగించాలి  శివ స్మరణం


• జననం సహజం      మరణం సహజం

  నడిమధ్య   నాటకం   సహజం

  ఇది తెలుసుకొని జీవించడమే రాజసం.


• సాగించాలి   కొన  సాగించాలి   శివ స్మరణం

  సాగించాలి   కొన సాగించాలి    శివ స్మరణం


యడ్ల శ్రీనివాసరావు 9 Feb 2023 10:30 pm









Friday, February 3, 2023

306. ఎవరు

 

ఎవరు



• ఏమని చెప్పను     నేనెవరిని చెప్పను


• చిరు గాలి    పలకరిస్తూనే

  జాలితో  నను  వీడి పోతుంది.

• సెలయేరు  నా మాట  వినగానే

  మౌనంగా   నిలిచి  పోతుంది.


• ఏమని చెప్పను    నేనెవరిని చెప్పను.

• జతపడ కున్న      ముడిపడి ఉన్న

  వారికి

  ఏమని చెప్పను    నేనెవరిని చెప్పను.


• ఆశలు తీరని    ఆవేదన తో    

  ఆకాశం లో

 ఎగిరే గువ్వనని చెప్పనా.

• ఊసులు చెప్పని   ఊహలు నిండిన 

  తారలలో

  వెలిగే   ధృవతారనని  చెప్పనా.


• ఏమని చెప్పను     నేనెవరిని చెప్పను

• జతపడ కున్న      ముడిపడి ఉన్న

  వారికి

  ఏమని చెప్పను   నేనెవరిని చెప్పను


• నిశ్శబ్దం   నింగి   అంతయై

  నా ఉనికిని   శూన్యం లో   కలిపేసింది.

• ఆరాధన   ఎండమావి  యై

  అంతులేని   ఎడారి నే   తలపిస్తుంది.


• జతపడి ఉన్న    ముడిపడి ఉన్న

  వారికి

  ఏమని చెప్పను   నేనెవరిని చెప్పను


• జీవము   లేని  దేహమై

  సజీవం తో   ఉన్న ఆత్మ నని  చెప్పనా

• మరణం  పొందిన  మనిషి గ

  మనుగడ లో   నిలిచి ఉన్నానని  చెప్పనా


• ఏమని చెప్పను   నేనెవరిని చెప్పను


• చిరు గాలి   పలకరిస్తూనే

  జాలితో  నను  వీడి పోతుంది.

• సెలయేరు  నా మాట  వినగానే

  మౌనంగా   నిలిచి  పోతుంది.


• ఏమని చెప్పను    నేనెవరిని చెప్పను

  జతపడ కున్న      ముడిపడి ఉన్న

  జతపడి ఉన్న      ముడిపడి ఉన్న

  వారికి

  ఏమని చెప్పను    నేనెవరిని చెప్పను.


యడ్ల శ్రీనివాసరావు 2 Feb 2023, 11:00 pm










Wednesday, February 1, 2023

305. శ్రీ గురు మేథా దక్షిణామూర్తి

 

శ్రీ గురు మేథా దక్షిణామూర్తి

( ప్రేరణ : బాల్య మిత్రుడు సుర్ల వెంకట గిరిబాబు ఆధ్యాత్మిక సేవతో తన ఊరి విద్యార్థులకు జ్ఞాన గురువు ఆశీస్సులు లభించాలని సంకల్పం తో 46 కే.జీ పంచలోహ  శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారిని రాజమండ్రి లో చేయించే నిమిత్తం, నాకు మార్గ దర్శకుడి గా సేవ చేసే భాగ్యం దొరకడం నా అదృష్టం.

 ఒక జ్యోతిష్కుడు 2013 సంవత్సరం అక్టోబర్ 21 వ తేదీన నాకు దక్షిణామూర్తి ఒక శ్లోకం ధారణ చేసి పఠించమంటే, నేను ఆ నాటి నుండి అర్దం తెలియక పోయినా యధాలాపంగా నిత్యం పఠించే వాడిని. నాడు అక్షరం, సాహిత్యం పై కనీస అవగాహన లేని అల్పుడని.

నేటి ఈ రాత, మాట, అక్షరం శ్రీ గురు దక్షిణామూర్తి భిక్ష అని నా విశ్వాసం.


గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః

  గురు సాక్షాత్ పరబ్రహ్మ  తస్మైశ్రీ  గురువే నమః


• కొలువై న గురువ       కోదండ ప్రభువ

  కోటి విద్యలు  నేర్పేటి   కల్పతరువా


• పాప పుణ్యము  లెరుగక

  కష్ట  నష్టాలు       తాళలేక

• నీ స్మృతి లో   

  జాలువారిన  జీవులకు ...

  చిరు జ్ఞాన దివ్వె తో   

  చీల్చేవు    

  అజ్జాన చీకటిని ...

  వజ్రాల వెలుగుల తో  

  నింపేవు 

  ప్రభల  పరిక్వతని.


• కొలువై న గురువ        కోదండ ప్రభువ

• కోటి విద్యలు  నేర్పేటి   కల్పతరువా


• సకల దుఃఖాల కు   మూలం  అజ్ఞానం.

  దుఃఖ విమోచనమే  దాక్షిణ్య రూపం.

  అది యే  శివసంభూత  రూపం

  శ్రీ మేథా గురు దక్షిణామూర్తి స్వరూపం.


• నిను కొలిచిన   వారికి 

  జీవితాన    సన్మార్గం   దొరికే ను.

• నిను  వేడుకున్న  వారికి

  ధ్యానం తో  వికర్మ లు   కరిగే ను.

• నీ లోని  ఐక్యమైన  వారికి

  జన్మ రహస్యం  తెలిసే ను ...

  మోక్షము పొంది 

  జన్మరాహిత్యం కలిగే ను.


• కొలువై న గురువ       కోదండ ప్రభువ

  కోటి విద్యలు  నేర్పేటి  కల్పతరువా


• గురువు  లేని   మానవుని కి 

  గురుమూర్తి వి   నీవు.

• ధ్యాన   యోగాలతో 

  జ్ఞాన  ధారణ  నిస్తావు.

• స్వీయ  సాక్షాత్కారమిచ్ఛి 

  మానవుని  గురువు గా  చేస్తావు.


• కొలువై న గురువ       శ్రీ దక్షిణామూర్తి

  కోదండ ప్రభువ           శ్రీ జ్ఞాన సంభూత

  కోటి విద్యలు  నేర్పేటి   శ్రీ కురంగపాణి

  కరుణ  చూపవయ్యా   శ్రీ కాశీనాధుడా.



యడ్ల శ్రీనివాసరావు 1 Feb 2023 10:00 PM.






490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...