ధన్యవాదములు దేవ
• ధన్యవాదములు దేవ ధన్యత కు
ధన్యవాదములు దేవ ధన్యత కు
• దీనత ను దృఢము చేసి
దైవము న నిలిపినందుకు.
• విషాదాలను ఒడిసి పడితే
విను వీధుల విహారమని
తెలియజేసినందుకు.
• ధన్యవాదములు దేవ ధన్యత కు
ధన్యవాదములు దేవ ధన్యత కు
• మధు వనానికి ద్వారం తెరిసావు.
మాఘము న
మనసు ను *పరిస్తా గ చేసావు...
జీవన మాధుర్యాన్ని మధువు గా పోసావు.
• కాలం నిండని
జన్మల కర్మలు
కోటి ఆశలతో
నలిగి మిగిలాయి.
• కాలం నిండగ
నేటి తో కొన్ని
పరమాత్ముని అంశతో
కరిగాయి.
• ధన్యవాదములు దేవ ధన్యత కు
ధన్యవాదములు దేవ ధన్యత కు
• శేషకర్మల భారాలు
ఆవిరవుతున్నవి
ఈ మధుర క్షణాలలో ...
• మూడుజన్మల అనుభవాలు
ముగియనున్నవి
ఈ అమృత ఘడియలలో.
• తెలియని అర్ధాంగి పై
ప్రేమ పరిపూర్ణం అయింది.
• అక్షర మాలలతో జన్మ
పరిసమాప్తం అయింది.
• కవిత రాతలతో ఆత్మ కు
బుణ విముక్తి దొరికింది.
• ధన్యవాదములు దేవ ధన్యత కు
ధన్యవాదములు దేవ ధన్యత కు
• ప్రేమ నేత్రానికి శెలవు
దైవ నేత్రానికి కొలువు
అది యే జీవితానికి
ఇక వెలిగే *నెలవు.
• *సంగమ ఒడిలోకి ఈ జీవం చేరింది.
గమ్యానికి చేరి భాగ్యం కోసం చూస్తుంది.
• ధన్యవాదములు దేవ ధన్యత కు
ధన్యవాదములు దేవ ధన్యత కు.
ఓం నమఃశివాయ 🙏
పరిస్తా = తేలియాడు, దేవతా లోకం.
నెలవు = స్థానము.
సంగమం = అంత్యకాలం
యడ్ల శ్రీనివాసరావు 17 Feb 2023 9:00 pm.
No comments:
Post a Comment