చెలిమి చెంత చింత 😢 ఏల ఈశ్వరా!
• అక్కడ ఇక్కడ ఎక్కడ ఏలనే ఈ చింత.
• చింతలే లేని ఈ చెలిమి
ఏ చెలిమికి చేదయ్యెనో ?
ఏ చెలిమికి చేటయ్యెనో ?
ఏ చెలిమి చెంత చిగురించెనో
• ఓ ఈశ్వరా…. పరమేశ్వరా!
⭐⭐⭐
• చెలిమిల సమూహం సందడికి, సవ్వడికే కదా.
• వినోదం కోసమే ప్రయాస కాని,
వివాదాలు కోసం కాదు,
గుర్తింపు కోసం అంతకన్నా కాదు.
ఏమిచ్చినా నీ భిక్షే
ఏం తీసుకున్నా మా రక్షణకే కదా! ఓ ముక్కంటి.
• చెలిమి కాని చెంత చేరువగా నుండి
చేదునెంత కాలం భరించవలే ఈశ్వరా!
• ఒక చేదు (తో) చెలిమి నాకైన సమ్మతమే
కానీ
“చేటు” నావారికైతే రక్షణేది ఈశ్వరా!
⭐⭐⭐
• ప్రక్షాళనే పునరుత్తేజమంటావు
నిను శిరసావహించడమే శరణ్యం.
• ఆడించెడి నీకు ఏ ఆట ఎందుకో
తెలియదా? ఓ మౌన ముని.
• చింతకు మూలం
చెలిమి చెంత చిగురించే … నా ప్రేమా …
నా రూపమా … నా రాతలా … నా చేతలా…
నా మాటలా … నాలో నాకు కానరాని
అహంకారమా?
• ప్రక్షాళన ఆట ఆడేవారికా ?…లేక
నీలో కలుపుకున్న నాకా ?
ఈశ్వరా …. ఓ విభుథేశ్వరా!.
• కొందరి చెలిమి ల నిందలకు
నను నెలవు చేసితివి
నేనేమి టో నీకెరుగదా ?
నా ద్రుష్టి ఏమిటో నీకు తెలియదా ?
ఓ ధ్యాన మహర్షి
దుఃఖం తో సంచిత కర్మలను కరిగిస్తున్నాను
అంటున్నావు.
సహనం సన్నగిల్లుతుంది స్వామి
ఈ “కలి” మాయా కల్లోలం లో నేనుండలేను
నీ ధూళిలో నను రేణువు గాంచు భస్మేశ్వరా!
• నీ చెంత నా ఈ చింత …ఈశ్వరా… పరమేశ్వరా!
⭐⭐⭐⭐
స్నేహమంటే కాల క్షేమమే కాని కాల క్షేపం కాదు.
⭐⭐⭐⭐
చింత = సమస్య.
చెంత = దగ్గర, వద్ద.
చెలిమి = స్నేహితులు, స్నేహం.
ప్రక్షాళన = సరిదిద్దు కోవడం.
సమూహం = స్నేహ బృదం.
సంచిత కర్మ =పూర్వజన్మ లోని పాపపుణ్యాలు
యడ్ల శ్రీనివాసరావు. 16 APR 21 9:00 pm
No comments:
Post a Comment