మహిళ దినోత్సవం సందర్భంగా ....
మగాడి జీవితంలో తల్లిగా , సోదరిగా ,భార్యగా ,ఆత్మ బంధువు గా ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్త్రీ ని, సూర్యుడు , చంద్రుడు ,పంచభూతాలైన భూమి, నీరు , వాయువు, అగ్ని ,ఆకాశం మరియు ప్రకృతి తో కలిపి మేళవించి.....చిన్నపాటి ఆలోచనతో మహిళా దినోత్సవ సందర్భమును అనుసరించి రాసిన ఈ చిన్న కవితా రచన, ప్రతి మహిళకు అంకితం .
• మగువా ఓ మగువా... మనసును కరిగించి, మనిషిని మురిపించి, మగడిని గెలిపించే తెగువ గల సుందరివి...
• పచ్చా పచ్చని చేలు పరవశించెనే, పలకరించెనే నిను చూసి...
• ఎర్రా ఎర్రని సూర్యుడు మసకబారినే, మూలకేగేనే నిను చూసి...
• తెల్లా తెల్లని చంద్రుడు చెంతచేరెనే, సేదతీరేనే నిను చూసి...
• ఓ వదనా... చంద్రవదనా...
• కళకళలాడే కలువవా.....కనకాంబరాల కోమలివా..
• భువిలో వెలసిన భువనసుందరివి "జానకివి".
• జలమున జగముకు జననివి "గంగవి".
• ఉచ్చ్వాస నిచ్చ్వాస లను శాసించే వాయువుకి "అంజనివి".
• జీవన గతి కి పురోగతియైన అగ్నికి "స్వాహాదేవివి".
• అనంతమైన ఆకాశంలో తారల తళుకుల "తరుణివి"..
మీ బాల్య మిత్రుడు @ YSR, 8 Mar 21, 5:00 am
No comments:
Post a Comment