🌹 లత లలిత లావణ్యం 🥀
• ముత్యాల మురిపెంతో మురిపిస్తావు.
• రత్నాల వదనంతో మెరిపిస్తావు.
• అలుపెరుగిన మనిషికి
అలుపెరుగని మనసుతో….
• లలితంగా లాలిస్తావు
లతలతో ఆడిస్తావు…
• ఓ కలువ కుసుమాంబరి.
⭐⭐⭐⭐
• నీ అరచేతి పిలుపే సొగసైన వలపై
• నీ నిట్టూర్పు నీడలో సేదతీరెనే
• ఓ పరిమళాల పారిజాతమా.
⭐⭐⭐⭐
• నీ చెక్కిలి చిన్న బోయినా
చిబుకం బుంగ పోయినా
• కలవరపడినే తుమ్మెదలు
కదమున పడెను కిన్నెరలు
• ఓ వెన్నెల విహారి.
⭐⭐⭐⭐
• నీ మేని ఛాయ …. మనో వికాసం.
• వాలుజడ విన్యాసం …. నా హ్రుదయ తరంగం.
• ఓ సప్త వర్ణాల స్పటికమా.
⭐⭐⭐⭐
• నీ ముంగురులు తాకిన గాలికి
సిగ్గాయెనే … నీ కేశములు కానందుకు
• అది చూసి అసూయ చెందాను
నేను గాలిని కానందుకు.
• ఓ వారిజాక్షి.
YSR 13 Apr 21 9:00 pm
కదము = గుర్రము సహజ నడకకు విరుద్ధమైన, అపసవ్యమైన
కిన్నెర = వీణా వాద్యం
No comments:
Post a Comment