కౌమారం…. నుండి…యవ్వనం
• మారం…..కౌమారం….
• చూపుల్లో సుకుమారం…. మాటల్లో మమకారం…
• మారం…మారం…..మేం మారం.
• యవ్వన బాటలో ఉర్రూతలూగే బాబు…ఓ చిట్టి బాబు.
• నీ లేత ముఖము చూసి అమాయకమే సిగ్గు పడుతుందట……నీ నడత చూసి పచ్చని చెట్లే పేరంటమవుతాయట.
• నీ దర్పం చూసి రామచిలుకలే నాట్య చేస్తున్నాయి……ఓ బాబు.. చిట్టి బాబు…. పదహారణాల బుజ్జి బాబు.
• చిర్రుబుర్రుల భావాలు, చెట్టాపట్టాల స్నేహాలు విందయ్యెను…కడుపునింపెను.
• ఊసులే మాటలయ్యెను….. మాటలే పలుకులయ్యెను…… పలుకులే ప్రాణమయ్యెను, నీ ప్రాయానికి….ఓ బాబు ..బుజ్జిబాబు…
• చెదరని క్రాపును చెక్కుతూ …. ముఖానికి చేతి రుమాల లో పౌడరు పూస్తూ…. ఓరకంట చూసే ఓ బాబు….ఎవరి కోసము……ఎందుకోసము….. బాబు.
• రంగుల ఎంపిక కోసమా…..ఇంద్రధనుస్సు వర్ణాల కోసమా….గలగలలాడే కాలిమువ్వల సెలయేరుల సవ్వడి కోసమా…..
• కనిపించే రంగుల కన్నా, కనిపించని రంగుల కోసం …అర్రులు చాస్తావు ఎందుకు ఓ బాబు…చెప్పు బాబు…బుజ్జి బాబు….నా చిట్టి బాబు.
• నిలవని పాదం నీ నైజం, నింగికెగసే మనసు నీ మనసు నీ సొంతం.
• శోధించే కన్నులు నీ వయనం, తడబడే పెదవులు నీ పరువం.
• నీ స్పర్శకు ఎన్నో గులాబీలు ఎదురు చూసెనే, ఆశ చెందెనే…… (వాటి) ముళ్లు కూడా పానుపై పిలిచెనే బాబు…. ఓ బాబు…ఎందుకు బాబు….నూనూగు మీసాల ప్రవరుడా……ఓ భవిష్య వరుడా(పెళ్లి కొడుకా)!
YSR 20 Apr 21 11:00 pm
No comments:
Post a Comment