Saturday, April 30, 2022

163. కార్మికులం…మేం…శ్రామికులం

 

కార్మికులం…మేం…శ్రామికులం


• హైలేస్సో…హైలెస్సా....హైలేస్సో హైలెస్సా….

   అహు ఆహు ఆహు…

• కార్మికులం…. మేము కార్మికులం…

  మా కులమే కర్మ కులం.

• శ్రామికులం…. మేము శ్రామికులం….

  మా కులమే శ్రమ కులం.

• పుచ్చలపల్లి వారసులం….

  కంకి కొడవలి సాయుధులం.

• మన్నును నమ్మిన మనుషులం ….

  మోసం తెలియని మనసులం.


కోరస్: ఎన్ని మార్పులొచ్చి….ఎంతెంత మారినా.…

   మేము లేని చోట పనికి లోటాయెనే.

• ఆహు ఆహు ఆహు….

  హైలెస్సో హైలెస్సా హైలేస్సో హైలెస్సా


• కండనమ్ముకొని కట్టెలెత్తుతాం….

• కడుపు చంపుకొని నీరు తాగుతాం.

• ఆహు ఆహు ఆహు.


• కాలమెటు పోతే అటు పాకుతాం….

• నిలువలేక పోతే కూలి నాలై పోతాం.

• ఆహు ఆహు ఆహు.


• గంజి కూడు కోసం గునపాలు ఎత్తుతాం….

• గూడు నీడ కోసం గుడిసెలో నిదరవుతాం….

• ఆహు ఆహు ఆహు.


• నాణ్యం లేని బతుకుకి బానిసలవుతాం….

• నాణేల కోసం నరనరాలకు నరకం చూపిస్తాం.

• ఆహు ఆహు ఆహు.


• ఉన్నోల సేవలకు జై జై లు కొడతాం....

• శుంఠల వంచనకు ఛీ ఛీ లు పెడతాం

• ఆహు ఆహు ఆహు.


• చెప్పు లేని పాదాలు చిందులతో పరిగెడతాయి....

• చెప్ప లేని పదాలు కంఠంలో అడుగిడతాయి.

• ఆహు ఆహు ఆహు.


• కార్మికులం…. మేము కార్మికులం…

  మా కులమే కర్మ కులం.

• శ్రామికులం…. మేము శ్రామికులం….

  మా కులమే శ్రమ కులం.

• హైలేస్సో…హైలెస్సా....హైలేస్సో హైలెస్సా….

  అహు ఆహు ఆహు…


కోరస్ : ఎన్ని  మార్పులొచ్చి.. ఎంతెంత మారినా…

   మేము లేని చోట పనికి లోటాయెనే

• ఆహు ఆహు ఆహు….

   హైలెస్సో హైలెస్సా హైలేస్సో హైలెస్సా


యడ్ల శ్రీనివాసరావు 1 May 2022 , 11:30 AM.



162. తపతిని....ఓ తపతిని

 

తపతిని…ఓ తపతిని


• తపతిని….ఓ తపతిని….నా తలపుల తరంగిణి.

• తపతిని….ఓ తపతిని….నా వలపుల వరూధిని.


• కలలోని కావ్యం కనులు దాటి…..

   ఆయెను ఇలలోని నవ్యం.

• కలలో  తోడు జాబిలి రాగా….

   కమలం వికసించెను.

• ఇలలో  నీడ నీవు కాగా....

   సకలం  సుందరమాయెను.


• తపతిని….ఓ తపతిని….నా తలపుల తరంగిణి.

• తపతిని….ఓ తపతిని….నా వలపుల వరూధిని.


• ఎదలోని భవ్యం అసువు దాటి….

   ఆయెను మదిలోకి  సవ్యం.

• అసువు తోడు అమరం కాగా….

   బంధం సంతసించెను.

• మదికి నీడ నీవు రాగా....

  నిఖిలం నందనమాయెను.


• తపతిని….ఓ తపతిని….నా తలపుల తరంగిణి.

• తపతిని….ఓ తపతిని….నా వలపుల వరూధిని.


• అందెల సందడి కలలో వెంబడి

• వసంత భోగము ఇలలో కనబడి

• నవ్వుల సవ్వడి ఎదలో వినపడి

• ఊహల ఒరవడి మదిలో తడబడి


• కల ఇలయై….

• జాబిలి నీవై….

• కావ్యమే నవ్యమవుతున్న వేళ….


• ఎద మదియై….

• అమరం నీవై....

• భవ్యమే సవ్యమవుతున్న వేళ….


• నా తపతికి నేనే వరుడుని….సంవరుడిని.

• నా వరూధికి నేనే వరుడిని….ప్రవరుడిని.


• తపతిని….ఓ తపతిని….నా తలపుల తరంగిణి.

• తపతిని….ఓ తపతిని….నా వలపుల వరూధిని.


యడ్ల శ్రీనివాసరావు  1 May 2022, 2:00 AM.


తపతి = సూర్యుని కుమార్తె, దేవత.

కావ్యం = కవికృత గ్రంథము

నవ్యం = రూపాంతరం, కనపడునది, కొత్తది.

భవ్యం = శుభము.

సవ్యం = అనుకూలము

అసువు = ప్రాణం.

అమరం = మరణం లేని

నిఖిలం = సమస్తం

నందనం = ఇంద్రుని ఉద్యానవనం.

అందెలు = గజ్జెలు.

సంవరుడు = తపతి భర్త.

ప్రవరుడు = వరూధిని భర్త.




Thursday, April 28, 2022

161. పయనం...ఈ పయనం

 

పయనం…ఈ పయనం


• పయనం…. ఈ పయనం…

• సాగే జీవన పయనం

• ఊగే ఊహల శయనం

• ఆశ నిరాశల లోలకం

• దాత విధాతల కారకం


• పయనం…ఈ పయనం

• ఎల్లలు ఎరుగని పయనం

• కల్లోల కడలికి వయనం

• మానవ సరళికి గమనం

• మనసు వలపుకి చలనం


• పయనం…ఈ పయనం

• ఆది అంతాల  నాటకం

• సత్య అసత్యాల బూటకం

• నీతి అవినీతుల  పాటకం

• మంచి చెడుల కాటకం


• పయనం…ఈ పయనం

• లోక అలోకాల  సంధానం

• పాప‌ పుణ్యాల  సావధానం

• జనన మరణ  సాగరం

• ఆత్మ పరమాత్మ  శోభనం


యడ్ల శ్రీనివాసరావు 27 April 2022, 9:40 pm.






Tuesday, April 19, 2022

160. లాహిరి లాహిరి లాహిరి లో

 

లాహిరి లాహిరి లాహిరి లో


• ఏమిటో అసలేమిటో….

   నీ మేని సౌందర్యమేమిటో.

• ఏమిటో అసలేమిటో….

   నీ చూపు లావణ్యమేమిటో.

• ఏమిటో అసలేమిటో....

   నీ నవ్వు సాహిత్యమేమిటో.

• నవ్వుల చూపుల వెనుక.... 

   పువ్వుల మోమాటమేమిటో.


• ఎవరిని అడగాలి….ఏమని అడగాలి.

• నా మదిలో మెదిలే ప్రశ్నకి జవాబు….

   ఎక్కడ వెతకాలి.


• ఏమిటో అసలేమిటో….

  నీ మేని సౌందర్యమేమిటో.

• ఏమిటో అసలేమిటో….

   నీ చూపు లావణ్యమేమిటో.


• అటుగా పోతున్న హరివిల్లునడిగితే

• దివి లోని తాను భువి లోని నీవేనని

• తన లోని వర్ణాలు నీ లోని సువర్ణాలనంటొంది.


• ఇటుగా వస్తున్న రాయంచనడిగితే

• కల లోని తాను ఇల లోని నీవేనని

• వలపైన చూపుకు నునుపైన రూపు నీవంటొంది.


• నీ కోసం అంటుంటే....నా మనసు వింటుంటే

• ఎప్పుడు చెప్పాలి...

  ఏమని చెప్పాలి...

  నీ తో ఎలా చెప్పాలి.


• ఎవరిని అడగాలి….ఏమని అడగాలి.

• నా మదిలో మెదిలే ప్రశ్నకి జవాబు...

  ఎక్కడ వెతకాలి.



• ఏమిటో అసలేమిటో….

  నీ నవ్వు సాహిత్యమేమిటో.

• నవ్వుల చూపుల వెనుక….

   పువ్వుల మోమాటమేమిటో


• అటుగా దాగిన ముత్యమునడిగితే

• తన లోని శాంతం నీ లోని మౌనమని

• సొగసైన నవ్వుకు వెలుగై నీవే సాహితివంటొంది.


• అటు ఇటు నిండిన ప్రకృతినడిగితే

• తన లోని అందం నీ లోని చందమని

• పువ్వుల వర్షం నీ మేని చూపుకు హర్షమంటొంది.


• నీ కోసం అంటుంటే...నా మనసు వింటుంటే

• ఎప్పుడు చెప్పాలి...

  ఏమని చెప్పాలి...

  నీ తో ఎలా చెప్పాలి.


• రాయంచ = రాజహాంస


యడ్ల శ్రీనివాసరావు 19 ఏప్రిల్ 2022 3:00 pm.








Saturday, April 16, 2022

159. ముక్కు పుడక

 

ముక్కు పుడక



• ముక్కెర…ఓ ముక్కెర…
• మనసును దోచిన ముక్కెర.
• చెలి ముఖమున చక్కని చుక్కలా
• ముక్కెర….ఓ ముక్కెర.

• కనుల ఎదుట కనకమా
• కోమలి చూపుకు కాంచనమా
• ఎగసిన శ్వాసకి కుసుమమా
• సొగసున మేనికి ఆభరణమా

• ముక్కెర…ఓ ముక్కెర
• మగువను వలచిన ముక్కెర
• మనసును దోచిన ముక్కెర

• తళ తళ మెరిసే తరుణికి
• మిల మిల మెరిసే పిందె వై
• ముఖమున ఛాయకు అందె వై
• చెక్కిలి చెంతన పులకింత వై

• చూపులకందని చురకత్తెవి….
• మాటలకందని గమ్మత్తువి…
• ముక్కెర…ఓ ముక్కెర
• మనసుకి మెచ్చిన ముక్కెర

• సూదంటి ముక్కు కి భరణమై
• వెలుగంటి మోము కి కిరణమై
• నాసిక సిగ కై బిగిసిన అక్కర
• చెలి ముక్కును తాకిన ముక్కెర

• ఉచ్ఛ్వాస నిచ్చ్వాసా ల నడుమ
• సువాసనలను స్వగతిస్తూ
• నిను మననం చేస్తుంటే…అయ్యింది చక్కెర
• మనసంతా అయ్యింది చక్కెర.
• తనువంతా అయ్యింది ఉక్కిరి బిక్కెర.

• ముక్కెర ఓ ముక్కెర
• మనసును దోచిన ముక్కెర
• మగువను వలచిన ముక్కెర
• చెలి చెక్కిలి చెంతన చుక్కలా
• ముక్కెర ఓ ముక్కెర.
• చెలికాడి మనసుకు కొక్కెర.



*అక్కర = సంగమం, కలయిక.
*కొక్కెర = కొంగ, వలపు ముడి.

యడ్ల శ్రీనివాసరావు, 15 ఏప్రిల్ 2022 11:00 pm












Friday, April 15, 2022

158. ప్రేమ పల్లకి


ప్రేమ పల్లకి


• ఆకాశం వర్షించెనే….ఆలాపన హర్షించెనే

• ఎదలోతులు శృతిమించినే….మన ప్రేమే చిగురించెనే

• ఇది ఏ సంతమో….ఇది ఏ వసంతమో.

• ఇది ఏ బంధమో…. ఇది ఏ అనుబంధమో.


• చెలి…చెలి…సుహాసిని…చిరుమంద హ సుభాషిణి.

• నిజంగా ఈ ప్రేమని….తపించని…జన్మని.


• ఆకాశం వర్షించెనే….ఆలాపన హర్షించెనే

• ఎదలోతులు శృతిమించినే….మన ప్రేమే చిగురించెనే

• ఇది ఏ సంతమో….ఇది ఏ వసంతమో.

• ఇది ఏ బంధమో…. ఇది ఏ అనుబంధమో.


• నా తొలిప్రేమ కి నీ నవ్వులు బోణీ కొడితే.

• తొలకరి నీ చూపులే ఆశకు శ్వాసను అందిస్తుందే.


• నా ఉహల సుందరి కనుల ముందే కనపడుతుంటే

• ఈ పచ్చని పైరులన్ని చిరు తోరణాలై పలకరించెనే.


• ప్రతి సాయంత్రం సాయంతో మన పయనం సాగింది.

• నిశి రాతిరిలో యమ యాతనతో చెలి స్నేహం కోరింది.


• ఈ చిరు జల్లులే తలంబ్రాల ధారలాయే.

• సిరులై చిరుగాలులే ఏడడుగుల దారి చూపే.


• నా అడుగుకు మడుగై, గొడుగు నీవై, నీడై ఉంటే

• నీవడిగే మనవులే ఏదైనా గాని తీరుస్తానే.


యడ్ల శ్రీనివాసరావు 15 ఏప్రిల్ 2022 , 10:00 am.





Saturday, April 9, 2022

157. పంచభూతాల పరమాత్మ _ ఓం శాంతి

 

పంచభూతాల పరమాత్మ 

• బాబ…ఓ బ్రహ్మబాబ…. చూస్తున్నాను

• ఎదురు చూస్తూ నే ఉన్నాను.

• చూస్తున్నాను…

• చూపునే చరమగీతము గా చేసి

• ఎదురు చూస్తూ ఉన్నాను.


• నీ దర్శన భాగ్యానికై….

• మనసును తైలము చేసి…

• కనులను ప్రమిదలు గా చేసి

• ఎదురు చూస్తూ ఉన్నాను.


• నీ స్మరణ చైతన్యం..

• నాలో అణువణువును స్పృశి యిస్తూ ఉంటే…

• సెలయేటి నీటినై జారుతూ ఉన్నాను.


• నీ కారుణ్య వర్షానికి

• నా లోని క్రోధాగ్ని దహనం అవుతూ ఉంటే…

• నందనవనమున గాలినై తేలి ఆడుతూ ఉన్నాను.


• బాబ…చూస్తూ ఉన్నాను…

• నిను కనులారా చూడాలని….

• ఎదురు చూస్తూ ఉన్నాను.


• నీ సహనశీలత కి

• నా మనసు లోని చంచలనాలు ధృఢమైన మైనముగా మారి…

• స్థిరమైన భూమి గా ఓరిమి చలనమ తో ఉన్నాను.


• నీ జ్ఞాన భాగ్యానికి

• నా లోని ఇంద్రియాలు, వికర్మలను సకర్మలుగా చేస్తూ ఉంటే….

సూర్యుడి వలె తేజం తో ఉదయిస్తూ ఉన్నాను.


• బాబ…చూస్తూ ఉన్నాను…

• నిను మనసారా పొందాలని….

• ఎదురు చూస్తూ ఉన్నాను.


• నీ రాజ యోగానికి

• నా ఆలోచనల కడలి ఆవిరై , మేఘాల వలె విహరిస్తూ ఉంటే…

ఆకాశమను సామ్రాజ్యానికి రాజునై…రారాజు నై ఉన్నాను.


• బాబ….ఓ బ్రహ్మబాబ…

• నీ దర్శన భాగ్యానికై….

• మనసును తైలము చేసి…

• కనులను ప్రమిదలు గా చేసి

• ఎదురు చూస్తూ ఉన్నాను.


యడ్ల శ్రీనివాసరావు 9 ఏప్రిల్ 2022 , 10:30 pm.




Friday, April 1, 2022

156. ఉగాది ఉషోదయం

 

ఉగాది ఉషోదయం


• సుప్రభాత వేళ…

• జాబిల్లి అలసి ఉన్న వేళ.


• చిరునవ్వుల తో చీకటిని చీలుస్తూ….

• భానుడు  బంగారం లా మెరుస్తున్న వేళ.


• నల్లని కొకిల కంఠంలో.…

• సెలయేరు రాగమై జారుతు పాడుతు ఉంటే…


• ఊరందరికీ శ్రవణా ఆనందం…

• కానీ   నా  “నందిని"  మనసుకి...

• అంతకు మించిన సంతోషం.


• వేపపువ్వు వయ్యారం తో…

• మావిచిగురు సింగారం లా…

• చెరుకు లాంటి శృంగారం తో…

• కలబోసిన కాదంబరివి….

• నువ్వే నా…ఆ నువ్వేనా….

• నీ నవ్వేనా….ఆ నువ్వేనా…..

• నా జీవన ఉగాది కి తొలి కిరణం…..నువ్వేనా.


• ఉప్పు లాంటి ఉత్సాహంతో…

• పులుపు లోని లొట్టలు వేస్తూ…

• మిరప లాగ మిరుమిట్లు గా చూస్తూ…

• కేరింతలు వేస్తావు…

• నీ పట్టు పావడాని ఉక్కిరిబిక్కిరి చేస్తావు.


• నువ్వేనా…ఆ నువ్వేనా….

• నా జీవన కిరణం నువ్వేనా.


• ప్రకృతి లో అందాలకు….

• పట్టుగొమ్మవి నువ్వే అయితే.

• పల్లెలోని పక్షులు అన్నీ….

• నీకు దాసోహం అంటున్నాయి.


• కాలి పట్టీలను తాకిన నీ పట్టు పరికిణీ

• పదనిసలు పాడుతూ ఉంటే...


• నీ అడుగుల  సవ్వడి కి...

• ధరణి దరహాసం చిందుస్తూ ఉంది.


• నీ గాజుల సవ్వడి కి….

• గోరింకలు గుసగుసలాడుతూ ఉంటే...


• నీ చెంపను  తాకిన  స్వేదము  ను

• ఆవిరి చేసేందుకు చల్లని పైరు గాలి

• ఆరాటం పడుతూ ఉంది.


• నిను చూసిన ఆ నిమిషం

• నా లో ని  సంతోషానికి అర్దం తెలిసిందే.


• నువు నా ఎదురుగా  ఉంటే

• ఉగాదే….ప్రతి రోజూ ఉగాదే...

• ఈ జన్మంతా నాకు ఉగాదే...

• ఓ నందిని…నా నందిని…ఆనందిని.


యడ్ల శ్రీనివాసరావు 1 ఏప్రిల్ 2022 10:00 pm







155. ఉగాది శుభకృత్తు - 2022

 

ఉగాది శుభకృత్తు - 2022





• వచ్చిందోయ్…. వచ్చింది…

• యుగ యుగాల ఆది వచ్చిందోయ్…

• సంబరాల నే తెచ్చింది….

• సంతోషాలను ఇచ్చింది.


• చైత్రమాసమున చిగురించే….

• ప్రకృతి చిగురులకు పునాది….

• ఈ …ఉగాది…..యుగ యుగాల ఆది.


• వసంతమున వెల్లువిరిసే….

• నూతన భావోద్వేగాల విహరమే….

• ఈ…ఉగాది.

• వచ్చిందోయ్…. వచ్చింది.

• సంబరాల నే తెచ్చింది…

• సంతోషాలను ఇచ్చింది.


• తియ్యని మనసులకి…

• పుల్లని సొగసుల తో,


• వగరు వలపులకి…

• కొరకొరలాడే కారం తో,


• లవణమంత లావణ్యం తో

• కమ్మని రుచుల సంబరమే…ఉగాది.

• యుగ యుగాల ఆది.


• తెచ్చిందోయ్…. తెచ్చింది.

• సంతోషాలను తెచ్చింది.


• కోయిల కమ్మని రాగాలు….

• కొత్తపుంతలు తొక్కుతు ఉంటే.

• మామిడి పిందె కు సిగ్గేసి….

• ఊహూ…ఊహూ...గారాలు పోతుంది.


• పక్షుల పిలుపుల రాగాలే….

• ప్రకృతి సిగలో మల్లెలు గా…

• సై అంటున్నవి…

• సై సై అంటున్నవి.


• పచ్చదనం లోని పరువాలు…

• పరికిణీ లలో పరిగెడుతున్నాయి.


• శుద్ధ పాడ్యమి తోరణాలే…

• పండుగ తలపుల ఊసులతో….

• ఉగాది తలుపులు తెరిచింది….

• మురిపాలే నింపింది.


• వచ్చిందోయ్…వచ్చింది.

• యుగ యుగాల ఆది…ఉగాది..

• సంబరాలనే తెచ్చింది….

• సంతోషాలను నింపింది.


• శిశిరం రాల్చే ఆకు వలే…

• శిధిలమైనది నా దుఃఖం.

• వసంతం తెచ్చే వెలుగు వలె…

• వెల్లువిరిస్తోంది నా తేజం.


• వచ్చిందోయ్…వచ్చింది.

• యుగ యుగాల ఆది…వచ్చింది

• సంబరాల నే తెచ్చింది….

• సంతోషాలను నింపింది.


యడ్ల శ్రీనివాసరావు 1 ఏప్రిల్ 2022 3:00 pm .


481. పరిమళ భాష

  పరిమళ భాష • ఏమిటో     ఈ  భాష   ఎద కే    తెలియని   ఆశ.   అనుభవం  లేని   యాస   సృష్టి   మూలానికి    శ్వాస. • అక్షరాలు   ఉండవు  కానీ   భావం ...