పరమాత్మ ప్రేమ
• ప్రేమ కై పరితపించే ఓ పసివాడు.
కాల మే కనికరించే ఈనాడు.
• ఆ పసి మనసును చూశాడు
పరమాత్మ నేడు.
• ఆత్మీక ప్రేమ తో
తన ఒడికి చేరదీశాడు.
• దేహపు ప్రేమ కర్మ బుణమని
దేవుని ప్రేమ కర్మాతీతమన్నాడు.
• బంధాల ప్రేమ అశాశ్వతమని
పరమాత్మ ప్రేమ శాశ్వతమని అర్దం చేశాడు.
• ప్రేమ కై పరితపించే పసివాడు.
కాల మే కనికరించే ఈనాడు.
• ఆ పసి మనసు ఆలన విన్నాడు.
పరమాత్మ యే పాలన చేశాడు.
• దేహపు ప్రేమ భ్రాంతి అని
దేవుని ప్రేమ మోక్షం అన్నాడు.
• పసివాడి భాగ్యానికి ప్రకృతి పరవశించెను
తన జతలో తోడుగా చోటు ఇచ్చేను.
• ప్రేమ కై పరితపించే పసివాడు.
కాల మే కనికరించే ఈనాడు.
ఆలన = రోదన, మొర
పాలన = రక్షణ
యడ్ల శ్రీనివాసరావు 28 Oct 2024 , 5:30 AM.
No comments:
Post a Comment