Friday, June 30, 2023

380. ఆత్మ నేత్రం

 

ఆత్మ నేత్రం



• ఏదో   చెప్పాలని  

  ఏదేదో    చెప్పాలని.

  ఏదో    చెప్పాలని     

  ఏదేదో     చెప్పాలని.

  చూస్తున్నవి    కనులు.

  ఎదురు  చూస్తున్నవి    ఆ   కనులు.


• ఆమని    కనులు    కలుహరములై

  పరి భాష  తో    ఏదో    చెపుతున్నవి.


• భాషలోని   భావం   

  చేరలేదు    కాని

  కంటి లోని    కాంతి    చెపుతోంది.

  నాతో   ….   ఏదో  చెపుతుంది.


• ఏదో   చెప్పాలని   

  ఏదేదో    చెప్పాలని.

  ఏదో   చెప్పాలని    

  ఏదేదో    చెప్పాలని.

  చూస్తున్నవి   కనులు.

  ఎదురు   చూస్తున్నవి    ఆ  కనులు.


• ఆ   కాంతి లోని    కిరణానికి

  కావాలంటా   ...   నేను కావాలంటా.

• ఆమని    ఆత్మ  నేత్ర   శక్తి తో

  కాంతి నే   పిలుపు గా   చేసింది.

• తన  మనసు నే   ప్రకాశింప   చేసింది.

  తన  రూపమే  దాచి పెట్టింది.


• ఆమని    ఒక చిత్రం    కాదు.

  నను  విడిచి  వెళ్లి న   సజీవ రూపం.

• నా కోసమే   

  ఎదురు  చూస్తున్న   ఆత్మ  స్వరూపం.


• ఆ చూపు లోని   వెలుగు  తో 

  గుర్తు  చేసింది   నా గతం .

  అంతరంగం లోని  

  నా  ప్రేమ   అవరోధం  

  తొలగింప  చేసింది  నేడు.


• చెప్పింది ...  గతమంతా   చెప్పింది.

  చెప్పింది ...  గతమంతా   చెప్పింది.

• చూస్తున్న     కనులను

  నా కోసం  

  ఎదురు  చూస్తున్న   ఆ  కనులను.

  ఎన్నడు  కలవాలో   

  ఎప్పుడు  చేరాలో.


యడ్ల శ్రీనివాసరావు 1 July 2023 , 12:00 AM.












Thursday, June 29, 2023

379. సీతాకోకచిలుక

 

సీతాకోకచిలుక


• సీతాకోక  చిలుక 

  ఎగిరే   రంగుల   వలపా

  చూసి   చూడని   తలపా

  అంది    అందని   బిగువా.


• రెప   రెపలాడే   

  నీ   రెక్కల   సొగసు కి

  టప టపలాడుతు

  నా   రెప్పలు   వేసెను   తాళం.


• తడి బడి  లేచే

  నీ  ఆశల  పల్లకి  కై

  వడి వడి  లాడుతూ

  నా   పాదం   వేసేను   పల్లవి.


• పుప్పొడి  కోసం    

  పడే    నీ  ఆరాటం ...

  ఉత్సాహం    రేపే 

  నా లో    కోలాటం.


• ఆ   కారుమబ్బుల ను    

  తాకాల ని     ఉంది.

  ఉవ్వెత్తు న   ఈ గాలి లో   

  ఎగరాల ని   ఉంది.


• సీతాకోక  చిలుక

  ఎగిరే   రంగుల   వలపా

  చూసి   చూడని  తలపా

  అంది    అందని  బిగువా.


• పూవులపై   వాలిన    

  నీ    వయనం తో

  ప్రకృతి లో    తేలింది    

  నా   ఎద   సరాగం.

• ఏమి భాగ్యం     ఎంత మధురం.


• తుమ్మెద  వై    

  దరి    చేరుతావు

  తూరీగ    లా    

  తుర్రున    జారుతావు.

• ఎంత బింకం      ఏమి జాడ్యం.


• స్వల్పమైన     జీవితమే నా     

   నీ  సంతోషపు   ఏకాంతం.

   అల్పమైన      ఆయుష్షే  నా     

   నీ  ఆనందపు   రహస్యం.


• సీతాకోక  చిలుక

  ఎగిరే   రంగుల     వలపా

  చూసి   చూడని   తలపా

  అంది    అందని   బిగువా.


గమనిక : 

ఒక సీతాకోకచిలుక  ఆయుష్షు 2 నుంచి 3 వారాలు మాత్రమే.


యడ్ల శ్రీనివాసరావు 28 June 2023 5:00 am.









Tuesday, June 27, 2023

378. రచయిత

 

రచయిత



• ఆయా స   పడుతోంది   కవిత

  ఆ  ‘యాస’  కై  చూస్తోంది  రచన.


• ఆశ తో    కదిలే   పదము కి

  శ్వాస యే   కరువయ్యెను.

• అభిలాష తో   ఎగిరే   అక్షరం 

  అవగాహన   లేక   క్షరణమయ్యెను.


• ఆయా స   పడుతోంది    కవిత

  ఆ  ‘యాస’ కై    చూస్తోంది    రచన.


• వ్యాకరణ   మెరుగని   వాక్యం

  లయబద్ధం లేని   శబ్దం  అయ్యింది.

• తేటగీతి   లేని    ఛందస్సు

  నిశి   నిండిన   చంద్రుడయ్యేను.


• ఆయా స   పడుతోంది   కవిత

  ఆ   ‘యాస’ కై   చూస్తోంది   రచన.


• ఉత్పలమాల తో    ఉవ్విళ్లూరే టి    పద్యం

  చంపకమాల తో    చందనం  పూసే  కావ్యం.

• అతిశయోక్తి లు   లేని    ఆశ్చర్యార్దకం

  మత్తేభ   శార్దూల   అక్షతల   గ్రంధం.


• ఆయా స    పడుతోంది   కవిత

  ఆ   ‘యాస’ కై    చూస్తోంది  రచన.

• ఆయా స   పడుతోంది   కవిత

  ఆ   ‘యాస’ కై    చూస్తోంది  రచన.


క్షరణము = నాశనము.


యడ్ల శ్రీనివాసరావు 27 June 2023 , 4:00 pm












Monday, June 26, 2023

377. ధ్యాన జ్యోతి

 

ధ్యాన జ్యోతి



• ఓ   మానవుడా

  జ్యోతిని   వెలిగించు    దేహం లో

  ధ్యానం తో   …   మౌన  యోగం తో.

• ఓ    మానవుడా

  జ్యోతిని   వెలిగించు    దేహం లో

  ధ్యానం తో … మౌన యోగం తో.

  అది యే    ఆత్మ కు    మేలుకొలుపు

  పరమాత్మ ను   చేరుటకు   పిలుపు.


• మనిషి      పలికేది     సత్యమో   అసత్యమో

  మనిషి కే   తెలియని   మాయా    లోకం ఇది.


• మనసు      చేసేది       పాపమో   పుణ్యమో

  మనసు కే   తెలియని   కల్లోల     లోకం ఇది.


• మబ్బు   కమ్మిన    మనసులకు

  మసక    బారిన     మనుషులకు

  ధ్యానం    దివ్య     ఔషధం .


• ఓ    మానవుడా

  జ్యోతిని    వెలిగించు    దేహం లో

  ధ్యానం తో   …   మౌన  యోగం తో.


• అంతటా    ఆవరించిన   మాయలో

  చివరికి      బలిపశువు   మానవుడు.

 

• దుఃఖ మనే      కడలి లో    అల యై

  గిల గిల  లాడే   మీనం    మానవుడు.


• మాయ అనే    ముసుగు ను   చీల్చి

  దుఃఖ మనే     అజ్ఞానాన్ని      కాల్చే

  జ్ఞాన జ్యోతి     ధ్యానం.


• ఓ     మానవుడా

• జ్యోతిని    వెలిగించు     దేహం లో

  అది యే     ఆత్మ కు       మేలుకొలుపు.

  పరమాత్మ ను  చేరుటకు   పిలుపు.


• ఓ    మానవుడా

  జ్యోతిని    వెలిగించు    దేహం లో

  ధ్యానం తో   …   మౌన యోగం తో.

  అది యే     ఆత్మ కు       మేలుకొలుపు.

  పరమాత్మ ను  చేరుటకు   పిలుపు.


యడ్ల శ్రీనివాసరావు 27 June 2023 , 10:30 am.







Saturday, June 24, 2023

376. శివోహం

 

శివోహం



• మనిషి లో   కొలువై  ఉంది    ఆత్మ

  శివుని లో    నెలవై    ఉంది    పరమ ఆత్మ.

  ఆత్మ  పరమాత్మలు     జ్యోతి   స్వరూపాలు.

  అవి   అంతము లేని    చైతన్య   ప్రకాశాలు.


• ఆత్మలు  అను    పిల్లలకు

  పరమాత్మ యే   తండ్రి   ...  అతడు ఒక్కడే.

• ఆత్మ ను    ఎరిగిన   వానికి

  పరమాత్మ తో   సంధానం  తెలియును.


• శివుడు

  చెట్టులో  లేడు       పుట్టలో     లేడు

  నీ లోన   లేడు        నా  లోన   లేడు

  సర్వము    వ్యాపించి   లేడు.


• శివుడు   ఉండేది   పరంధామమున.

 సంగమ  యుగమున  ఆత్మల  అజ్ఞానం 

 త్రుంచుటకు  జ్ఞాన  రూపియై  వచ్చును.


• శివుడు   శివుడే   కాని 

  నరుడు   శివుడు  కాలేడు.

• శివుని తత్వము లో 

   అనుభవాల తో  నరుడు    శివోహం కాడు.

• భక్తి లో ని    భ్రమలకు 

   మోక్షము ను   ఇచ్చేది  శివుని  జ్ఞానం.


• నిజానంద   స్వరూపం    శివోహం  శివోహం

  ప్రకాశ   స్వరూపం          శివోహం  శివోహం

  పరమాత్మ   స్వరూపం     శివోహం  శివోహం

  ధ్యాన యోగ   చైతన్యం   శివోహం   శివోహం


• మనిషి లో     కొలువై  ఉంది   ఆత్మ

  శివుని లో      నెలవై    ఉంది    పరమ ఆత్మ.

  ఆత్మ  పరమాత్మలు    జ్యోతి   స్వరూపాలు.

  అవి అంతము  లేని     చైతన్య   ప్రకాశాలు.


సంగమ యుగం = కలియుగ అంత్య సమయం.


యడ్ల శ్రీనివాసరావు 25 June 2023 11:00 am













375. మనిషి - జ్ఞానం

 

మనిషి - జ్ఞానం



• జ్ఞానమే    మార్చెను    నా జీవితాన్ని

  శాంతమే   కలిగెను     నా మనసు న.

• జ్ఞానమే    మార్చెను    నా జీవితాన్ని

  శాంతమే   కలిగెను      నా మనసు న.


• చిద్రమైన   మనసుకు  

   ఆసరా   అయ్యేను   శివుడు.

   ఓర్పు   సహనాల తో    నేర్పు నే   తెలిపేను.


• శిధిలమైన    మనిషికి 

  భరోసా    అయ్యేను    శివుడు.

  మాయా  మర్మము లలో     గోప్యమే   తెలిపేను.


• జ్ఞానమే    మార్చెను      నా జీవితాన్ని

  శాంతమే    కలిగెను       నా మనసు న.


• ఘర్షణ లతో     సాగే    బంధాలకు

  సంఘర్షణ లు     సహజమని.


• స్వార్థం   నిండిన   మనుషుల కు

  నిష్టూరాలు    అలంకారమని.


• కాల మే      తెలిపెను   ఎన్నో    అనుభవాలు గా

  మాన మే    తెలిపెను   ఎన్నో     అవమానాల తో.


• అవసరాల   కోసమే    జీవుని   ఆరాటమని.

  అదే మంచి చెడులు    

  ఎరుగని   బ్రతుకు  పోరాటమని.


• హంగుల  కోసం  వేసేవి  

  రంగుల   ముసుగు లని.

  మాటలలో   కనిపించేవి 

  పొంగుల     లొసుగు లని.


• మనుషులే    తెలిపెను   లోక యుక్తి ని.

  మౌనమే        తెలిపెను     దైవ  శక్తి ని.


• జ్ఞానమే    మార్చెను    నా జీవితాన్ని

  శాంతమే   కలిగెను     నా మనసు న.


• చిద్రమైన   మనసుకు  

  ఆసరా   అయ్యేను  శివుడు.

  ఓర్పు  సహనాల తో      నేర్పు నే   తెలిపేను.


• శిధిలమైన   మనిషికి 

  భరోసా   అయ్యేను   శివుడు.

  మాయా  మర్మము లలో    గోప్యమే  తెలిపేను.


యడ్ల శ్రీనివాసరావు 24 June 2023 1:00 pm.













Tuesday, June 20, 2023

374. వేద రాగ సారం

 

 వేద రాగ సారం



• వేదం  వేదం     సమ్మోహన   నాదం.

  రాగం  రాగం     సంయుక్తి   నినాదం.

  సకల శాస్త్రాల    సారంగం.

  సర్వ   శక్తుల    అభిరూపం.


• వేద రాగాల  సరాగం    ధర్మ   అభిజ్ఞం.

  యుక్తి సంయుక్తుల  సామర్థ్యం    అర్ద చాణక్యం

  సకల శక్తుల  సంపర్కం    కామ  అభీష్టం

  సర్వ శాస్త్రాల   సంయోగం    మోక్ష  ఉత్కర్షం.


• ధర్మ  అర్థ  కామ  మోక్షాలు

  జన్మ  కుండలి   చక్రం లో

  ఆత్మ   స్పృశించేటి   గమనాలు.

  అవే  చతుర్విద ఫల పురుషార్ధాలు.


• వేదం   వేదం     సమ్మోహన  నాదం.

  రాగం   రాగం      సంయుక్తి   నినాదం.

  సకల  శాస్త్రాల    సారంగం.

  సర్వ   శక్తుల     అభిరూపం.


• కర్మ తో   భోగం       ఆటుపోటుల   సంక్షోభం

  కర్మ తో    యోగం    సుఖశాంతుల   సంక్షేమం


• ఆవేదనలు    ఆరాధన   అయిన   తరుణం

  హిమము  సరోవరం గా   మారే   శుభ సమయం.


• కుండలిని జాగృతం    ఎన్నో   మేళనల   నృత్యం

  అది   సర్వేంద్రియాల    ఊహకు   అతీతం.


• వేదం   వేదం     సమ్మోహన   నాదం.

  రాగం రాగం       సంయుక్తి    నినాదం.

  సకల   శాస్త్రాల    సారంగం

  సర్వ     శక్తుల     అభిరూపం.


 యడ్ల శ్రీనివాసరావు 20 June 2023 5:00 pm










Monday, June 12, 2023

373. సత్యమైన ప్రేమ


సత్యమైన  ప్రేమ



• సత్యమును   తెలిపావు   శివ

  నిజమును     చూపావు   హర

  నను వదలని   నా తండ్రి   ఈశ్వరా

  ఏమి భాగ్యమో     ఎంత మోక్షమో.


• ఆడించేటి    మనుషుల కు    ఆటబొమ్మను

  అవసరాల   మనుషుల కు     కీలుబొమ్మను.

  ఈ బొమ్మ కు   ప్రాణం    ఎందుకు   పోశావో

  మనసు ను    ఎందుకు    మైనం     చేశావో.


• సత్యమును    తెలిపావు   శివ

  నిజమును      చూపావు   హర


• ఏ జన్మ   ప్రేమమో   

  ఆత్మలో    అవశేషమై   ఉంది .

• రూపం  లేని  మనిషి పై

  రాతలతో   అర్దం  కలిగింది.

• భావ  ప్రకటన లేని 

  ప్రేమ  వ్యర్దం గా   మిగిలింది.

• విడిచాను   నీ చెంత   ప్రేమను

  నిజమైతే   సాక్ష్యం తో   చూపిస్తావని.


• సత్యమును   తెలిపావు   శివ

  జీవితమే    ఒక మాయ   అని.


• నిజమును   చూపావు   హర

  పొందేందుకు   ఇక ఏమీ   లేదని.


• నను   వదలని   నా తండ్రి   ఈశ్వరా

  తెలిపావు    

  ఆత్మ   ప్రేమ తో    బుణం   తీరిపోయిందని.

• సత్యమైన   ప్రేమ ను    

  పంచేది     నీవే  వని.

• నిజమైన   ప్రియమును

   నీ చెంతే     నని.


• సత్యమును   తెలిపావు   శివ

  నిజమును     చూపావు   హర

  నను  వదలని   నా తండ్రి   ఈశ్వరా

  ఏమి భాగ్యమో    ఎంత మోక్షమో.



ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 12 June 2023 10:00 pm.










Sunday, June 11, 2023

372. చుక్కల్లో చందురుడా

 


చుక్కల్లో చందురుడా


• చందురుడా    చందురుడా

  చుక్కలల్లుకున్న   నిండు   ప్రేమికుడా.

• అంబరుడా     అంబరుడా

  ఆకాశాన్ని   పెనేసుకున్న   రోహిణి కాంతుడా.


• మేఘాలలో ని     మన్మధుడా

  మనసును   దోచిన   సుందరుడా.

• వెన్న ముద్దు    లడగవు    కానీ

  వెన్నెల ను      పంచుతావు.

• మది  లోకి      దూరవు  కానీ

  మనసంతా  నిండి   ఉంటావు.

• మౌనంగా    ఉంటూనే

  మది ని    మీటి    పోతావు.

• చక్కం గా    చిక్కుతూ నే

  మబ్బుల్లో    దాగుంటావు.


• చందురుడా     చందురుడా

  చుక్కలల్లుకున్న    నిండు    ప్రేమికుడా

• అంబరుడా     అంబరుడా

  ఆకాశాన్ని    పెనేసుకున్న   రోహిణి కాంతుడా.


• అమ్మ వంటి    

  లాలన తో    మురిపిస్తావు.

  అమ్మాయి లాంటి   

  లాలిత్యం తో  మైమరిపిస్తావు.

• ఆశలలో     ముంచి   తేలుస్తూ

  అందనంత    దూరంలో    ఉంటావు.


• ఎన్ని   రాత్రులని    చూసేది

  పాల పొంగు ల    చందురుడా

• ఎంత   కాలమని    వేచేది

  ఎద ను  పొంగించే    సింగారు డా


• చందురుడా     చందురుడా

  చుక్కలల్లుకున్న    నిండు    ప్రేమికుడా.

• అంబరుడా      అంబరుడా

  ఆకాశాన్ని    పెనేసుకున్న     రోహిణి కాంతుడా.


యడ్ల శ్రీనివాసరావు 11 June 2023 10:00 pm.








Saturday, June 10, 2023

371. కన్నులే ప్రాణం

 

కన్నులే ప్రాణం



• స్నేహం    నా    స్నేహం

  కన్నుల తో    సాగుతోంది      ప్రియం గా.

• భావం   నా    మది భావం

  నయనం లో   నిలిచి ఉంది    మధురం గా‌.


• కాలం తో     ఎంత    దూరమేగినా 

  ఆరని   కంట తడి కి    కన్నులే   ప్రాణం.

• భారం తో     ఎంత     సమయమేగినా

  ఆగని గుండె   కోతకు   నయనాలే    రక్షణం.


• వేదనల   వర్ణాలు   జీవితానికి   ఆణిముత్యాలు

  దుఃఖముల   స్వర్ణాలు  దేహానికి   ఆభరణాలు.


• స్నేహం    నా    స్నేహం

  కన్నుల తో    సాగుతోంది    ప్రియం గా.

• భావం    నా మది   భావం

  నయనం లో   నిలిచి ఉంది   మధురం గా.


• జీవం తో    ఎంత కాలం   సాగినా

  చెదరని    ఆశకు   కన్నులే    సాకారం.

• స్నేహం తో   ఎంత   కాలమేగినా

  చెరగని  రూపానికి    నయనాలే   దర్శనం.


• భావోద్వేగాల   సెలయేరు    

  ఈ జీవన  ప్రవాహం.

• రాగద్వేషాల   హరివిల్లు 

  ఈ జీవిత   ఆకాశం.


• స్నేహం    నా    స్నేహం

  కన్నుల తో    సాగుతోంది    ప్రియం గా.

• భావం    నా    మది భావం

  నయనం లో    నిలిచి ఉంది   మధురం గా.


యడ్ల శ్రీనివాసరావు 10 June 2023 , 11:00 pm










Friday, June 9, 2023

370. జీవన మకరందం

 

జీవన మకరందం


• అందమైన   అనుభవాలు 

  ఎన్నో    ఎన్నెన్నో

  ఆనందమైన   క్షణ క్షణాలు 

  ఎన్నో     మరెన్నో

• కలిసి    వస్తున్న   కాలం

  హారతి   ఇస్తుంది.

  కల కాలం  ఉంటుంది.

• మనసు  తెరచిన  ద్వారం

  మోహన  మవుతుంది

  సమ్మోహనం  అంటుంది.


• వెలుగు నీడలు     

  జీవన  రేఖలని

  ప్రేమానుబంధాలు  

  బుణము లని

  తెలియ చేసింది   దైవం.

• ఆశ పాశములు   

  మాయ  మిధ్య  అని

  సుఖ దుఃఖాలు    

  పరిమళ  భరితమని

  తెలియ చేసింది   జ్ఞానం.


• అందమైన అనుభవాలు 

  ఎన్నో ఎన్నెన్నో

  ఆనందమైన క్షణ క్షణాలు 

  ఎన్నో మరెన్నో


• నీవి    కాని   గింజలు

  నీ  ఆకలి   ఎరుగవని.

• నీ దరి   చేరే  పక్షులకు

  నీవే  గింజ   అవ్వాలని.

  తెలియచేసింది   లోకం.


• మది పొరల లో     ఎత్తు పల్లాలు

  ఆటలాడుకునే    జారుడు   బల్లలని

• ఎద  నిండిన   భావాలు

  ఎగిరే   రంగుల  బుడగలని

  తెలియచేసింది   అనుభవం.


• అందమైన   అనుభవాలు 

  ఎన్నో ఎన్నెన్నో

• ఆనందమైన   క్షణ క్షణాలు 

  ఎన్నో  మరెన్నో

• కలిసి   వస్తున్న   కాలం

  హారతి   ఇస్తుంది.

  కల కాలం  ఉంటుంది.

• మనసు   తెరచిన   ద్వారం

  మోహన   మవుతుంది

  సమ్మోహనం  అంటుంది.



యడ్ల శ్రీనివాసరావు 10 June 2023 10:00 am










.


Tuesday, June 6, 2023

369. ఎగరని పక్షులు

 

ఎగరని పక్షులు


• నిజమే కదా   …  ఇది నిజమే కాదా.

  నువ్వు   నీ లాగే   ఉండాలి

  నేను    నా లాగ   ఉండాలి

  నువ్వు   నీ లాగే   ఉండాలి

  నేను     నా లాగ   ఉండాలి


• జీవితం   ఊహించని  ప్రయాణం.

  కలవని    దారుల్లో  

  కలిసి     సాగేటి    పయనం.

  ఇది   ఒక   అనంతం

  స్పష్టత   లేని   సహవాసం.


• నిజమే కదా  …  ఇది నిజమే కాదా.

  నువ్వు    నీ లాగే    ఉండాలి

  నేను       నా లాగ   ఉండాలి


• పదం   లోని    జీవం తో

  నీవు  అవుతున్నావు   సజీవం.

• పరమపదం     లోని    జీవం తో

  నేను   అవుతున్నాను   నిర్జీవం.


• కలవని   దిక్కుల   గమనం లో

  ఎవరికి   ఎవరో.

• దూరం   ఎరిగిన   గమ్యం లో

  చివరికి  

  ఎవరికి  ఎవరో .


• నిజమే కదా  …  ఇది నిజమే కాదా.

• నువ్వు    నీ  లాగే    ఉండాలి

   నేను      నా లాగ   ఉండాలి


• ఎగిరే   గువ్వల  మైనా

  నీ      గూడు   తామరసపు    పంజరం

  నా     గూడు   తామరాకుల    మంచె.

• రెక్కల  బరువు   తెలిసినా 

  మనసు భారం    తెలియటం  లేదు.

  ఇది  ఏమి  అదృష్టమో 


• నిజమే కదా  …  ఇది నిజమే కాదా.

  నువ్వు   నీ లాగే    ఉండాలి

  నేను     నా లాగ    ఉండాలి

  నువ్వు   నీ లాగే    ఉండాలి

  నేను    నా లాగ     ఉండాలి


పరమపదం = కైవల్యం, వైరాగ్యం, వైకుంఠం.

గమనము = దారి, ప్రయాణం.

గమ్యం = పొందగలిగేది, తెలుసుకో గలిగేది

తామరస  =  బంగారము 

మంచె = పొలం లో విశ్రాంతి కోసం ఎత్తులో కట్టిన తాటి మరియు తామర ఆకుల మంచము వంటిది.


యడ్ల శ్రీనివాసరావు  6 June 2023, 7:00 pm.











490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...