ఎగరని పక్షులు
• నిజమే కదా … ఇది నిజమే కాదా.
నువ్వు నీ లాగే ఉండాలి
నేను నా లాగ ఉండాలి
నువ్వు నీ లాగే ఉండాలి
నేను నా లాగ ఉండాలి
• జీవితం ఊహించని ప్రయాణం.
కలవని దారుల్లో
కలిసి సాగేటి పయనం.
ఇది ఒక అనంతం
స్పష్టత లేని సహవాసం.
• నిజమే కదా … ఇది నిజమే కాదా.
నువ్వు నీ లాగే ఉండాలి
నేను నా లాగ ఉండాలి
• పదం లోని జీవం తో
నీవు అవుతున్నావు సజీవం.
• పరమపదం లోని జీవం తో
నేను అవుతున్నాను నిర్జీవం.
• కలవని దిక్కుల గమనం లో
ఎవరికి ఎవరో.
• దూరం ఎరిగిన గమ్యం లో
చివరికి
ఎవరికి ఎవరో .
• నిజమే కదా … ఇది నిజమే కాదా.
• నువ్వు నీ లాగే ఉండాలి
నేను నా లాగ ఉండాలి
• ఎగిరే గువ్వల మైనా
నీ గూడు తామరసపు పంజరం
నా గూడు తామరాకుల మంచె.
• రెక్కల బరువు తెలిసినా
మనసు భారం తెలియటం లేదు.
ఇది ఏమి అదృష్టమో
• నిజమే కదా … ఇది నిజమే కాదా.
నువ్వు నీ లాగే ఉండాలి
నేను నా లాగ ఉండాలి
నువ్వు నీ లాగే ఉండాలి
నేను నా లాగ ఉండాలి
పరమపదం = కైవల్యం, వైరాగ్యం, వైకుంఠం.
గమనము = దారి, ప్రయాణం.
గమ్యం = పొందగలిగేది, తెలుసుకో గలిగేది
తామరస = బంగారము
మంచె = పొలం లో విశ్రాంతి కోసం ఎత్తులో కట్టిన తాటి మరియు తామర ఆకుల మంచము వంటిది.
యడ్ల శ్రీనివాసరావు 6 June 2023, 7:00 pm.
No comments:
Post a Comment