ధ్యాన జ్యోతి
• ఓ మానవుడా
జ్యోతిని వెలిగించు దేహం లో
ధ్యానం తో … మౌన యోగం తో.
• ఓ మానవుడా
జ్యోతిని వెలిగించు దేహం లో
ధ్యానం తో … మౌన యోగం తో.
అది యే ఆత్మ కు మేలుకొలుపు
పరమాత్మ ను చేరుటకు పిలుపు.
• మనిషి పలికేది సత్యమో అసత్యమో
మనిషి కే తెలియని మాయా లోకం ఇది.
• మనసు చేసేది పాపమో పుణ్యమో
మనసు కే తెలియని కల్లోల లోకం ఇది.
• మబ్బు కమ్మిన మనసులకు
మసక బారిన మనుషులకు
ధ్యానం దివ్య ఔషధం .
• ఓ మానవుడా
జ్యోతిని వెలిగించు దేహం లో
ధ్యానం తో … మౌన యోగం తో.
• అంతటా ఆవరించిన మాయలో
చివరికి బలిపశువు మానవుడు.
• దుఃఖ మనే కడలి లో అల యై
గిల గిల లాడే మీనం మానవుడు.
• మాయ అనే ముసుగు ను చీల్చి
దుఃఖ మనే అజ్ఞానాన్ని కాల్చే
జ్ఞాన జ్యోతి ధ్యానం.
• ఓ మానవుడా
• జ్యోతిని వెలిగించు దేహం లో
అది యే ఆత్మ కు మేలుకొలుపు.
పరమాత్మ ను చేరుటకు పిలుపు.
• ఓ మానవుడా
జ్యోతిని వెలిగించు దేహం లో
ధ్యానం తో … మౌన యోగం తో.
అది యే ఆత్మ కు మేలుకొలుపు.
పరమాత్మ ను చేరుటకు పిలుపు.
యడ్ల శ్రీనివాసరావు 27 June 2023 , 10:30 am.
No comments:
Post a Comment