వేద రాగ సారం
• వేదం వేదం సమ్మోహన నాదం.
రాగం రాగం సంయుక్తి నినాదం.
సకల శాస్త్రాల సారంగం.
సర్వ శక్తుల అభిరూపం.
• వేద రాగాల సరాగం ధర్మ అభిజ్ఞం.
యుక్తి సంయుక్తుల సామర్థ్యం అర్ద చాణక్యం
సకల శక్తుల సంపర్కం కామ అభీష్టం
సర్వ శాస్త్రాల సంయోగం మోక్ష ఉత్కర్షం.
• ధర్మ అర్థ కామ మోక్షాలు
జన్మ కుండలి చక్రం లో
ఆత్మ స్పృశించేటి గమనాలు.
అవే చతుర్విద ఫల పురుషార్ధాలు.
• వేదం వేదం సమ్మోహన నాదం.
రాగం రాగం సంయుక్తి నినాదం.
సకల శాస్త్రాల సారంగం.
సర్వ శక్తుల అభిరూపం.
• కర్మ తో భోగం ఆటుపోటుల సంక్షోభం
కర్మ తో యోగం సుఖశాంతుల సంక్షేమం
• ఆవేదనలు ఆరాధన అయిన తరుణం
హిమము సరోవరం గా మారే శుభ సమయం.
• కుండలిని జాగృతం ఎన్నో మేళనల నృత్యం
అది సర్వేంద్రియాల ఊహకు అతీతం.
• వేదం వేదం సమ్మోహన నాదం.
రాగం రాగం సంయుక్తి నినాదం.
సకల శాస్త్రాల సారంగం
సర్వ శక్తుల అభిరూపం.
యడ్ల శ్రీనివాసరావు 20 June 2023 5:00 pm
No comments:
Post a Comment