ఆత్మ నేత్రం
• ఏదో చెప్పాలని
ఏదేదో చెప్పాలని.
ఏదో చెప్పాలని
ఏదేదో చెప్పాలని.
చూస్తున్నవి కనులు.
ఎదురు చూస్తున్నవి ఆ కనులు.
• ఆమని కనులు కలుహరములై
పరి భాష తో ఏదో చెపుతున్నవి.
• భాషలోని భావం
చేరలేదు కాని
కంటి లోని కాంతి చెపుతోంది.
నాతో …. ఏదో చెపుతుంది.
• ఏదో చెప్పాలని
ఏదేదో చెప్పాలని.
ఏదో చెప్పాలని
ఏదేదో చెప్పాలని.
చూస్తున్నవి కనులు.
ఎదురు చూస్తున్నవి ఆ కనులు.
• ఆ కాంతి లోని కిరణానికి
కావాలంటా ... నేను కావాలంటా.
• ఆమని ఆత్మ నేత్ర శక్తి తో
కాంతి నే పిలుపు గా చేసింది.
• తన మనసు నే ప్రకాశింప చేసింది.
తన రూపమే దాచి పెట్టింది.
• ఆమని ఒక చిత్రం కాదు.
నను విడిచి వెళ్లి న సజీవ రూపం.
• నా కోసమే
ఎదురు చూస్తున్న ఆత్మ స్వరూపం.
• ఆ చూపు లోని వెలుగు తో
గుర్తు చేసింది నా గతం .
అంతరంగం లోని
నా ప్రేమ అవరోధం
తొలగింప చేసింది నేడు.
• చెప్పింది ... గతమంతా చెప్పింది.
చెప్పింది ... గతమంతా చెప్పింది.
• చూస్తున్న కనులను
నా కోసం
ఎదురు చూస్తున్న ఆ కనులను.
ఎన్నడు కలవాలో
ఎప్పుడు చేరాలో.
యడ్ల శ్రీనివాసరావు 1 July 2023 , 12:00 AM.
No comments:
Post a Comment