🌙 గురు చందమామ🌕
• మామ చందమామ
మనసే రాగమా యే
• భామా చందభామ
సొగసే వెన్నెలా యే
• మసక నిండిన మబ్బుల కు
మంచి మాటే కరువా యే.
• వయసు మీరేటి హృదయాలకు
రాగ ద్వేషాలు ఆభరణాలు ఆ యే.
• మధురమైన మనుషులకు
నిండు పౌర్ణమి మనోహరం.
• ఆడి పాడే మనసులకు
వెన్నెల శాంతి శుభోదయం.
• మామ చందమామ
మనసే రాగమా యే
• భామా చందభామ
సొగసే వెన్నెలా యే.
• చంద్రుడు గురువైన రోజు గురుపౌర్ణమి
అది విశ్వానికి గజకేసరి యోగం.
• జాబిల్లి హరివిల్లైన నేడు వ్యాసపౌర్ణమి
ఈ జ్ఞానం సకల జనులకు రాజ యోగం.
• మామ చందమామ
మనసే రాగమా యే.
• భామా చందభామ
సొగసే వెన్నెలా యే.
• సోముని కంఠం
శృతిని పలుకుతుంటే
• మైకం కమ్మిన మాయా జీవుడి 🌚
అపశృతులు యే ల.
• మాయ ఆవాహనం తో
ఉత్తముని🌝 స్థితి కోల్పోవ నే ల.
• మనసు వలయాలు
లయ బద్ద మై ఉంటే
• హద్దులు మీరని మాటలు
మైత్రిని కోర వా. 🤝
• మామ చందమామ
మనసే రాగమా యే.
• భామా చందభామ
సొగసే వెన్నెలా యే.
గజకేసరి యోగం = జ్యోతిష్య శాస్త్రం లో బ్రహృస్పతి, చంద్రుడు ఒకే రాశిలో లేదా జాతకచక్రంలో ఒకే గృహం లో కలిసి ఉన్నా లేదా బృహస్పతి యెక్క శుభదృష్టి చంద్రుని పై ఉన్న సందర్భం లో జ్ఞానం, వాక్ శుద్ధి, సిరి సంపదలు శివుని ఫలాలు గా లభిస్తాయి .
రాజయోగం = గురు పౌర్ణమి సోమవారం గాని గురువారం గాని సంభవించినప్పుడు దక్షిణామూర్తికి మనసు అర్పించి ప్రార్థన చేసి న వారికి రాజయోగం లభిస్తుంది. అంటే రాజు అవుతారని కాదు, ఏ లోటూ లేకుండా జీవితం ఉంటుంది అని.
ఓం నమఃశివాయ 🙏.
యడ్ల శ్రీనివాసరావు 3 July 2023, 3:00 AM.
No comments:
Post a Comment