Thursday, July 13, 2023

383. ఊహల ఆశలు

 

ఊహల ఆశలు


• ఊహలు   ఊహలు

  ఊపిరి    నిచ్ఛేటి     పట్టుగొమ్మలు.

  ఆశలు     ఆశలు

  జీవం      నింపేటి      హరివిల్లులు.


• ఊహలకు   మనసు   సొగసు   అవుతుంటే

  విరిసే   ఆశలు   చేసేను    నటరాజ  నాట్యం.


• ఆశలకు    బ్రతుకు    ఆలంబన    మవుతుంటే

  మెరిసే ఊహలు   ఊరేగే  అంబరాన  తారలుగా.


• బ్రతుకే     ఒక     ఊహయితే

  బ్రతికించే   ఆశ    అమృతం.


• ఊహలు     నిజమయితే

  మధురం    తాకే ను   ఆకాశం.


• ఊహలు     ఊహలు

  ఊపిరి    నిచ్ఛేటి    పట్టుగొమ్మలు.

  ఆశలు     ఆశలు

  జీవం   నింపేటి    హరివిల్లులు.


• ఊహలకు   మనసు   భారమవుతుంటే

  మెదిలే    ఆశలకు     ఆధారం ఏమిటి.


• ఆశలకు   బ్రతుకు    పోరాటమవుతుంటే

  విడిచిన   ఊహలకు    అర్దం ఏమిటో.


• నిజము    కాని    ఊహలు

  అంధుడికి    బలమైన   ఊతం.


• అడియాశలైన    ఆశలు

  జీవుడి కి    అందమైన   శూన్యం.


• ఊహలు     ఊహలు

  ఊపిరి   నిచ్ఛేటి    పట్టుగొమ్మలు.

  ఆశలు     ఆశలు

  జీవం   నింపేటి    హరివిల్లులు.



యడ్ల శ్రీనివాసరావు 14 July 2023, 9:30 AM.











No comments:

Post a Comment

623. విశ్వ రాజసం

  విశ్వ రాజసం • కనులకు      ఏమయిందో   కలలను       కాదంటుంది .   కాదంటుంది   . . .   కలలను కాదంటుంది . • కలల లో     వెలిగే     కాంతులను   చూ...