శ్రీ రంగ సఖుడు
• శ్రీరంగ రంగ సఖుడా ...
స్వామి సారంగ నిగుడా …
• ఊయలలో శయనించి
ఊహలలో పయనించి
• జగము న జావళి తో
చిరు దివ్వె నెలిగించే
• శ్రీరంగ రంగ సఖుడా ...
స్వామి సారంగ నిగుడా …
• క్రీ గంట చూపుతో
చిరు మంద హసా
• సింధుజ మోము లో
సింగారము దిద్ది
• అంబుజ ఒడి లో
కాంతులీనే కారి … ఓ కళ్యాణకారి.
• శ్రీరంగ రంగ సఖుడా ...
స్వామి సారంగ నిగుడా …
• మాయ ను సృష్టించి
మహిమలు చూపించి
• అల్లిబిల్లి ఆటలతో
సత్యము ను వెతికించే
శ్రీ శ్రీ నివాసుడా.
• శ్రీరంగ రంగ సఖుడా ...
స్వామి సారంగ నిగుడా …
• అలకల పలుకుల శ్రీ దేవి పై
ప్రేమనే అస్త్రంగా సంధించి
సేవ తో బంధించిన
మానస చోరుడా లక్ష్మీ నాధుడా.
• జగము ను పాలించే
సంసార సాగరుడా.
• శ్రీరంగ రంగ సఖుడా ...
స్వామి సారంగ నిగుడా …
సఖుడు = నందివర్ధనుడు, చెలికాడు
సారంగ = రాజహంస
నిగుడు = కవి, వర్ధిల్లు వాడు.
జావళి = జోల పాట
క్రీ గంట = ఓరకంట చిలిపిగా చూచుట
సింధుజ = లక్ష్మి దేవి
అంబుజ = కమలపువ్వు
యడ్ల శ్రీనివాసరావు 10 June 2023, 11:30 pm.
No comments:
Post a Comment