అనగనగా ఓ ఉద్వేగం
• అనగనగా ఎదసడిగా
వడివడిగా నను తాకుతోంది ఏదో.
• తడిపొడిగా తడబడగా
సవ్వడిగా నను మీటుతుంది ఏదో.
• తెలియని ఈ వింత తో ఏదో పులకింత.
మది పలికిన భాష తో ఏదో కలవరింత.
• అనగనగా ఎదసడిగా
వడివడిగా నను తాకుతోంది ఏదో.
• తడిపొడిగా తడబడగా
సవ్వడిగా నను మీటుతుంది ఏదో.
• బదులే తెలియని ఈ తపనల తో
వేసే అడుగు లోని వేగం
వెచ్చగా కవ్విస్తుంది.
• మనసే ఎరుగని ఈ ఆశల కు
వీచే గాలి లోని శీతలం
సుతి మెత్తగా నవ్విస్తుంది.
• ఎందుకో … అసలు ఎందుకో
ఈ కలలకు గజ్జెలు ఎందుకో
ఈ ఊహల కద్దులు లేవెందుకో.
• చిగురే తెలియని ప్రేమ కు
పువ్వు లోని అందం
అంధత్వం తో అలరిస్తుంది.
• అలుపే ఎరుగని ఈ ఉద్వేగాల కు
కవిత లోని భావం
శూన్యం తో జత చేస్తుంది.
• ఎందుకో … అసలు ఎందుకో
ఈ అలల ఆటుపోటులు ఎందుకో
ఈ వలల బంధనాలు ఎందుకో.
• అనగనగా ఎదసడిగా
వడివడిగా నను తాకుతోంది ఏదో.
• తడిపొడిగా తడబడగా
సవ్వడిగా నను మీటుతుంది ఏదో.
యడ్ల శ్రీనివాసరావు 23 July 2023 10:30 AM
No comments:
Post a Comment