కనివిని ఎరుగని కావ్యం
• కదలవు లే వదలవు లే
కనీవినీ ఎరుగని ఈ కావ్యము లే
కదలవు లే వదలవు లే
కనీవినీ ఎరుగని ఈ కావ్యము లే.
• చిరుజల్లు తోటి సింగారి లా
శ్రీకారమైన ఈ స్రవంతి
సెలయేరు లోని తామర లా
జాలువారు తోంది జావళి గా.
• కదలవు లే వదలవు లే
కనీవినీ ఎరుగని నా కావ్యము లే
కదలవు లే వదలవు లే
కనీవినీ ఎరుగని నా కావ్యము లే.
• ఉమ్మెత్త లోని అందాలు
కొత్తం గ దిద్దే ఓనాడు.
• చామంతి లోని చందాలు
చక్కం గ అద్దే ఈనాడు.
• సొగసు పంచే టి ప్రకృతి కే
ప్రేమ పంచే ను ఈ కావ్యం
• మనసు పిండే టి వేదన కే
మందు అయ్యే ను ఈ భాష్యం.
• కదలవు లే వదలవు లే
కనీవినీ ఎరుగని ఈ కావ్యము లే
కదలవు లే వదలవు లే
కనీవినీ ఎరుగని ఈ కావ్యము లే.
• కానరాని అందాలను ఎన్నో
అక్షరాల లో చూపాయి.
• దాగలేని భావాలను ఎన్నో
మధురం గా చేసాయి.
• దేహం రాసేటి ఈ రాతలు
దైవం ఎరిగిన తలంపులు.
• భావోద్వేగాల *సం భోగం
ఈ సాహితి సప్తపది.
• కదలవు లే వదలవు లే
కనీవినీ ఎరుగని ఈ కావ్యము లే
కదలవు లే వదలవు లే
కనీవినీ ఎరుగని ఈ కావ్యము లే.
సం భోగం = ఉత్తమ మైన మేళవింపు
యడ్ల శ్రీనివాసరావు 15 July 2023 , 10:00 PM
( On the occasion of Inter National Talent and Skills Day 15 July )
No comments:
Post a Comment