Saturday, February 1, 2025

595. మానవులు యంత్రాలు కాదు...జీవులు - 1

 

  మానవులు యంత్రాలు కాదు . . .

 జీవులు  - 1



• మనమందరం  ఈ ప్రపంచంలో  ఉన్నత ప్రయోజనం కోసం జన్మించిన ప్రత్యేకత కలవారం .  అందులో భాగంగా ఉదయం నుండి రాత్రి వరకు జీవితాన్ని గడపడం,  ఉదయం తయారవ్వడం, పనికి వెళ్లడం, భోజనం వండడం మరియు రోజు  చివరిలో నిద్రపోవడం  వంటి పనులతో నిత్యం జరుగుతూ ఉంది.

• ఇది మాత్రమే కాకుండా ఈ జీవితకాలంలో మనకు గొప్ప లక్ష్యం కూడా ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? …  ‘ నేను ‘  ఈ జన్మలో జీవం తీసుకున్నందుకు (పుట్టినందుకు),  నాకు ఒక ప్రత్యేక కారణం ఉంది,  అనే విషయం ఏనాడైనా ఆలోచించారా?  ఆ కారణం నేను తెలుసుకున్నాను లేక తెలుసుకోకుండానే మరణించి , మరలా అది తెలుసుకునేంత  వరకు  మరణిస్తూ ,  జన్మిస్తూ నే ఉంటాను అనే వాస్తవం గ్రహించ గలిగారా ?

• ఉదాహరణకు మీ ఇంట్లో ఎయిర్ కండీషనర్ లాంటి యంత్రం ఉంది. మనం దానిని ఆన్ చేసినప్పుడు అది నడుస్తుంది  మరియు  మనం ఆఫ్ చేసినప్పుడు అది ఆగిపోతుంది.  అంతకు మించి దానికి గొప్ప పని ఏమీ లేదు. అది పాడైనపుడు, ఎందుకూ పనికి రాక ఊరకనే ఉంటుంది. అప్పుడు ఎదో ఒక రోజు మనం దానిని శాశ్వతంగా విస్మరించి, దానిని విడిచిపెట్టే సమయం వస్తుంది.

• మనమందరం మొదట మానవ జీవులం, కేవలం మానవ యంత్రాలం మాత్రమే కాదు. మానవ యంత్రాలు ఉదయం నుండి రాత్రి వరకు పనిచేస్తాయి, ఉన్నత ప్రయోజనం అంటే ఏమిటో తెలియకుండా వివిధ చర్యలను చేస్తాయి.

• మానవులకు ఒక ఉన్నత లక్ష్యం ఉంది – జీవితానికి అవసరమైన చర్యలను చేస్తూ ,  జీవి  (నశించని ప్రాణం)  పైన ద్రుష్టి పెట్టడం. కాబట్టి, మానవుడు తానొక  యంత్రంలా ఉండకూడదు.

• మనం మన ఆఫీస్ లోకి అడుగు పెడుతున్నపుడు లేదా మన ఇల్లు మరియు కుటుంబాన్ని చూసుకుంటున్నపుడు, మన స్నేహితులతో సంభాషించినప్పుడు , ఏదో ఒక రోజు మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి, మనతో ఏమీ తీసుకెళ్లలేమని తెలుసుకొని  వాస్తవిక స్పృహ లో ఉందాం.

• ఈ శరీరాన్ని అలంకరించిన దుస్తులు, శరీరం  లేనప్పుడు వెంట రావు. మీరు సాధించిన ఆర్థిక విజయం అనేది కేవలం వృత్తిపరంగా పొందినది. ఈ వృత్తి , ఏదొక రోజు శాశ్వతం గా ఆగిపోతుంది. అందమైన సంబంధాలు, రూపాలు మరియు బాహ్య వ్యక్తిత్వం అనగా బయట మీ కళ్లకు కనిపించేవి ఏ ఒక్కటీ మీతో పాటు కూడా రావు అనే వాస్తవం , మీ స్పృహ లో బలం గా ఉండాలి.


• కాబట్టి,   ఈ క్షణం కాసేపు  ఆగి  లోలోపలికి చూసుకోండి.  నేను ,  నా కొడుకు,  నా కుమార్తె లేదా   నా భర్త  ,  నా భార్యను  ప్రేమిస్తున్నాను,  కానీ ఏదో ఒక రోజు   నేను  ఈ భౌతిక  వస్త్రాన్ని  (శరీరం) విడిచిపెట్టినప్పుడు  వారు నాతో ఉండరు.  నాకు, నా జీవిత లక్ష్యం వారిని చూసుకోవడం కావచ్చు. కానీ నా ఉన్నత ఉద్దేశ్యం నా అంతర్గత స్వభావాన్ని,  నా సంస్కారాలను, నా అంతర్గత అస్తిత్వాన్ని చూసుకోవడం,  వీటిని నేను నాతో పాటు తీసుకువెళతాను.  నేను తిరిగి జన్మించినపుడు,  ఇవే నాతో మరలా ఉంటాయి.

కాబట్టి ,  ప్రతి ఉదయం ఒక ధృవీకరణ తీసుకోండి – నేను రోజంతా నా అంతర్గత స్వభావాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడాన్ని  మరియు  నేను కలిసే ప్రతి ఒక్కరికీ  ఆనందాన్ని  ఇవ్వడాన్ని ఎంచుకుంటాను. నేను పనిలో  మంచిగా ఉండటాన్ని ఎంచుకుంటాను, కానీ నా చర్యలపై కూడా పని చేస్తాను, ఇది నాకు అందరి నుండి ఆశీర్వాదాలను పొందేలా చేస్తుంది.

అలాగే, నేను ప్రతి ఒక్కరికీ మంచితనానికి అద్దంలా ఉండటాన్ని ఎంచుకుంటాను,   దీనిలో ఇతరులు సానుకూలతను చూస్తారు మరియు మంచి మనుషులుగా మారడానికి ప్రేరణ పొందుతారు. ఎందుకు?   ఎందుకంటే మీరు ప్రత్యేకమైన వారు, ప్రత్యేకమైన  మానవులు,   సాధారణ  మానవులు కారు!


యడ్ల శ్రీనివాసరావు 2 Feb 2025, 1:00 PM.



1 comment:

598. శివుని కి అంకితం

  శివుని కి  అంకితం • ఈ జీవితం    నీకు   అంకితం   ఈ జీవితం    నీకు   అంకితం • సత్య మైన   ప్రేమను   చూపినందుకు . • ముళ్ల వంటి   మమ్ము   పుష్ప...