మానవులు యంత్రాలు కాదు . . .
జీవులు - 2
• మీరు ప్రతిరోజు దినచర్యను ప్రారంభించినప్పుడల్లా, మీ చుట్టూ ఉన్న ప్రతిదీ మరియు ప్రతి ఒక్కరినీ చూస్తూ నా విద్య, నా వృత్తిపరమైన అర్హతలు, నా సంపద మరియు నేను ప్రస్తుతం పోషిస్తున్న పాత్ర – వీటితో పాటు ఇంకా మరెన్నో కూడా నాది కాదు , నిజం గా నావి కావు , నా సొంతం కాదు అనే విషయాన్ని లోతుగా గ్రహించండి.
• ఎందుకంటే, ముందుగా మీ అసలు మూలం లోకి వెళ్లి చూస్తే , మీరు భౌతికం (Mass శరీరం) కానటువంటి శాంతి, ప్రేమ మరియు ఆనందంతో మొదట పూర్తిగా నిండి ఉన్నారు (ఉండేవారు) . మీ భౌతిక శరీరం , వస్తువులు, వ్యక్తులు, సన్నిహిత సంబంధాలు మరియు మిగతావన్నీ కూడా మీరు తరువాత కర్మల అనుసారంగా పొందినవి.
• భౌతికం కానిదొకటి (శక్తి ) భౌతికతను నియంత్రిస్తూ నడుపుతుంది అని గ్రహించాలి. భౌతికం కానిదే శాశ్వతమైనది. భౌతికం అనేది కేవలం ఈ ఒక జీవితకాలానికి మాత్రమే పరిమితం చేయబడింది.
• సంతోషం అనేది మనం వెతుకుతున్న ప్రాథమిక సుగుణం. అలాగే, మనం శాంతి మరియు ప్రేమ కోసం వెతుకుతున్నాము. మీ స్మృతి , తలంపు భౌతికత చుట్టూ కేంద్రీకృతమై ఉన్నంత వరకు, ఈ మూడు భావోద్వేగాలను (ప్రేమ , శాంతి , సంతోషం ) మీరు శాశ్వతంగా మరియు ఎప్పటికీ అనుభవం చేసుకోలేరు. అవి తాత్కాలికంగా వస్తూ, పోతూ ఉంటాయి.
ఎందుకంటే, భౌతికమైన ప్రతిదీ తాత్కాలికమైనది మరియు సందర్భానుసారంగా మార్చుకోగలిగేది. ఈ రోజు మీ సంబంధాలు బాగుంటాయి, మరొక రోజు సహకారం లేనప్పుడు బాగుండవు. కొన్నిసార్లు, ఆఫీసు కార్యాలయంలో ప్రతిదీ సజావుగా జరుగుతుండగా, మరొకటి అసంపూర్ణమైన పనులు మరియు గడువుల ఒత్తిడి ఉంటుంది. ఇది మీకు శాంతి లేని అనుభూతిని కలిగిస్తుంది.
• అలాగే, కొన్నిసార్లు భౌతిక మైన మీ శరీరం , ఆరోగ్యంగా బాగా నడుస్తుంది. అకస్మాత్తుగా ఒక అనారోగ్యం తలెత్తినప్పుడు మీరు మీ అంతర్గత సంతృప్తిని మరియు ఆరోగ్య అనుభూతిని కోల్పోతారు. కాబట్టి, జీవితం మలుపులతో కూడినది. మీ స్మృతి మీ అంతర్గతమైన దానిపై (శక్తి పై) కేంద్రీకృతమైనప్పుడు , మీరు సదా శాంతియుతంగా, ప్రేమగా మరియు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీ శాంతి, ప్రేమ, సంతోషానికి పునాది శాశ్వతమైనది మరియు మార్చలేనిది .
అలాగే, మీ ఉనికికి అనాది యైన మీ అంతర్గత స్వయాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు , మీరు మీ చుట్టూ ఉన్న బయటి పరిస్థితులకు ఏ మాత్రం ప్రభావితం కాలేరు. అవి వస్తూ పోతూ ఉంటాయి (just like passing clouds) కానీ మీరు మాత్రం స్థిరంగా, నిశ్చలంగా ఉంటారు. ఎందుకంటే మీరు శాంతి, ప్రేమ, సంతోషాలకు మూలం మరియు చిరునామా. మీరు మీ జీవితంలోని ప్రతి పరిస్థితిని వాటితో మీ కోసం మరియు ఇతరుల కోసం కూడా నింపుతారు.
• ఇకపై వాటికోసం మీకు నేడు ఉన్న పరిస్థితులు మూలం మరియు ఆధారం కాదు. శాంతి, ప్రేమ, సంతోషాలను మీరు నింపుకుని ఉండటానికి , ఇకపై మీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద మీరు ఏ మాత్రం ఆధారపడరు .
యడ్ల శ్రీనివాసరావు 2 Feb 2025, 1:00 PM
No comments:
Post a Comment