శివ సంగమం
• మనసే మందిర మాయే
శివ బాబా
నీ తలపే సుందర మాయే.
• నీ ఛత్రఛాయ లో సేవ యే మాకు సేద.
• అబముసుబము తెలియని పిల్లలము
నీ ఒడి యే మాకు ప్రీతిపాత్రము.
• మనసే మందిర మాయే
శివ బాబా
నీ తలపే సుందర మాయే
• నీ శక్తి తో నడిచే జీవులం.
నిను తెలుసుకో లేక జీవిస్తుంటాం.
• విషయ వికారాల విధి వంచితులం
భ్రమణ బుద్ధి తో పరి భ్రమిస్తుంటాం.
• నీ స్మరణ తో నిండెను మనో ధైర్యము.
నీ దృష్టి తో కలిగెను శాంతి సుఖము.
• మనసే మందిర మాయే
శివ బాబా
నీ తలపే సుందర మాయే
• ఆలోచనల కళ్లెం
ఆనంద సంభూతం.
• అనుభవాల పళ్లెం
విరిసిన వైకుంఠం.
• దివ్య లోకం లోని నీవు
దూర తీరంలో మేము
సంగమ మైతిమి నేడు.
• ఈ వర్తమానం లో మేము
పరివర్తన అయి
నిన్ను చేరుకుంటాము.
• మనసే మందిర మాయే
శివ బాబా
నీ తలపే సుందర మాయే.
సంభూతం = పుట్టినది
పళ్లెం = తాంబూల పాత్ర
On the way to Mount Abu ✍️
శివరాత్రి శుభాకాంక్షలు 💐
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 21 Feb 2025 11:00 AM.
No comments:
Post a Comment