శివుని కి అంకితం
• ఈ జీవితం నీకు అంకితం
ఈ జీవితం నీకు అంకితం
• సత్య మైన ప్రేమను చూపినందుకు .
• ముళ్ల వంటి మమ్ము
పుష్పాలు గ చేసినందుకు.
• ఈ జీవితం నీకు అంకితం
ఈ జీవితం నీకు. అంకితం.
• గతి తెలియని మాకు
సద్గతి ని ఇచ్చావు.
• బొమ్మలా ఆడే ఆటే
ఈ జీవితం అని చెప్పావు.
• నీవు తెలుపకుంటే
పాప పుణ్యాల సూక్ష్మం ఎరుగము.
• నీవు మాటాడక ఉంటే
భక్తి జ్ఞానాల భేధం తెలియకుంటిమి.
• ఈ జీవితం నీకు అంకితం
ఈ జీవితం నీకు అంకితం
• సత్య మైన ప్రేమను చూపినందుకు.
• ముళ్లు వంటి మమ్ము
పుష్పాలు గ చేసినందుకు.
• మాయ మోహల ఆదరణ
నిజమని అనుకున్నాము.
• ఆశ అత్యాశ ల నడుమ
ఊయల ఊగాము.
• కల్లబొల్లి కబుర్లు తో కాలక్షేపం చేస్తాము.
కానీ . . .
• కాల క్షేమానికి కావలసిన
జీవన్ముక్తి ని తెలుసుకోము.
• నీవు తెలియకుంటే
ఈ జీవితం వృధా యే
• ఈ జీవితం నీకు అంకితం
ఈ జీవితం నీకు అంకితం
• సత్య మైన ప్రేమను చూపినందుకు.
• ముళ్ల వంటి మమ్ము
పుష్పాలు గ చేసినందుకు.
• ఈ జీవితం నీకు అంకితం
ఈ జీవితం నీకు అంకితం.
యడ్ల శ్రీనివాసరావు 6 Feb 2025, 4:00 pm
No comments:
Post a Comment