Thursday, February 29, 2024

471. శివ కీర్తన

 

శివ కీర్తన


• ఎన్ని    జన్మలెత్తిన

  ఎంత  జపము   చేసిన

  కలుగు   నీ   భాగ్యం

  ఈ   భాగ్యం.


• కావ్య  కీర్తన తో   

  కలిగె

  నా  మది  సౌఖ్యం.

  నా  మది  సౌఖ్యం.


• కదలిక ల      కవళిక ల

  కనుసన్న ల    నిలిచె 

  నీ   రూపం

  జ్యోతి   స్వరూపం.


• మైమరచి న    మనసు న

  మౌనము న     కలిగె

  నీ   ధ్యానం

  స్మృతి    శ్రీకారం.


• ఎన్ని    జన్మలెత్తిన

  ఎంత   జపము  చేసిన

  కలుగు   నీ భాగ్యం

  ఈ   భాగ్యం.


• కావ్య కీర్తన తో   

  కలిగె

  నా మది   సౌఖ్యం.

  నా మది   సౌఖ్యం.


• పిలిచి న     పణము న

  పలుకు న     ఒరిగె 

  నీ   ప్రేమం

  దాస్య    బీజం.


• నడచి న     నమిలి న

  నిదుర న     విడవ 

  నీ  నామం

  ధ్యాస   మయం.


• సంకల్పా ల     సావధానా ల

  సాంగత్యా ల    సంగమం

  నీ   సన్నిధానం

  సదా   మహిమాన్వితం.


• శివం    శవం

  సం యోగం     స  జీవనం.


• ఎన్ని   జన్మలెత్తిన

  ఎంత  జపము  చేసిన

  కలుగు  నీ  భాగ్యం

  ఈ  భాగ్యం.


యడ్ల శ్రీనివాసరావు 1 March 2024 5:00 AM


Sunday, February 25, 2024

470. ఒక మంత్రం

 

ఒక మంత్రం



• చెపుతా    ఒక   మంత్రం

  చెపుతా    ఒక    మంత్రం

• అది   జీవన   వేద  తంత్రం

  మానవ   మనుగడకి    శక్తి  యంత్రం.


• ఆ    మంత్రం   పేరు

  ఓం   నమఃశివాయ.

  అది  పలికిన  కలుగు

  సుఖ  సంతోషాల  సౌఖ్యం.


• ఆ   మంత్రానికి   అర్దం

  నేనొక    ఆత్మను   

  చేస్తున్నాను

  శివ   పరమాత్మ కు  వందనం.


• చెపుతా    ఒక    మంత్రం

  చెపుతా    ఒక    మంత్రం

• అది  జీవన  వేద    తంత్రం

  మానవ  మనుగడకి   శక్తి  యంత్రం.


• కలియుగ   మాయలో  విలవిలాడే 

  మనిషికి    ఇది    ఒక   కవచం.

• మనసు పై    దాడి  చేసే    రావణ

  వికారాలకు   ఇది   ఒక    అస్త్రం.


• ఈ   పంచాక్షరీ   మంత్రం

  దేవతలందరూ   ధ్యానించారు

  సర్వ   ప్రాప్తులను   పొందారు.

 

• ఈ రాజయోగ   తంత్రం

  మునులందరూ   స్మృతి  చేసారు

  జీవన్ముక్తి ని    పొందారు.


• చెపుతా    ఒక   మంత్రం

  చెపుతా    ఒక    మంత్రం

• అది    జీవన    వేద  తంత్రం

  మానవ  మనుగడకి   శక్తి  యంత్రం.


యడ్ల శ్రీనివాసరావు 26 Feb 2024 , 6:00 AM.


Thursday, February 22, 2024

469. కెరటం


కెరటం 


• పడిలేచే   కెరటమా

  పరుగెందుకు

  నీకు    పరుగెందుకు.

• పరుగు  ఎంత  పెట్టినా

  దూరమెంత   ఏగినా 

   నీ గమ్యం   మారునా ...


• పడిలేచే    కెరటమా

  పరుగెందుకు

  నీకు    పరుగెందుకు.


• తీరం    దాటాలని

  ఉరకలేస్తు    ఉంటావు.

• ఆకాశం    తాకాలని

  ఎగసి  ఎగసి   పడతావు.


• హద్ధు  లెరగని   కెరటమా

  నీ పయనం    ఎటు  వైపు.

• ముద్దు  గొలిపే   తరంగమా 

  నీ  తపనం   ఎన్నాళ్లు.


• పడిలేచే     కెరటమా

  పరుగెందుకు

  నీకు    పరుగెందుకు.

• పరుగు   ఎంత   పెట్టినా

  దూరమెంత    ఏగినా

  నీ  గమ్యం.  మారునా ...


• ఘోష   ఎంత    చేసినా

  సాగరం   దాటి   పోలేవు లే.

• లోతు   ఎంత   దాగినా 

  పరిధి   మీటి   రాలేవు లే.

 

• రతనాలు   ఎన్ని  పొదిగినా

  నీ రంగు    మారిపోదు లే.

• మాలిన్యం   ఎంత   చేరినా

  నీ శోభ   చెక్కు   చెదరదు లే.


• పడిలేచే      కెరటమా

  పరుగెందుకు

  నీకు   పరుగెందుకు.

• పరుగు   ఎంత   పెట్టినా

  దూరమెంత   ఏగినా 

  నీ గమ్యం    మారునా ...


యడ్ల శ్రీనివాసరావు  21 Feb 2024  10:00 PM


Tuesday, February 20, 2024

468. మనసు లోని దైవం


 మనసు లోని దైవం


• మనసు   లో ని    దైవమా

  వేచి ఉన్నాను   నీ ముంగిట.


• అమితమైన  ఆనందం   నీ చెంత

  ఆదమరవకున్నాను       నీ ఇంట.


• మనసు  లో ని    దైవమా

  వేచి ఉన్నాను   నీ ముంగిట.


• చూడు  …   ఇటు చూడు

  ఈ  పతిత  ప్రపంచం లో    ఎలా   ఉండాలి.

  ఈ  మాయా  లోకం లో      ఏమి  చేయాలి.

 

• జీవితం     ఓ బూటకపు   నాటకం.

  బంధాల   వలలు    ఆత్మకు    చెదలు.


• నీ  స్మృతి లోనే   వికర్మల ఖాతా   శూన్యం.

  నీ   గతి లోనే     సకర్మలు   ఆరంభం.


• మనసు   లో ని    దైవమా

  వేచి ఉన్నాను   నీ  ముంగిట.


• అమితమైన  ఆనందం   నీ చెంత

  ఆదమరవకున్నాను       నీ ఇంట.


• పొరలు  కమ్మిన  మనిషి కి 

  జ్ఞానం  ఒక  యోగం.

• అలలు  చేరిన   మనసు కి 

  ధ్యానం  ఒక   ఔషధం.


• మూసిన  కనులు  చూస్తున్నాయి

  నీ  దివ్య వెలుగు.

• తెరిచిన  కనులు   వెతుకుతున్నాయి

  నీ  సత్య  మార్గం.


• మనసు    లో ని     దైవమా

  వేచి ఉన్నాను    నీ ముంగిట.

యడ్ల శ్రీనివాసరావు  20 Feb 2024 , 10:00 pm.

Thursday, February 15, 2024

467. శివుని మనసు

 

శివుని మనసు


• మనసు    మందిరం

  నా శివుని   మనసు   సుందరం.

• ప్రేమ     అనంతం 

  నా శివుని   ప్రేమ    అంతరం.


• నిరుపేద    హృదయాలు

  సేద తీరు      ఆలయం.

• శుద్ధమైన       భావనలు

  జనియించే     గ్రంధాలయం.


• మనసు      మందిరం

  నా శివుని    మనసు  సుందరం.

• ప్రేమ      అనంతం 

  నా శివుని    ప్రేమ   అంతరం  .


• మనో కామనలు    తీరేటి   దేవాలయం

  అంతర్ముఖు ల కు    ఆనంద వైభోగం.

• ముళ్లను   పుష్పాలు    చేసే   ఉద్యానవనం.

  జీవ సత్యాలను    తెలిపే     భాండాగారం .


• ప్రేమ    అనంతం  

  నా శివుని    ప్రేమ  అంతరం  .


• దేహ వికారాలు   వడపోసే   కర్మాగారం

  పామరులకు  దారి   చూపు    జ్ఞాన సాగరం.

• నరుని    నారాయణుని   చేసే   విద్యాలయం.

  పండితులకు   మోక్షమిచ్ఛు   కైలాస   శిఖరం.


• మనసు    మందిరం

  నా శివుని    మనసు  మందిరం.

• ప్రేమ    అనంతం  

  నా శివుని    ప్రేమ  అంతరం.


• అమృత   వేళలో    మధురం తో

  మాటాడే    శాంతి రూపం.

• ఆత్మీయత తో     వెన్నంటి

  ఉండే   శక్తి    స్వరూపం.



యడ్ల శ్రీనివాసరావు 16 Feb 2024 12:30 am.


Wednesday, February 14, 2024

466. వసంత పంచమి - బ్రహ్మ జ్ఞానేశ్వరి

 

బ్రహ్మ జ్ఞానేశ్వరి

వసంత పంచమి 


• అభినేత్రి     ధరధాత్రి

  నడయాడే   సఖిదేవి.

• వాదనము    తంతిన

  పలికించిన    నాదము 

  పులకించిన   ప్రకృతి   విశ్వంభర.


• శ్రీవాణి        అలివేణి 

  కొనియాడే    వేదాగ్రణి.

• సృష్టి    చలన   ధారిణి

  విశుద్ధ   చక్ర   రూపిణీ

  జపియించిన   జాగృతి  జ్ఞానేశ్వరి.


• మీటిన   తరంగాల   మాత్రిక

  జీవుల    చైతన్య    మాలిక.

• ప్రాస    లయల      మాత్రుక

  శక్తి       ఉద్భవన     సారిక.


• అభినేత్రి     ధరధాత్రి

  నడయాడే   సఖిదేవి.

• శ్రీవాణి       అలివేణి

  కొనియాడే    వేదాగ్రణి.


• వసంతమున    వాగ్దేవి

  వికసించిన    హోలీ  హంస.

• బ్రహ్మ    జ్ఞానము కి

  తిలక   స్వరూపిణి   మమ్మా.

• బ్రహ్మ కుమారీల   జ్ఞాన  కలశం లో 

  జగదాంబ   సరస్వతి    మమ్మా.


• అభినేత్రి       ధరధాత్రి

  నడయాడే     సఖిదేవి.

• శ్రీవాణి        అలివేణి

  కొనియాడే     వేదాగ్రణి.

• శబ్దరూపిణి      అర్దభావణి

  అలల   తరంగణి 

  ఆనందాల  కల్పదాయిణి.


యడ్ల శ్రీనివాసరావు 15 Feb 2024 1:30 Am.


Tuesday, February 13, 2024

465. ప్రేయసి పరమాత్మ


ప్రేయసి  పరమాత్మ  

ప్రేమికుల  దినోత్సవం


• సంగమం … సంగమం

  ఆత్మ పరమాత్మ ల అపూర్వ సంగమం.

  ఇదే ఇదే   ఈ జన్మకు   శుభోదయం.


• పరమాత్మ   కలయిక తో   కదిలింది

  లో లోని  అణువణువు

• అదే అదే   నా మనసు ని

  నిలిపిన    స్థాణువు.


• సంగమం … సంగమం

  ఆత్మ పరమాత్మ ల   అపూర్వ  సంగమం.

  ఇదే ఇదే    ఈ జన్మకు  శుభోదయం.


• కంట జారు నీటికి   ఇక   కలత లేదు

  భారమైన మదికి    ఇక  దిగులు లేదు.


• ఒడిని  చేర్చుకున్న     తండ్రి   శివుడు.

  ప్రేమ    పంచిన    ప్రేయసి   పరమాత్ముడు.

  మనసు కు   తోడున్న   వాడే    విభుడు.


• సంగమం … సంగమం

  ఆత్మ పరమాత్మ ల    అపూర్వ  సంగమం.

  ఇదే ఇదే    ఈ జన్మకు  శుభోదయం


• బంధాలతో    పొందిన

  వైరాగ్యం   ఇక   సమాప్తం.

• శివుని  ఆలంబనతో  పొందిన

  భాగ్యం    ఆరంభం.


• ఆటలెన్నో   ఆడింది   మాయ.

  ఇక   ఆడితే   జరిగబోయేది  

  మనోనేత్రపు    వ్యధమేధం.


• సంగమం … సంగమం

  ఆత్మ పరమాత్మ ల    అపూర్వ  సంగమం.

  ఇదే ఇదే   ఈ జన్మకు   శుభోదయం


• పరమాత్మ   కలయిక తో   కదిలింది

  లో లోని   అణువణువు

•  అదే అదే   నా మనసు ని

  నిలిపిన    స్థాణువు.


యడ్ల శ్రీనివాసరావు 13 Feb 2024 , 10:00 pm


Sunday, February 11, 2024

464. శివుని తో మాటలు

 

శివుని తో మాటలు



• బాబా    శివ బాబా

  లాలినై   చేరాను   నీ ఒడికి

  విద్యార్థి నై   వచ్చాను   నీ బడికి


• నీ పవళింపు లో    హాయి మధురం.

  నీ చదువు లో     వాసి ఉన్నతం.


• ఆటపాటల    ఆనందం   ఈ సమయం.

  జ్ఞానభోధల    కలశం    ఈ రాజయోగం.


• ఈ పకృతి   అందాల  మధువనం

  స్వర్గ లోకానికి   తలమానికం.

• ఈ శాంతి  నిలయాల  సంగమం

  కైలాస   శిఖర    మండలం.


• బాబా    శివ బాబా

  లాలినై   చేరాను     నీ ఒడికి

  విద్యార్థి నై   వచ్చాను  నీ బడికి.


• నీ పవళింపు లో   హాయి మధురం.

  నీ చదువు లో   వాసి  ఉన్నతం.


• పరమాత్మ  నడిచిన  నేల   తాకగా 

  ఆది అంత్యాల   నాటకం  తెలిసింది.

• తీరని బుణం    మాటలయితే

  తరగని ధనం   మౌనమని  తెలిసింది.

• నలుగురిలో   నడత కు   నటన కావాలని

  ఏకాంతం లో   ఐక్యమే   శ్రేష్టమని తెలిసింది.


• బాబా   శివ బాబా

  లాలినై   చేరాను     నీ ఒడికి

  విద్యార్థి నై   వచ్చాను   నీ బడికి


• నీ పవళింపు లో   హాయి  మధురం.

  నీ చదువు లో  వాసి  ఉన్నతం.


యడ్ల శ్రీనివాసరావు 11 Feb 2024 , 8:00 PM.


Friday, February 9, 2024

463. ఏకాంత మెంత హాయి

 

ఏకాంత మెంత హాయి


• ఏకాంత  మెంత  హాయి

  ఏ కాంతి   ఇది   ఓయి.


• తలచిన   తారలలో   నిలిచిన   నీడ ను

  మరచిన మండలం   తిరిగి చేరిన    తోడు ను.

  తోడు నీడ ఒకటే   అయిన   ఆత్మ బిందువు ను.


• ఏకాంత   మెంత  హాయి

  ఏ కాంతి   ఇది   ఓయి.


• శివుని  అడుగు తో   వెలిగిన  విశ్వం

  నరుని చూపుకి     దొరికిన  భాగ్యం.


• వెలుగు   నేనయి    ఉన్నాను.

  చీకటి    నేనయి    ఉన్నాను.

  శూన్యం లో   తేలి   ఉన్నాను.


• ఏకాంత  మెంత   హాయి

  ఏ కాంతి   ఇది    ఓయి.


• ఇహ   లోకం    దాటాను 

  అమర  లోకం   చేరాను


• మూలం  లో   శబ్దం   వినిపిస్తోంది

  అది   ప్రణవ   నాదమైన   ఓం కారం.

• విశ్వం లో   మూలం     కనిపిస్తుంది

  అది   మంగళ   రూపమైన    శ్రీ కారం.


• ఏకాంత    మెంత   హాయి

  ఏ కాంతి   ఇది     ఓయి.


యడ్ల శ్రీనివాసరావు 10 Feb 2024 3:00 AM.


462. తీర పయనం

 

తీర పయనం


• దూర   తీరాన   పయనం

  జన్మ కు   దొరికిన   భాగ్యం.

  అడుగులు  పడుతున్న   వయనం

  మది     అవుతుంది    మేఘం.


• కానరాని   లోకంలో     

  కనిపించే ను     దైవం.

  తాకలేని   రూపం లో   

  ప్రసరించే ను    చైతన్యం.


• అనుభవాల ఆనందం లో 

  స్మృతులెన్నో    గడిచాయి.

  సేవ   సౌభాగ్యాల   సంగమం

  శేషం   మిగిలి   ఉంది.


• దూర   తీరాన   పయనం

  జన్మ కు   దొరికిన    భాగ్యం.

  అడుగులు  పడుతున్న  వయనం

  మది   అవుతుంది     మేఘం.


• దైవం తో    సంధానం 

  యుగ యుగాల  పుణ్యఫలం.

  సాధన లోని    ధనమంతా 

  జన్మ జన్మల   సార్థకం.


• మనసు లోని    శివముంటే 

  మనిషవుతాడు   సుందరం.

  ఆత్మ శుద్ధితో    జీవనం 

  ఎన్నో   కర్మల   విశేషం.


• దూర  తీరాన   పయనం

  జన్మ కు   దొరికిన  భాగ్యం.

  అడుగులు   పడుతున్న  వయనం

  మది  అవుతుంది   మేఘం.


• పరమాత్మ   నెరిగిన   ఆత్మ

  స్వర్గాన్ని     చూస్తుంది. 

  అడుగులు   వేస్తోంది.


యడ్ల శ్రీనివాసరావు 9 Feb 2024 , 6:00 pm.



Thursday, February 8, 2024

461. అలల గోదారి

 

అలల గోదారి



• అలల   గోదారి    రమ్మంటోంది.

  కలల   కావ్యాలు  తెమ్మంటోది.


• శుభోదయపు    కౌగిలి లో

  మంచు తెరల   కొంగులో   

  సూర్యుడు   దాగున్నాడు.

• గోదావరి   శాంతం లో 

  గలగలల    గానం  తో 

  పరవళ్లు   తొక్కుతోంది.


• అలల  గోదారి  రమ్మంటోంది.

  కలల  కావ్యాలు  తెమ్మంటోది.


• రవి   కిరణాల   కౌసల్యం 

  రస  రంజకం   చేస్తుంటే

  రాజ   భోగాల   సౌందర్యం

  మనసు ను    తాకుతుంది.


• బంగారు   వర్ణం లో

  గోదావరి   మెరుస్తుంటే

  సింగారి    నీలం లో

  ఆకాశం    నవ్వుతుంది.


• అలల  గోదారి    రమ్మంటోంది.

  కలల  కావ్యాలు   తెమ్మంటోది.


• ఎగిరే గువ్వల   సంబరాలు

  ఎదలో రేపెను   మధుర  భావాలు

• ఏకాంతమైన    ఈ క్షణాల లో 

  ఏమరించెను   ఈ   జీవం.


• అలల  గోదారి      రమ్మంటోంది.

  కలల   కావ్యాలు   తెమ్మంటోది.


యడ్ల శ్రీనివాసరావు  8 Feb 2024 , 6:30 pm.


Tuesday, February 6, 2024

460. మనో శతకం - 7

 

మనో శతకం - 7



ఆడకెన్నడు    ఆటల్    మతులతో 

జీవితంబాడిన    జీవికి   జీవంబుండదు.

అవసరంబున గాదు మనుజు  అవసరంబు నీవగు.

కాలం కలబడితే   కూలబడున్  బ్రతుకు

సుందర గుణేశ్వరా!    సంపన్నేశ్వరా!         |18|


భావం:

మనుషుల  మనసులతో  ఎన్నడూ ఆటలు ఆడకు.  

జీవితం కనుక  నీతో  ఆటాడడం మొదలెడితే నీకు జీవం లేకుండా చేస్తుంది.   

నీ  అవసరం కోసం మనుషులు కావాలని కోరుకోకు ,  నీవే మనుషుల కు  ఒక అవసరం గా  మారు.   

కాలం తిరగబడితే బ్రతుకు సర్వనాశనం అవుతుంది.

సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా, సంపన్నుడైన ఈశ్వరా.


🔱🔱🔱🔱🔱🔱


వీడిన  వికర్మ   జీవించు  కాలంబున

చేష్టలుడిగి నాడు   కార్యంబు దాల్చు 

కాలంబున దేహం   కర్మ  వదలకుండున్ 

సత్యంబెరిగి  ద్రవించుగొనిన  ధన్యుడగున్.

సుందర గుణేశ్వరా! సంపన్నేశ్వరా!          |19|


భావం :

చేసిన చెడు కర్మ  కాలంలోనే  స్థిరంగా జీవించి ఉంటుంది. 

చేష్టలు మితి మీరిన నాడు దాని  ఫలితం కనపడును.

శరీరం   కాలంలో  ఉన్నంతవరకు  ఎన్ని జన్మలెత్తినా కర్మ  వదలదు. 

జ్ఞానం తెలుసుకొని    కర్మ   కరిగించుకున్న వాడు  ధన్యుడు అగును.  

సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా, సంపన్నుడైన ఈశ్వరా.



యడ్ల శ్రీనివాసరావు 6 Feb 2024, 10:00 pm.


Monday, February 5, 2024

459. "మాయ" దారి మనిషి

 

"మాయ"దారి   మనిషి


• మాయదారి   మనోడు

  అందరు ఒకటే నంటాడు.

• మాయ లో    మునుగు తాడు

  మైకంతో   ఉంటాడు.


• అత్యాశతో    బ్రతుకు తాడు

  ఆనందం     కావాలంటాడు.

  మాటలు     చెపుతాడు

  ముగ్గు లో   దించుతాడు.

  చాప కింద నీరులా

  చాప కింద నీరులా ... పాకుతాడు 

  బెదిరిస్తే    బెంబేలు   పడతాడు.


• మాయదారి    మనోడు

  అందరు  ఒకటే  నంటాడు.

  మాయ లో   మునుగు తాడు

  మైకంతో  ఉంటాడు.


• మహిళలను   మహరాణులంటాడు 

  వికారాల   వల  వేస్తాడు.

  అడ్డదారు  లెతుకుతాడు 

  అది రాజ మార్గమంటాడు.

  మంచోళ్లే   తోడు  కావాలంటూ

  భ్రష్టు ను   పూసి …

  వారికి     భ్రష్టు ను    పూసి

  తానే   బంగారమంటాడు.

  

• మాయదారి    మనోడు

  అందరు   ఒకటే  నంటాడు.

  మాయ లో   మునుగు  తాడు

  మైకంతో    ఉంటాడు.


• మనిషి   మారడు   కానీ 

  మనుషులు   కావాలంటాడు.

  దొంగాటలు   ఆడుతాడు  కానీ 

  దొంగను    కాదంటాడు

  నీతులెన్నో    చెబుతాడు …

  నీతులెన్నో     చెబుతాడు

  అవి  ఇతరులకే  అంటాడు.


• మాయదారి   మనోడు

  అందరు  ఒకటే   నంటాడు.

  మాయ లో    మునుగు  తాడు

  మైకంతో   ఉంటాడు.


యడ్ల శ్రీనివాసరావు 5 Feb 2024 8:00 pm.


Saturday, February 3, 2024

458. మనో శతకం - 6

 

మనో శతకం - 6


స్థితి   స్థిరంబెరిగిన   పరిస్థితిలెన్నడు   పగలబడవు.

మతిన  మరకలున్న   మైలుబడి  మూలబడున్

దేహంబు    నిలవని    దైవమ్ బుద్ధికి  శాపమ్.

జ్ఞానంబెరిగిన   లోపంబుల్ పాపంబుల్  గావు.

సుందర గుణేశ్వరా!   సంపన్నేశ్వరా!           |16|


భావం:

మనిషి తాను ఉన్న స్థితి లో స్థిరత్వం, దృఢత్వం కలిగి ఉంటే , చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడూ వ్యతిరేకంగా కావు.

ఆలోచనల లో స్పష్టత లేకపోతే మనసు మలినమై మూలకు చేరును.

శరీరంలో దైవశక్తి నిలబడక పోతే అది బుద్ధి కి శాపం గా మారుతుంది.

జ్ఞానం తెలుసు కొని ఆచరించడం వలన లోపాలు సరిచేసుకోబడి పాపాలు గా మారవు.

సుందరమైన గుణములు గల ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!


🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️


వెతల్  వేలంబున  వెర్రి తలల్ వేయఁగా

మతుల్  జేరు  ధీనంబుతో  సుతల్

విధి యాడు  వింత నాటకంబున

మాయ మ్రోగించే భేరి  స్వనాశంబుకి.

సుందర గుణేశ్వరా!    సంపన్నేశ్వరా!           |17|

 

భావం:

దుష్ట తత్వం  అనేది  విచ్చలవిడితనం తో ప్రవర్తించిన  పిదప  మతి  హీనమై  పాతాళానికి  చేరుతుంది.  విధి ఆడే వింత నాటకంలో తన నాశనం కోసం మాయ యుద్ధభేరి  మోగిస్తుంది.  సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా! సంపన్నుడైన ఈశ్వరా!.

 

🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉


య️డ్ల. శ్రీనివాసరావు. 3 Feb 2024. 12:30 pm.




Thursday, February 1, 2024

457. మెట్టు

 

మెట్టు




• ధన్య వాదములు    శివా ధన్యవాదములు

  మార్గమును     శుచి చేసావు

  గమనము ను    సుగమనము  చేసావు

  ధన్య వాదములు     శివా ధన్యవాదములు


• రాచబాట ను వేశావు      నీ సన్నిధి కి

  రహస్య శత్రువులను   తప్పించావు    నా మంచికి

• ఉవ్విళ్ల తో    మనసు    ఊరేగుతుంది

  ఉరకలతో     తేలి      నిన్నే  చూస్తుంది.


• ధన్య వాదములు      శివా ధన్యవాదములు

  మార్గమును      శుచి చేసావు

  గమనము ను       సుగమనము చేసావు

  ధన్య వాదములు  శివా ధన్యవాదములు


• మిత్ర బంధాల  సంకెళ్లు     బానిసను చేశాయి.

  జగడాల జంగమం   నీ జాగీరు చేర్చింది.

• ఇక మౌనమే  నా భాష     ఊపిరే నీ  ధ్యాస

  సేవకుడి నై    నిను చేరడం    ఆశ.


• మధువనం వస్తాను     నీ ధ్యాన మధువు కోసం

  రాజ యోగం చేస్తాను   నీ  శక్తి కోసం.

  వరమివ్వు శివా      నను విడవనని.


• ధన్య వాదములు      శివా ధన్యవాదములు

  మార్గమును    శుచి చేసావు

  గమనము ను       సుగమనము చేసావు

  ధన్య వాదములు   శివా ధన్యవాదములు


యడ్ల శ్రీనివాసరావు 1 Feb 2024 10:00 pm.


490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...