ఒక మంత్రం
• చెపుతా ఒక మంత్రం
చెపుతా ఒక మంత్రం
• అది జీవన వేద తంత్రం
మానవ మనుగడకి శక్తి యంత్రం.
• ఆ మంత్రం పేరు
ఓం నమఃశివాయ.
అది పలికిన కలుగు
సుఖ సంతోషాల సౌఖ్యం.
• ఆ మంత్రానికి అర్దం
నేనొక ఆత్మను
చేస్తున్నాను
శివ పరమాత్మ కు వందనం.
• చెపుతా ఒక మంత్రం
చెపుతా ఒక మంత్రం
• అది జీవన వేద తంత్రం
మానవ మనుగడకి శక్తి యంత్రం.
• కలియుగ మాయలో విలవిలాడే
మనిషికి ఇది ఒక కవచం.
• మనసు పై దాడి చేసే రావణ
వికారాలకు ఇది ఒక అస్త్రం.
• ఈ పంచాక్షరీ మంత్రం
దేవతలందరూ ధ్యానించారు
సర్వ ప్రాప్తులను పొందారు.
• ఈ రాజయోగ తంత్రం
మునులందరూ స్మృతి చేసారు
జీవన్ముక్తి ని పొందారు.
• చెపుతా ఒక మంత్రం
చెపుతా ఒక మంత్రం
• అది జీవన వేద తంత్రం
మానవ మనుగడకి శక్తి యంత్రం.
యడ్ల శ్రీనివాసరావు 26 Feb 2024 , 6:00 AM.
No comments:
Post a Comment